*రోడ్డు ప్రమాదాల నివారణకు అన్ని జాగ్రత్తలు : ట్రాఫిక్ సిఐ చీర్ల శ్రీనివాష్* -
- ప్రమాదాల నివారణకు ప్రజలకు సహకరించాలి - - రోడ్డు ప్రమాదాల నివారణ కోసం మరిన్ని అవగాహన కార్యక్రమాలు - - ట్రాఫిక్ సమస్యలకు తమ దృష్టికి తీసుకురండి నల్లగొండ : రోడ్డు ప్రమాదాల నివారణ లక్ష్యంగా అన్ని రకాల జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నట్లు ట్రాఫిక్ సిఐ చీర్ల శ్రీనివాస్ తెలిపారు. సోమవారం నల్లగొండ పట్టణంలోని క్లాక్ టవర్ నుండి దేవరకొండ రోడ్డులో అవసరం లేని తొమ్మిది ప్రాంతాలలో మీడియం (డివైడర్) లను మూసివేశారు. దేవరకొండ రోడ్డులో అనవసరంగా ఓపెన్ చేసి ఉన్న మిడియంల కారణంగా అనేక ప్రాంతాలలో ప్రమాదాలు జరుగుతున్న విషయాన్ని గుర్తించి వాటన్నింటిని మూసివేసినట్లు చెప్పారు. రోడ్డు ప్రమాదాలను నివారించడం లక్ష్యంగా అవసరమైన అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటూ ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. రోడ్డు ప్రమాదాల నివారణ లక్ష్యంగా తాము తీసుకుంటున్న చర్యలకు ప్రజలంతా సహకరించాలని కోరారు. పట్టణంలో ఎక్కడైనా ట్రాఫిక్ సమస్యలు ఉన్నా, ప్రజలు, పాఠశాల విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నా అలాంటి సమస్యలను తమ దృష్టికి తీసుకువస్తే చర్యలు తీసుకొని వాటిని పరిష్కరిస్తామని తెలిపారు. రోడ్డు ప్రమాదాల నివారణ కోసం మరిన్ని చర్యలు తీసుకుంటూ ప్రజలకు అవగాహన కల్పించే విధంగా కార్యక్రమాలు నిర్వహిస్తామని ఆయన తెలిపారు. డివైడర్ల మధ్య ఖాళీలను మూసి వేసిన కార్యక్రమంలో ట్రాఫిక్ సిబ్బంది జయానందం, సుధాకర్, మహేందర్, వెంకటేశ్వర్లు, వెంకట్ రెడ్డి తదితరులున్నారు