trs పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపుమేరకు.. నల్లగొండ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి
గారి ఆధ్వర్యంలో... నల్గొండ నియోజకవర్గం లోని నల్లగొండ తాసిల్దార్ కార్యాలయం ముందు, తిప్పర్తి,కనగల్,మాడుగుల పల్లి, మండల కేంద్రాల్లో.. టిఆర్ఎస్ పార్టీ నాయకులు రైతులు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం నిరసన దీక్ష చేపట్టారు.. నల్లగొండ కనగల్ మండల కేంద్రాల్లో పాల్గొన్న కంచర్ల... మాట్లాడుతూ..
కేంద్ర ప్రభుత్వం నిరంకుశమైన విధానంతో రాష్ట్ర ప్రభుత్వం పట్ల పక్షపాత వైఖరితో ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా కొర్రీలు పెడుతుందని.. రాజ్యాంగం లో నిర్దేశించిన విధంగా ధాన్యాన్ని మాత్రమే కేంద్రం కొనుగోలు చేయాలని ఉప్పుడు బియ్యం, చేసుకుంటారా నూకలు చేసుకుంటారా అది రాష్ట్ర పరిధిలోది కాదని ఇక్కడ పంట పండించిన ప్రతి గింజను పంజాబ్ తరహా లో సేకరించాలని, దేశమంతా ఒకే విధానాన్ని అనుసరించాలని.. కానీ మోడీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం పట్ల పక్షపాత ధోరణి ప్రదర్శిస్తూ ఇక్కడి రైతులకు అన్యాయం చేస్తుందని..
తెలంగాణ రాష్ట్రంలోని పండించిన పూర్తిగా కొనుగోలు చేసే వరకు ప్రభుత్వంతో పోరాటం ఆందోళనలు ఉధృతం చేస్తామని ఇందుకు రైతులందరూ సహకరించాలని కోరారు
ఈ నిరసన దీక్ష కార్యక్రమంలో కనగల్ తిప్పర్తి ఎంపీపీలు కరీం పాషా, నాగులవంచ విజయలక్ష్మి, తిప్పర్తి కనగల్ జడ్పీటీసీలు, పాశం రామ్ రెడ్డి, చిట్ల వెంకటేశం, మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్, సీనియర్ నాయకులు కటికం సత్తయ్య గౌడ్ సింగిల్విండో చైర్మన్ లు పాశం సంపత్ రెడ్డి వంగాల సహదేవరెడ్డి, దోటి శ్రీనివాస్, మండల రైతు సమన్వయ సమితి కోఆర్డినేటర్ ముత్తినేని శ్యామ్సుందర్ మండల పార్టీ అధ్యక్షులు, పల్ రెడ్డి రవీందర్ రెడ్డి, దేప వెంకట్ రెడ్డి, గాదె రామ్ రెడ్డి గుండా సత్యనారాయణ,బడుపుల శంకర్ వనపర్తి నాగేశ్వరావు, సంకు ధనలక్ష్మి,కొప్పుల విమలమ్మ, వైస్ ఎంపీపీ లు శ్రీధర్ రావు, ఏనుగు వెంకట్ రెడ్డి, సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు రొట్టెల రమేష్, కడారి కృష్ణయ్య పలువురు ఎంపీటీసీలు సర్పంచులు కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసన దీక్షలో పాల్గొన్నారు