ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి సహకరించాలి : చీర్ల.శ్రీనివాస్*

 *ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి సహకరించాలి : చీర్ల.శ్రీనివాస్*


- - నెహ్రూ గంజ్ లో ఆక్రమణలు, దుకాణాల ముందు సామాగ్రి తీసువేయలని సూచన - - ట్రాఫిక్ సమస్యలపై వ్యాపారులకు అవగాహన కల్పించిన ట్రాఫిక్ సిఐ - - ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి సహకరించాలి నల్లగొండ : పట్టణంలో ట్రాఫిక్ సమస్యల పరిష్కారం, వాహనదారులకు ఇబ్బంది కలగకుండా ప్రజలు, వ్యాపారులు సహకరించాలని ట్రాఫిక్ సిఐ చీర్ల శ్రీనివాస్ కోరారు. శుక్రవారం నల్లగొండ పట్టణంలోని పాత చౌరస్తా నుండి నెహ్రూ గంజ్ వరకు దుకాణాల ముందు ఉన్న సామగ్రి, ఆక్రమణల కారణంగా వాహనదారులు ఎదుర్కొంటున్న సమస్యల పట్ల దుకాణదారులు, వ్యాపారస్తులకు ఆయన అవగాహన కల్పించారు. పాత చౌరస్తా నుండి గంజ్ వరకు ఉన్న రోడ్డు చిన్నగా ఉండడం, వాహనాలు పెద్ద సంఖ్యలో తిరుగుతుండడం, ఉదయం సమయంలో భారీ వాహనాల రాకపోకల కారణంగా చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితులను తాము అనేక సమయాల్లో గుర్తించామన్నారు. ఇక వీటికి తోడుగా చాలా మంది దుకాణదారులు వారి షాపులకు సంబందించిన సామాగ్రిని షాపుల ముందు పెట్టడం కారణంగా రోడ్డు మరింత ఇరుకుగా మారి ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఇక నుండి దుకాణాల నిర్వాహకులు, వ్యాపారులు రోడ్డును అక్రమించకుండా, దుకాణాల ముందు వారి వ్యాపారాలకు సంబందించిన వస్తువులు ఉంచకుండా సహకరించాలని సూచించారు. ట్రాఫిక్ సమస్య పెరగడం కారణంగా ఎదురయ్యే పలు విషయాలను వారికి వివరించి వారిలో అవగాహన కల్పించారు. ట్రాఫిక్ సిఐ శ్రీనివాస్ వెంట ఎస్.ఐ. జయానందం, ఏ.ఎస్.ఐ. రవి, కానిస్టేబుల్స్ మహేందర్, వెంకటేశ్వర్లు, జాన్సన్, వెంకట్ రెడ్డిలతో పాటు వ్యాపారులున్నారు.

Featured Post

ఉన్నత విద్యామండలి రెగ్యులర్‌ ఛైర్మన్‌గా లింబాద్రి*

  * 🔊ఉన్నత విద్యామండలి రెగ్యులర్‌ ఛైర్మన్‌గా లింబాద్రి * * 🔶ఉపాధ్యక్షుడిగా షేక్‌ మహమూద్‌ * * 🍥ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్ర ఉన్నత విద్యామం...