- జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా నూతన సంవత్సర వేడుకలు

 *తెలంగాణ రాష్ట్రంలో నల్లగొండను అగ్రభాగంలో నిలపాలి : ఎస్పీ రెమా రాజేశ్వరి*

- - జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా నూతన సంవత్సర వేడు


- - విధి నిర్వహణతో పాటు ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచన

- - ప్రజల్లో పోలీసులపై ఉన్న గౌరవాన్ని మరింత పెంచాలి


నల్లగొండ : మంచి పనితీరు, శాంతి భద్రతల పరిరక్షణలో మరింత బాధ్యతాయుతంగా పనిచేస్తూ జిల్లా పోలీసు శాఖను తెలంగాణ రాష్ట్రంలో అగ్రభాగంలో నిలపాలని జిల్లా ఎస్పీ శ్రీమతి రెమా రాజేశ్వరి సూచించారు.


నూతన సంవత్సర సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆమె కేక్ కట్ చేసి పోలీస్ అధికారులు, సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆమె మాట్లాడుతూ 2021 సంవత్సరం ప్రతి ఒక్కరి జీవితాలలో చాలా మార్పు తెచ్చిందని, కోవిడ్ కష్టకాలంలో ముందు వరుసలో ఉండి ప్రజల జీవితాలకు రక్షణ కల్పించే విధంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ పోలీసులు విధి నిర్వహణ చేయడం అభినందనీయన్నారు. పోలీస్ శాఖ పట్ల ప్రజలలో చాలా గౌరవం ఉన్నదని ఆ గౌరవాన్ని నిలిపే విధంగా విధి నిర్వహణ చేస్తూ ప్రజల ప్రాణాలను కాపాడడం లక్ష్యంగా, వారు కోవిడ్ బారిన పడకుండా చేయగలిగామని ఆమె చెప్పారు. పోలీస్ అధికారులు, సిబ్బంది ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యాలను కాపాడుకోవాలని, ఆరోగ్య రక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆమె సూచించారు. ఆరోగ్య పరిరక్షణలో భాగంగా నిత్యం యోగా లాంటి ఆరోగ్య సూత్రాలను పాటించాలని, మన ఉద్యోగాన్ని మనం ఎంత ప్రేమిస్తున్నామో అదే పద్దతిలో జాగ్రత్తగా విధి నిర్వహణ చేసుకోవాలన్నారు. తెలంగాణ జిల్లాల్లో దాదాపు అన్ని ప్రాంతాలలో నల్లగొండ జిల్లాకు సంబంధించిన పోలీస్ అధికారులు విధి నిర్వహణ చేస్తున్నారని ఇది జిల్లాకు  ఎంతో  గర్వకారణమని ఆమె అభినందించారు. 2022లో మరింత సమిష్టిగా పనిచేస్తూ మంచి ఫలితాలు, విజయలను సాధిస్తూ జిల్లా పోలీసుల గౌరవం పెంచే విధంగా ముందుకు సాగాలని ఆకాంక్షించారు.


కార్యక్రమంలో డిటిసి ఎస్పీ సతీష్ చోడగిరి, డిఎస్పీలు వెంకటేశ్వర్ రెడ్డి, ఆనంద్ రెడ్డి, వెంకటేశ్వర్ రావు, సురేష్ కుమార్, మొగిలయ్య, ఆర్.ఐ.లు నర్సింహా చారి, శ్రీనివాస్, నర్సింహా, సిఐలు బాలగోపాల్, చంద్రశేఖర్ రెడ్డి, నాగరాజు, శంకర్ రెడ్డి, అదిరెడ్డి, నిగిడాల సురేష్, రౌతు గోపి, సత్యనారాయణ, సురేష్ కుమార్, అంజయ్య, పి.ఎన్.డి. ప్రసాద్,

పోలీస్ అధికారుల సంఘం జిల్లా అధ్యక్షులు జయరాజ్, సోమయ్య, డిపిఓ ఏ.ఓ.మంజు భార్గవి, సూపరింటెండెంట్లు అతిఖుర్ రెహమాన్, బి. దయాకర్ రావు, సబితా రాణి, మహిళా శిశు సంక్షేమ శాఖ జిల్లా కో-ఆర్డినెటర్ మాలె శరణ్యా రెడ్డి, రెడ్ క్రాస్ సభ్యులు శ్రీనివాస్ రెడ్డి, ఐద్వా నాయకురాలు ప్రభావతి, సిపిఎం నాయకులు పాలడుగు నాగార్జున,  బ్రహ్మకుమారి సభ్యులు తదితరులు పాల్గొని నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.

Featured Post

ఉన్నత విద్యామండలి రెగ్యులర్‌ ఛైర్మన్‌గా లింబాద్రి*

  * 🔊ఉన్నత విద్యామండలి రెగ్యులర్‌ ఛైర్మన్‌గా లింబాద్రి * * 🔶ఉపాధ్యక్షుడిగా షేక్‌ మహమూద్‌ * * 🍥ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్ర ఉన్నత విద్యామం...