నేడు నల్గొండ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి గారు...పురపాలక శాఖామాత్యులు
కల్వకుంట్ల తారక రామారావు గారిని.. అసెంబ్లీలోని వారి చాంబర్లో కలుసుకొని.. నల్గొండ లో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనులకు 219 కోట్ల రూపాయల నిధుల కేటాయింపు కొరకు అభ్యర్థించినారు.
వీటిలో.. కళా భారతి, ఉదయ సముద్రం బండ్ వెడల్పు, &సుందరీకరణ. శిల్పారామం, వల్లభ రావు చెరువు బండ్ సుందరీకరణ,ఇరిగేషన్ మరియు ఆర్ & బి కార్యాలయల నిర్మాణం, పాలిటెక్నిక్ కాలేజీ నుండి ఉదయ సముద్రం వరకు వయా వల్లభరావు చెరువు నామ్ రోడ్డు, పట్టణం లో ప్రతిరోజు మంచినీటి సరఫరాకు, డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల వద్ద మౌలిక సదుపాయాల కొరకు, పట్టణంలోని వివిధ ప్రదేశాలలో ఐదు చోట్ల హిందూ,ముస్లిం, క్రైస్తవ, గ్రేవ్ యార్డ్ ల ఆధునీకరణ, తదితర ఇరవై ఒక్క పనుల పూర్తి కొరకు 219 కోట్ల రూపాయలు మంజూరు చేయవలసిందిగా విజ్ఞప్తి చేశారు.
పురపాలక శాఖ మాత్యులు కేటిఆర్ గారు ఇందుకు సానుకూలంగా స్పందించినట్లు కంచర్ల తెలియజేశారు.