*ఫ్లాగ్ డే సందర్భంగా ఆన్ లైన్ ఓపెన్ హౌస్ : నర్మద* - - కోవిడ్ నిబంధనల దృష్ట్యా ఆన్ లైన్ లో ఓపెన్ హౌస్ - - అమరుల త్యాగాలు స్ఫూర్తివంతమన్న అధికారులు - - ప్రజా భద్రతే తమ లక్ష్యంగా ముందుకు సాగుతున్నామన్న పోలీసులు నల్లగొండ : పోలీస్ అమరవీరుల త్యాగాలను స్మరించుకోవడం ఎంతో గర్వకారణంగా ఉందని, వారి త్యాగాలు భావితరాలకు ఎంతో స్ఫూర్తివంతంగా నిలుస్తాయని అదనపు ఎస్పీ శ్రీమతి సి. నర్మద అన్నారు. శుక్రవారం జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలో కోవిడ్ మార్గదర్శకాల నేపథ్యంలో పోలీస్ అమరుల త్యాగాలను స్మరిస్తూ నిర్వహిస్తున్న ఫ్లాగ్ డే సందర్భంగా ఆన్ లైన్ లో ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించారు. నల్లగొండ జిల్లా పోలీసులు. ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఆమె మాట్లాడుతూ పోలీస్ శాఖలో వినియోగించే ప్రతి ఆయుధం పట్ల విద్యార్థులలో అవగాహన కల్పించడం లక్ష్యంగా ఓపెన్ హౌస్ ప్రతి ఏటా నిర్వహించడం జరుగుతుందని ఆమె తెలిపారు. అయితే పాఠశాల, కళాశాల విద్యార్థులకు పోలీస్ ఆయుధాల వినియోగం, అవగాహన కోసం నేరుగా పోలీస్ స్టేషన్లకు, జిల్లా పోలీసు కార్యాలయానికి ఆహ్వానించ జి మోడం జరుగుతుందని కానీ ప్రభుత్వం కోవిడ్ మార్గదర్శకాలను జారీ చేసిన క్రమంలో నిబంధనలకు అనుగుణంగా ఆన్ లైన్ ద్వారా నిర్వహిస్తున్నట్లు ఆమె వివరించారు. ప్రజల రక్షణ, ప్రజాసేవ కోసం ప్రాణాలను అర్పించిన అమరవీరుల త్యాగాలను మరువలేమని, వారు ఎల్లప్పుడూ మన గుండెల్లో ఉంటారన్నారు. అలాంటి త్యాగధనులు మన మధ్య లేకపోయినా వారి త్యాగాలను స్మరిస్తూనే ఉంటామని, అసువులు బాసిన అమరవీరుల కుటుంబాన్ని కాపాడుకోవడం, వారికి అండగా నిలవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. అమరవీరుల త్యాగాలు మరువలేనివని. పోలీసులు విధుల్లో భాగంగా కుటుంబానికి, పండగలకు, సంతోషాలకు, సరదాలకు దూరంగా ఉంటూ సమాజ సేవ చేస్తారన్నారు. ప్రజా రక్షణ కోసం ప్రాణాలను సైతం తృణప్రాయంగా విడిచే పోలీస్ అమరవీరుల త్యాగాలు వెలకట్టలేని వని కొనియాడారు. శాంతిభద్రతల పరిరక్షణతో పాటు దేశంలో అంతర్గత భద్రత ప్రజల రక్షణ ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ ఇలా ప్రతి సందర్భంలోనూ పోలీసు వ్యవస్థ చాలా కీలకంగా పని చేసిందన్నారు. రక్షణ అంటే గుర్తువచ్చేది పోలీస్ అని అలాంటి పోలీసు విధినిర్వహణ చాలా శ్రమతో కూడుకున్నదని, ప్రతి ఒక్కరు ఏ ఆపద వచ్చినా ఆశ్రయించేది పోలీసులనే అని ఆమె గుర్తు చేశారు. ఓపెన్ హౌస్ సందర్భంగా డాగ్ స్క్వాడ్, బాంబ్ డిస్పోజల్ టీం, క్లూస్ టీములతో పాటు పలు రకాల ఆయుధాలు, వాటి పేర్లు, వినియోగం, ట్రాఫిక్ పోలీస్ ఆధ్వర్యంలో వేగంగా వెళ్లే వాహనాలను గుర్తించి చాలనాలు విధించే పద్ధతి, నకిలీ నోట్లు కనిపెట్టడం, దొంగతనాలు జరిగినప్పుడు ఆనవాళ్లు గుర్తించే విధానాలపై అవహగన కల్పించారు. ఫ్లాగ్ డే సందర్భంగా ఈ నెల 21 నుండి 31 తేదీ వరకు జిల్లాలో పోలీస్ అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ వివిధ రకాల అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, అందులో భాగంగా విద్యార్థిని విద్యార్థులకు, పోలీసులకు వ్యాసరచన పోటీలు, ఫోటోగ్రఫీ, షార్ట్ ఫిలిం మేకింగ్ విభాగాలలో పోటీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఆయుధాల పట్ల విద్యార్థులకు అవగాహన కోసం ఆన్లైన్ ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఓపెన్ హౌస్ కార్యక్రమంలో ఏ.ఆర్. డిఎస్పీ సురేష్ కుమార్, ఆర్.ఐ.లు స్పర్జన్ రాజ్, నర్సింహా చారి, శ్రీనివాస్, కృష్ణా రావు, నర్సింహా, ట్రాఫిక్ సిఐ చీర్ల శ్రీనివాస్, పోలీస్ అధికారుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు జయరాజ్, ఆర్.ఎస్.ఐ. రాహుల్, సోమయ్య, నర్సింహా, రియాజ్, వెంకన్న తదితరులున్నారు
Featured Post
ఉన్నత విద్యామండలి రెగ్యులర్ ఛైర్మన్‌గా లింబాద్రి*
* 🔊ఉన్నత విద్యామండలి రెగ్యులర్ ఛైర్మన్‌గా లింబాద్రి * * 🔶ఉపాధ్యక్షుడిగా షేక్ మహమూద్ * * 🍥ఈనాడు, హైదరాబాద్: రాష్ట్ర ఉన్నత విద్యామం...

-
* 🔊ఉన్నత విద్యామండలి రెగ్యులర్ ఛైర్మన్‌గా లింబాద్రి * * 🔶ఉపాధ్యక్షుడిగా షేక్ మహమూద్ * * 🍥ఈనాడు, హైదరాబాద్: రాష్ట్ర ఉన్నత విద్యామం...
-
బీఆర్ఎస్ ను గద్దె దించేందుకే కాంగ్రెస్ లో చేరుతున్నా, రాహుల్ గాంధీతో భేటీ తర్వాత పొంగులేటి సంచలన వ్యాఖ్యలు Telangana Congress : మాజీ ఎంపీ ప...
-
మొగుళ్ళపల్లి యువ సేన ఆధ్వర్యంలో నాగ సాయి మనికంఠ ఇంటర్ 1st మరియు సెంకండ్ యియర్ మొత్తం ఫీస్ కట్టి చదించడం జరిగింది కాలేజ్ లో ప్రదమ శ్రేణిలో ...
-
ఎమ్మెల్యే గానే పోటీ చేస్తా : ఎంపీ వెంకట్ రెడ్డి రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో నల్గొండ అసెంబ్లీ స...
-
జిల్లా ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రిలో.... కళ్ళజబ్బులకు సంబంధించి శుక్లాలు... క్యాటరాక్ట్ చికిత్సల కు సంబంధించి అధునాతన... ఫ్యాకో మిషన్.ను...