*పేద విద్యార్థికి చేయూత అందించిన వై.ఆర్.పి. ఫౌండేషన్*
- - ప్రతిభ కలిగిన పేద విద్యార్థి విద్యాభ్యాసం కోసం లాప్ టాప్ అందజేత
- - దుండిగల్ లో ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చదువుతున్న విద్యార్థి
- - పేద విద్యార్థులకు అండగా నిలుస్తామని భరోసా
నల్లగొండ ; ప్రతిభ కలిగిన పేద విద్యార్థికి చేయూత అందించడమే కాక విద్యాభ్యాసానికి అండగా నిలిచింది వై.ఆర్.పి. ఫౌండేషన్.
దుండిగల్ లోని కాలేజ్ ఆఫ్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ లో ప్రధమ సంవత్సరం చదువుతున్న నల్లగొందకు చెందిన కొండా మణికుమార్ అనే పేద విద్యార్థికి విద్యాభ్యాసం కోసం లాప్ టాప్ తప్పని సరి కావడంతో తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితి, పేదరికం కారణంగా లాప్ టాప్ కొనుక్కోలేని పరిస్థితి ఉండడంతో పేద విద్యార్థులతో పాటు పలు సమాజ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న ప్రముఖ పారిశ్రామిక వేత్త యెలిశాల రవి ప్రసాద్ కు దృష్టికి పేద విద్యార్థి సమస్య చేరింది. విషయం తెలుసుకుని వెంటనే స్పందించిన వై.ఆర్.పి. ట్రస్ట్ చైర్మన్ రవి ప్రసాద్ 50 వేల రూపాయల విలువైన ల్యాప్ టాప్ ను నల్లగొండకు పంపించారు.
అదివారం నల్లగొండ పట్టణంలో వై.ఆర్.పి. ట్రస్ట్ చైర్మన్ రవిప్రసాద్ మాతృమూర్తి యెలిశాల సుశీలమ్మ చేతుల మీదుగా విద్యార్థి మణికుమార్ కు అందజేశారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ ఆర్గనైజర్ యామ దయాకర్, విద్యార్థి తల్లిదండ్రులు శ్రీనివాస్, ఉమారాణి పాల్గొన్నారు.