*పోడు భూముల సమస్యల పై అఖిలపక్ష మీటింగ్ కి హాజరయిన....ఎంపీ కోమటిరెడ్డి
* 👉టిఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత మొదటి సారి పోడు భూముల పై అఖిలపక్షం ఏర్పాటు చేయడం చాలా సంతోషం 👉పోడు భూముల సమస్యలను మూడు ఎకరాల భూమి, నిరుద్యోగ భృతి లాగా కాకుండా వెంటనే పరిష్కరించాలని ముఖ్యమంత్రి గారిని కోరుచున్నాము 👉 భువనగిరి పట్టణంలో రోడ్డు వెడల్పు లో నష్టపోయిన వారికి నష్ట పరిహారం విషయంలో ముఖ్యమంత్రి గారికి అపాయింట్మెంట్ కోరాను 👉నెల రోజుల్లో పోడు భూములు కలిగిన బిడ్డలందరికీ పట్టాలు ఇప్పించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్న... *యాదాద్రి భువనగిరి జిల్లా:-* పోడు భూముల సమస్యల పై భువనగిరి పట్టణంలోని వివేర హోటల్ సమావేశ హాల్ నందు జిల్లా కలెక్టర్ మరియు సంబంధిత అధికారుల, అఖిలపక్షం ఆధ్వర్యంలో రివ్యూ మీటింగ్ కార్యక్రమంలో భువనగిరి పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు పాల్గొన్నారు...ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ 8 సంవత్సరాలలో మొదటి సారి అఖిలపక్ష మీటింగ్ పెట్టారు రాష్ట్రం లో అడవిని నమ్ముకుని బ్రతుకున్న బిడ్డల జీవితాలు దారుణంగా అయ్యాయి. పొడుభూముల కోసం చిన్నారులు కూడా జైలు జీవితం చూడాల్సి వచ్చింది..అప్పులు తెచ్చి వేసిన పంట చేతికి రాకముందే అధికారులు నాశనం చేస్తుంటే ఆ రైతుల వేదన మాటల్లో చెప్పలేంది..ఏది ఏమైనా పోడు భూముల పరిష్కారానికి మేము సహకరిస్తాం తెలంగాణ గిరిజన అడవి బిడ్డల కోసం అఖిలపక్ష మీటింగ్ లో మాట్లాడము రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం దరఖాస్తు లు తీసుకుంటుంది గిరిజన బిడ్డలు అందరూ దరఖాస్తు చేసుకోండి *భువనగిరి పట్టణ వ్యాపారుల కోసం కేసీఆర్ అపాయింట్ మెంట్ కోరిన ఎంపీ కోమటిరెడ్డి* యాదాద్రి ప్రారంభోత్సవం కోసం రోడ్డు వెడల్పు పనులు జరుగుతున్న సందర్భంగా రోడ్డు సమీపంలో ఉన్న వ్యాపారస్తులకు ఎలాంటి హామీ ఇవ్వకుండా వారికి ప్రత్యన్నాయం చూయించకుండా షాపులను కూల్చివేయటం దారుణం. వ్యాపారస్తులకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తాను అని కోమటిరెడ్డి హామీ ఇచ్చారు. భువనగిరి బస్ డిపో మరియు రైల్వే సమస్య ల పై కేసీఆర్ అపాయింట్ మెంట్ కొరను అని అపాయింట్ మెంట్ ఇస్తే పలు సమస్యల పై చర్చిస్తాను అని కోమటిరెడ్డి అన్నారు....