రష్యా అధ్యక్షుడు పుతిన్ సంచలనం

 రష్యా అధ్యక్షుడు పుతిన్ సంచలనం


: అణ్వాయుద బలగాలు రెడీ కావాలంటూ ఆర్డర్, ప్రమాదకరమన్న నాటో By Rajashekhar Garrepally | Published: Sunday, February 27, 2022, 22:20 [IST] మాస్కో: అమెరికా సహా ప్రపంచ దేశాలు హెచ్చరిస్తున్నా.. ఉక్రెయిన్‌పై దాడులకు రష్యా వెనుకాడటం లేదు. ఇప్పటికే ఉక్రెయిన్ రాజధాని కీవ్ తోపాటు మరో రెండు నగరాలపై రష్యా బలగాలు పైచేయి సాధించాయి. కాగా, ఉక్రెయిన్ దేశంలో చర్చలు జరిపేందుకు సిద్ధమేనని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆదివారం ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందుకు ఉక్రెయిన్ కూడా అంగీకరించింది. దీంతో ఇరుదేశాల ప్రతినిధులు బెలారస్‌లో భేటీ అవుతున్నారు. అణ్వాయుధ బలగాలు రెడీ కావాలంటూ పుతిన్ సంచలనం ఇది ఇలావుండగా, రష్యా అధ్యక్షుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. అణ్వాయుధ బలగాలను సన్నద్ధం చేయాలని ఆర్మీ చీఫ్‌లను ఆదేశించారు పుతిన్. ఉక్రెయిన్‌పై దాడి నేపథ్యంలో పశ్చిమ దేశాలు, నాటో దళాలు రష్యాకు వ్యతిరేకంగా చర్యలు చేపడుతున్నాయని అన్నారు. స్విఫ్ట్ నుంచి రష్యాను తొలగించడం, ఆర్థిక ఆంక్షల కఠినతరం, రష్యా విమానాలకు గగనతల నిషేధం.. ఈ క్రమంలో పుతిన్ ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. by TaboolaSponsored Links OnePlus Nord CE 2 5G | Starting from ₹23,999 OnePlus Get your LLM at just INR.9,480/month. Limited seats left. Powered by Upgrad Learn More నాటో, పశ్చిమదేశాల పేరుతో పుతిన్ కీలక ఆదేశం ఉక్రెయిన్ పై సైనిక చర్య నేపథ్యంలో నాటో దేశాలు ప్రతీకార చర్యలకు దిగే అవకాశం ఉందని వ్లాదిమిర్ పుతిన్ అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో వాటి నుంచి ఎలాంటి ముప్పునైనా ఎదుర్కొనేందుకు అణ్వాయుధాలను అప్రమత్తంగా ఉంచాలని సైనిక చీఫ్‌లను పుతిన్ ఆదేశించినట్టు సమాచారం. పశ్చిమ దేశాలు మనతో సఖ్యతగా లేకపోగా చట్ట విరుద్ధమైన ఆర్థిక ఆంక్షలు విధించడాన్ని మనం చూస్తున్నామని ఆర్మీ చీఫ్‌లతో పుతిన్ అన్నారు. అలాగే నాటో దేశాల సీనియర్ అధికారులు కూడా రష్యాకు వ్యతిరేకంగా ప్రకటనలు చేస్తున్నారని చెప్పారు. ఈ పరిణామాల నేపథ్యంలో 'అణు దాడుల నిరోధక దళాలను ప్రత్యేక పోరాటానికి సిద్ధంగా ఉంచాలని రక్షణ మంత్రి, రష్యన్ సాయుధ దళాల జనరల్ స్టాఫ్ చీఫ్‌ను ఆదేశించారు రష్యా అధ్యక్షుడు పుతిన్. Ads by ప్రమాదకరం: పుతిన్ వ్యాఖ్యలపై నాటో మండిపాటు ఉక్రెయిన్‌పై రష్యా దాడుల నేపథ్యంలో ఇప్పటికే అంతర్జాతీయంగా ఉద్రిక్తతలు పెరిగాయి. తాజాగా అణ్వాయుధ బలగాలను హై అలెర్ట్‌గా ఉంచాలని ఆర్మీ చీఫ్‌లను పుతిన్‌ ఆదేశించడం మరింత ఆందోళన పెంచింది. ప్రపంచంలో అమెరికా తర్వాత భారీగా అణ్వాయుధాలు, బాలిస్టిక్ క్షిపణులు కలిగి ఉన్న దేశం రష్యా. ఇప్పుడీ అంశం కూడా ప్రపంచదేశాలను ఆందోళనకు గురి చేస్తోంది. పుతిన్ ఆదేశాలపై నాటో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పుతిన్ వ్యాఖ్యలను తప్పుబట్టింది. అలాంటి వ్యాఖ్యలు ప్రమాదకరమని, బాధ్యతారాహిత్యంతో కూడుకున్నవని నాటో కూటమి సెక్రటరీ జనరల్ జెన్స్ స్టోల్టెన్‌బర్గ్ వ్యాఖ్యానించారు. తనపై దాడులు చేస్తారనే భయంతో దాడులు చేసేందుకు సిద్ధమవడం సరికాదని రష్యాకు హితవు పలికారు.


Featured Post

ఉన్నత విద్యామండలి రెగ్యులర్‌ ఛైర్మన్‌గా లింబాద్రి*

  * 🔊ఉన్నత విద్యామండలి రెగ్యులర్‌ ఛైర్మన్‌గా లింబాద్రి * * 🔶ఉపాధ్యక్షుడిగా షేక్‌ మహమూద్‌ * * 🍥ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్ర ఉన్నత విద్యామం...