కోవిడ్ ఆంక్షలు కఠినంగా అమలు చేస్తాం : ఎస్పీ రెమా రాజేశ్వరి*

 *కోవిడ్ ఆంక్షలు కఠినంగా అమలు చేస్తాం : ఎస్పీ రెమా రాజేశ్వరి*


- - కోవిడ్ వ్యాప్తి నియంత్రణ కోసం అన్ని రకాల చర్యలు

- - సభలు, సమావేశాలు, ర్యాలీలు నిషేధం

- - మాస్క్ ధరించకపోతే జరిమానాలు తప్పవు


నల్లగొండ : కోవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ నియంత్రణ లక్ష్యంగా ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలను జిల్లాలో మరింత కఠినంగా అమలు చేయనున్నట్లు జిల్లా ఎస్పీ రెమా రాజేశ్వరి తెలిపారు.


కోవిడ్ వ్యాప్తి నియంత్రణ కోసం రాష్ట్ర ప్రభుత్వం జి.ఓ. ఎం.ఎస్. 1 విడుదల చేయడంతో పాటు ఆంక్షలను విధించిదని ఆమె చెప్పారు. జనవరి 10వ తేదీ వరకు ఈ ఆంక్షలు అమలులో ఉంటాయని తెలిపారు. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ర్యాలీలు, సభలు, సమావేశాలతో పాటు మతపరమైన, రాజకీయ, ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణపై సైతం నిషేధం విధించినట్లు ఆమె తెలిపారు. అదే సమయంలో షాపింగ్ మాల్స్, ప్రజా రవాణా వ్యవస్థ, ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలలో కోవిడ్ నిబంధనలు ఖచ్చితంగా అమలు చేయాలన్నారు. ప్రతి ఒక్కరూ విధిగా మాస్క్ ధరించాలని, భౌతిక దూరం పాటించే విధంగా చర్యలు తీసుకోవాలని, ఎప్పటికప్పుడు పరిసరాలను సానిటైజ్ చేయాలని ఆమె తెలిపారు. ప్రతి చోటా సానిటైజర్ అందుబాటులో ఉంచాలని, థర్మల్ స్క్రీనింగ్ చేయడం ద్వారా కోవిడ్ లక్షణాలను గుర్తించే విధంగా అన్ని రకాల చర్యలు చేపట్టాలని సూచించారు. విద్యాసంస్థలలో ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులంతా విధిగా మాస్క్ ధరించాలని, అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. బహిరంగ ప్రదేశాలలో మాస్క్ ధరించకపోతే వెయ్యి రూపాయల జరిమానా మరింత కఠినంగా అమలు చేస్తామని, వయోవృద్ధులు, వివిధ రకాల ఆరోగ్య సమస్యలు ఉన్న వారు విధిగా అన్ని రకాల కోవిడ్ జాగ్రత్తలు వహిస్తూ అత్యవసరమైతే తప్ప బయటికి రాకుండా చూసుకోవాలని కోరారు.


కోవిడ్ బారిన పడకుండా ప్రజలను రక్షించే క్రమంలో తీసుకుంటున్న చర్యలకు జిల్లా ప్రజలంతా తమతో సహకరించాలని ఆమె కోరారు.

Featured Post

ఉన్నత విద్యామండలి రెగ్యులర్‌ ఛైర్మన్‌గా లింబాద్రి*

  * 🔊ఉన్నత విద్యామండలి రెగ్యులర్‌ ఛైర్మన్‌గా లింబాద్రి * * 🔶ఉపాధ్యక్షుడిగా షేక్‌ మహమూద్‌ * * 🍥ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్ర ఉన్నత విద్యామం...