టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, నల్లగొండ పట్టణానికి చెందిన లయన్ చిలుకల గోవర్ధన్ గుండెపోటుతో మృతి చెందారు
. చిలుక గోవర్ధన్ లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ కు గవర్నర్ గా కూడా పనిచేశారు. నల్లగొండ పట్టణంలోని నటరాజ్ సినిమా థియోటర్ యజమాని. నల్లగొండ రాజకీయాల్లో సుదీర్ఘ కాలం క్రియాశీలంగా పనిచేశారు. నల్లగొండ మున్సిపల్ కౌన్సిలర్ గా కూడా సేవలు అందించారు. చిలుకలగోవర్ధన్ పార్ధివదేహాన్ని హైదరాబాద్ నుంచి నల్లగొండ నటరాజ్ థియేటర్ లో సందర్శనార్థం 9.30 గంటలకు తీసుకురానున్నారు. మధ్యాహ్నం 2.30 గంటలకు హైదరాబాద్ రోడ్లు పాలిటెక్నిక్ కళాశాల వెనుక శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
మంత్రి జగదీష్ రెడ్డి నివాళి
సీనియర్ టీఆర్ఎస్ నేత చిలుకల గోవర్ధన్ ఆకస్మిఖ మరణం పట్ల రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కౌన్సిలర్ గా రాజకీయ ప్రస్థానం మొదలు పెట్టిన ఆయన లైన్స్ క్లబ్, వాసవి సేవా సమితిల కార్యక్రమాల ద్వారా ప్రజలకు చేరువైన నాయకుడని చిలుకల గోవర్ధన్ ను మంత్రి గుర్తు చేసుకున్నారు. తన అమెరికా పర్యటనలో ప్రవాసాంధ్రులు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణా సమాజం అభివృద్ధి చెందుతున్న తీరును వివరించారని ఆయన చెప్పారు. నిబద్ధత, నిజాయితీ, ఉన్నది ఉన్నట్లు మాట్లాడడం నిర్మొహమాటంగా వ్యవహరించడం వంటి లక్షణాలతో నల్లగొండ జిల్లా ప్రజల హృదయాలలో చిరస్మరణీయుడిగా నిలిచి పోతారని మంత్రి జగదీష్ రెడ్డి తెలిపారు.