*ఘనంగా ప్రపంచ వారసత్వ దినోత్సవ వేడుకలు.!*
*టూరిజం ప్లాజా లో జరిగిన ప్రపంచ వారసత్వ దినోత్సవం (వరల్డ్ హెరిటేజ్ డే) వేడుకలో..పాల్గొన్న; తెలంగాణ రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ. ఉప్పల శ్రీనివాస్ గుప్త గారు...*
ఈరోజు హైదరాబాద్ లోని బేగంపేట టూరిజం ప్లాజాలో..(హోటల్ ది ప్లాజా) తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ/తెలంగాణ టూరిజం ఆధ్వర్యంలో జరిగిన (వరల్డ్ హెరిటేజ్ డే) ప్రపంచ వారసత్వ దినోత్సవం.. వేడుకలను ను పురస్కరించుకుని, జరిగిన కార్యక్రమంలో.. *గౌరవనీయులైన ఆబ్కారీ, యువజన సేవల, క్రీడలు , పర్యాటకం, సంస్కృతి & పురావస్తు శాఖ మంత్రి శ్రీ వి శ్రీనివాస్ గౌడ్ గారు* ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ కార్యక్రమం ICOMOS ఇండియా (ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆన్ మాన్యుమెంట్స్ అండ్ సైట్స్ (తెలంగాణ స్టేట్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్)సహకారంతో నిర్వహించబడింది. ఈ సందర్భంగా..రాష్ట్ర ప్రజలకు, టూరిజం సిబ్బంది కి ప్రపంచ వారసత్వ దినోత్సవం శుభాకాంక్షలు తెలపటం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ/తెలంగాణ రాష్ట్ర టూరిజం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చేసిన ప్రొజెక్టర్ లో టూరిస్ట్ స్పాట్స్, పర్యటకులను ఆకర్షించేలా చిత్రీకరించిన టూరిస్ట్ ప్రాంతాలు, పర్యాటక ప్రదేశాల వీడియోలను ప్రారంభించి తిలకించారు. ఈ సందర్భంగా జరిగిన ప్రపంచ వారసత్వ దినోత్సవం కార్యక్రమంలో భాగంగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ప్రారంభోపన్యాసం చేశారు.
*ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో.. చైర్మన్ గారు మాట్లాడుతూ..* ప్రపంచ వారసత్వ దినోత్సవ సందర్భంగా.. డెక్కన్ హెరిటేజ్ అకాడమీ ట్రస్ట్ నిర్వహిస్తున్న హెరిటేజ్ కాన్ఫిరెన్స్ కు అంటే టూరిజం అనే సదస్సు కు విచ్చేసిన మీ అందరికీ నిర్వాహకులకు, మిత్రులకు, ప్రెస్ అండ్ మీడియా ప్రతినిధులకు వారసత్వ ప్రేమికులకు నమస్కారాలు..తెలియజేస్తున్న అన్నారు. యునెస్కో అనుబంధ సంస్థ ఇంటర్నేషనల్ కౌన్సిల్ అన్ మాన్యుమెంట్స్ అండ్ సైట్స్ (ఐకోమోస్) ప్రపంచ వ్యాప్తంగా ఏప్రిల్18 వ తేదీన ప్రపంచ వారసత్వ దినోత్సవాన్ని జరుపుతోంది అన్నారు. సాంస్కృతిక వారసత్వ సంపదను కాపాడి, పరిరక్షించేందుకు అనేక కార్యక్రమాలను ఐకోమోస్ చేపడుతోంది. 1982 లో ఐకోమోస్ ప్రతిపాదన ద్వారా యునెస్కో ఏప్రిల్ 18 న ప్రపంచ వారసత్వ దినోత్సవాన్ని జరుపుకోవాలని సభ్య దేశాలకు సూచించటంతో 1983 నుండి ప్రపంచ వారసత్వ దినోత్సవాన్ని జరుపుతున్నారు.ప్రపంచ దేశాల్లో
భిన్న చరిత్రలు,భిన్న విశ్వాసాలు భిన్న జీవన విధానాలు, విభిన్న సంస్కృతులున్నాయి. ఇవన్నీ , ఆయా దేశాల్లోని వారసత్వ సంపద ద్వారా వ్యక్తం చేయబడుతున్నాయి. వాటిలో, సాంస్కృతిక అంశాలు, చారిత్రక స్థలాలు, కట్టడాలు ముఖ్యమైనవి. అన్నారు.ఘనమైన వారసత్వ సంపద పట్ల స్థానిక ప్రజల్లో అవగాహన కల్పించి వారసత్వ పరిరక్షణలో భాగస్వామ్యం చేయటంతో పాటు ప్రపంచ దేశాలను ఒకటిగా చేయటమే ప్రపంచ వారసత్వ దినోత్సవ ముఖ్య ఉద్దేశం.అని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వం లో తెలంగాణ రాష్ట్రాన్ని అత్యద్భుతంగా తీర్చిదుద్దుతున్నారు. తెలంగాణ టూరిజం రంగాన్ని కూడా ఒక హబ్ లాగా తీర్చిదిద్దుతున్నారని చెప్పారు.తెలంగాణ లో టూరిజం రంగం
ఉమ్మడి రాష్ట్రంలో ఎంతో వివక్షకు గురి అయ్యిందని అన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తరువాత సీఎం కేసీఆర్ గారి నాయకత్వం లో తెలంగాణ టూరిజం అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నారు. రామప్పకు యునెస్కో గుర్తింపు కూడా వచ్చిందని, పోచంపల్లి ఉత్తమ పర్యాటక గ్రామంగా ఎన్నిక అయ్యాయని గుర్తు చేశారు. రాబోయే రోజుల్లో సీఎం కేసీఆర్ గారు, మంత్రి కే.టీ.ఆర్ గారు, రాష్ట్ర క్రీడలు, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గార్ల ఆధ్వర్యంలో తెలంగాణ టూరిజం రంగాన్ని తీర్చిదిద్ధి ఇంకా బాగా అభివృద్ధి చేస్తామని అన్నారు.
*ఈ కార్యక్రమంలో..* శ్రీ బి.మనోహర్ రావు గారు, టిఎస్‌టిడిసి ఎండి, శ్రీ ఎం.వేదకుమార్ గారు, డెక్కన్ హెరిటేజ్ అకాడమీ చైర్మన్, SP షోరే ఆర్కిటెక్ట్ & టౌన్ ప్లానర్, హైదరాబాద్,ఆర్. మధు ఒట్టోరి కల్చరల్ టూరిజం - ICOMOS సభ్యుడు - NSC కల్చరల్ టూరిజం,ICOMOS ఇండియా, డాక్టర్ డి.సత్యనారాయణ ,క్యూరేటర్ , గిరిజన మ్యూజియం శాఖ, శ్రీ బి. నారాయణ ,డిప్యూటీ డైరెక్టర్ డిపార్ట్‌మెంట్ ఎఫ్ హెరిటేజ్ తెలంగాణ, వరంగల్‌కు చెందిన చరిత్రకారుడు ప్రొఫెసర్. GSV సూర్యనారాయణ మూర్తి, టూరిజం ఆల్ హెచ్ఓడీస్,టూరిజం అధికారులు,టూరిజం కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.