నల్లగొండ: ఉమ్మడి నల్లగొండ జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి జి. వేణు నల్లగొండ పట్టణంలోని స్వధార్ హోం, సఖి కేంద్రములను సందర్శించి హోములో ఉంటున్న బాధిత మహిళలను హొములో కల్పిస్తున్న వసతులను అడిగి తెలుసుకొన్నారు మరియు వారికి మానవ అక్రమ రవాణ వలన బాధితులు సంఘములో ఎదుర్కొనే సమస్యలు, రవణాకు పాల్పడినవారిికి విధించే శిక్షలు, బాధితులకు గల చట్టపరమైన హక్కులు, బాధితులకు అందించే సేవలు గురించి తెలిపి , నాగరిక సమాజంలో మానవ అక్రమ రవాణ, లైంగిక దోపిడీ అనాగరికమని తెలిపారు. హోమ్ నిర్వాహకులకు తగు సూచనలు చేసారు. తదుపరి మహిళా ప్రాంగణమును సందర్శించి ప్రాంగణములో మహిళలకు తెలంగాణ మహిళా సంక్షేమ అభివృద్ది శాఖ వారు అందచేస్తున్న వృత్తి శిక్షణలను అడిగి తెలుసుకొని సంస్ధ ఇంకా ఎక్కువ మంది సంస్ధ ద్వారా శిక్షణ తీసుకునేటట్లు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమములో స్వదార్ హోమ్ నిర్వాహకులు వెంకట్ రెడ్డి, హోములో ఉంటున్న మహిళలు, బాలికలు, సఖి కేంద్రము అడ్మిన్ మందాకిని మరియు సిబ్బంది, బాధిత మహిళ, మహిళా ప్రాంగణం జిల్లా మేనేజర్ అనిత మరియు సిబ్బంది పాల్గొన్నారు. 5 Attachments
|