*క్రికెట్ టోర్నమెంట్ విజేతకు ఉప్పల ఫౌండేషన్ నుంచి 20,000/- చెక్కును ప్రైజ్ మని గా అందజేత!*
*TRSV -ఉప్పల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్రికెట్ టోర్నమెంట్ సీజన్-2 (నియోజకవర్గ స్థాయి టోర్నమెంట్) విజేత కు బహుమతులు ప్రదానోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న; తెలంగాణ రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ. ఉప్పల శ్రీనివాస్ గుప్త గారు.*
ఈరోజు హైదరాబాద్ లోని ఉప్పల్, రామంత పూర్ పాలిటెక్నిక్ జూనియర్ కళాశాల మైదానంలో.. TRSV-ఉప్పల్ నియోజకవర్గం ఆధ్వర్యంలో.. నిర్వహించిన *UPPAL CONSTITU ENCY CRICKET TOURNAMENT SEASON-2* ఉప్పల్ నియోజకవర్గ స్థాయి టోర్నమెంట్-2022. కార్యక్రమంలో భాగంగా ముఖ్య అతిథిగా ఉప్పల్ ఎమ్మెల్యే శ్రీ భేతి సుభాష్ రెడ్డి గారితో కలిసి పాల్గొని, విజేతలకు బహుమతులు అందజేశారు. తదనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. ఈ నెల 28 నుండి 30 వరకు నిర్వహించిన CRICKET TOURNAMENT-2022 , క్రికెట్ టోర్నమెంట్ సీజన్-2 పోటీలలో మొత్తం 16 టీములు పాల్గొన్నారు. ఈ క్రికెట్ టోర్నమెంట్ పోటీలలో రన్నర్స్ టీమ్ గా ఆనంద్ టీమ్, విన్నర్ టీమ్ గా కలిల్,గౌస్ టీమ్ నిలిచారు. *ఆ తర్వాత క్రికెట్ టోర్నమెంట్ విజేతకు ఈ సందర్భంగా ఉప్పల ఫౌండేషన్ నుంచి 20,000/- చెక్కును ప్రైజ్ మని గా ఉప్పల ఫౌండేషన్ చైర్మన్ మరియు రాష్ట్ర టూరిజంకార్పొరేషన్ చైర్మన్ శ్రీ. ఉప్పల శ్రీనివాస్ గుప్త చేతుల మీదుగా అందజేయడం జరిగింది.* ఆ తర్వాత ఈ కార్యక్రమానికి విచ్చేసిన సందర్భంగా టూరిజం చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్త గారికి షీల్డ్ బహుకరించి,శాలువతో సన్మానించడం జరిగింది.
*ఈ సందర్భంగా.. టూరిజం చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్త గారు మాట్లాడుతూ..* క్రికెట్ టోర్నమెంట్ జరుగుతున్న సందర్భంగా.. పాల్గొనడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ క్రీడలు క్రీడాకారులకు ఆనందం, ఆరోగ్యం తో పాటు అందరికి స్పూర్తి దాయకంగా ఉంటుంది అన్నారు. క్రీడలు మానసిక ఉల్లాసానికి దోహదపడతాయి.TRSV ఆధ్వర్యంలో రెండు సంవత్సరాలుగా నియోజకవర్గ స్థాయి, క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తూ అంకితభావంతో పనిచేస్తూ క్రీడాకారులను ప్రోత్సహించడం అభినందనీయమని అన్నారు.క్రీడాకారులుగా మీరు సాధించిన ప్రతి విజయం ఇతరులకు ఆదర్శంగా నిలవాలని అన్నారు.అదేవిధంగా క్రీడాకారులను ప్రోత్సాహించి సమాజానికి ఉపయోగపడేలా తీర్చిదిద్దాల్సిన భాధ్యతలు ప్రతి ఒక్కరూ తీసుకొవాలని సూచించారు. ఆరోగ్యవంతంగా జీవించాలంటే ప్రతి ఒక్కరూ క్రీడలు బాగా ఆడాలని అనవసరమైన విషయాలు వదిలేసి మంచి అలవాట్లు, సమయపాలన పాటిస్తూ, ఆహారంపై శ్రద్ధ వహించాలని సూచించారు. *సీఎం కేసీఆర్ గారి నాయకత్వంలో..* తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాలలో దూసుకుపోతున్నదని అన్నారు.అన్ని రకాల క్రీడలకు అనుకూలంగా..పని చేస్తూ క్రీడలకు, క్రీడా రంగానికి కూడా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని అన్నారు. కేసీఆర్ గారి నాయకత్వం లో, మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారి నేతృత్వంలో జిల్లాకు ఒక స్టేడియం కట్టడానికి ఏర్పాట్లు చేస్తున్నారని అన్నారు. క్రీడాకారులు మంచిగా ఆడి క్రీడలలో రాణించి, రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో విజయం సాధించి,దేశానికి, మన తెలంగాణ రాష్ట్రానికి సీఎం కేసీఆర్ గారికి,మీ తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలని కోరారు. నాకు కూడా క్రీడలు అంటే చాలా ఇష్టమని, క్రీడలకు, క్రీడాకారులకు నా వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుంది అని అన్నారు.ఈ సందర్భంగా క్రీడాకారులు అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్పారు.
*ఈ కార్యక్రమంలో..* GHMC మాజీ మేయర్ బొంతు రామ్ మోహన్ గారు, మాజీ స్టాండింగ్ కౌన్సిల్ మెంబెర్ గుళ్ళూరి అంజయ్య, చిలకా నగర్ కార్పొరేటర్ బన్నాల ప్రవీణ్ ,మేకల హన్మంత్ రెడ్డి, Trs సీనియర్ నాయకుడు, పాలిటెక్నిక్ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ వినయ్ కుమార్ ,TRSV జనరల్ సెక్రటరీ బి. ప్రశాంత్ గౌడ్, మరియు నిర్వాహకులు దినేష్, బాబు, రాజశేఖర్, శశిధర్, రంజిత్, మోహన్, మహేష్ టి. మహేష్, వెంకటేష్, TRSV నాయకులు, క్రీడాకారులు, తదితరులు పాల్గొన్నారు.