* ఎయిమ్స్ హాస్పిటల్ ని సందర్శించనున్న హర్యానా రాష్ట్ర గవర్నర్ బండారు దత్తాత్రేయ ఎంపీ కోమటిరెడ్డి..*
నార్కేట్ పల్లి మండలంలో విలేకరుల సమావేశంలో మాట్లాడిన ఎంపీ కోమటిరెడ్డి...
యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ లో ఏర్పాటు అయిన ప్రతిష్ఠాత్మక ఎయిమ్స్ ( అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ) ఆస్పత్రి అభివృద్ధి పై హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ తో కలిసి నేడు అక్టోబర్ 1న ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించనున్నట్లు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు తనతో పాటు దత్తాత్రేయ సందర్శించి సమీక్షించే ఈ సమావేశానికి జిల్లా కలెక్టర్ తో పాటు రాష్ట్ర వైద్య శాఖ ఉన్నతాధికారులు పాల్గొంటారని చెప్పారు ఆసుపత్రి ఆధునీకరణకు చేపట్టాల్సిన చర్యలు మెరుగైన సేవలు అందించే దిశగా వివిధ విభాగాల సిబ్బంది నియామకాలపై పూర్తిస్థాయిలో సమీక్షిస్తామని తెలిపారు నల్గొండ జిల్లా నార్కెట్ పల్లి నకిరేకల్ మునుగోడు నియోజకవర్గల్లో పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం అధికారులతో రోడ్లు భవనాల మరమ్మతులపై నిర్వహించిన సమీక్ష సమావేశం అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎంపీ మాట్లాడారు బీబీనగర్ ఎయిమ్స్ పట్ల రాష్ట్ర ప్రభుత్వం పట్టింపులేని ధోరణి అవలంబిస్తోందని ఆయన ఆరోపించారు పూర్తిస్థాయిలో ఎయిమ్స్ అభివృద్ధి చెందితే ఢిల్లీ స్థాయి కార్పొరేట్ వైద్యం అందుబాటులోకి వచ్చి రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో కొనసాగుతున్న గాంధీ ఉస్మానియా వంటి ప్రభుత్వ పెద్ద ఆస్పత్రులపై భారం తగ్గుతుందన్నారు ఎయిమ్స్ లో చేపట్టాల్సిన అభివృద్ధి ఆధునీకరణ పనులకు సంబంధించి రూ 798 కోట్లకు టెండర్లు పిలిచినట్లు రెండు రోజుల క్రితం ఢిల్లీలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మాండవియాను కలిసినప్పుడు తనతో చెప్పారని ఎంపీ వెల్లడించారు అదనంగా మరో 40 కోట్లు కేటాయించాలని కోరానన్నారు కాగా 52 కిలోమీటర్ల నిడివిగల చిట్యాల భువనగిరి రాష్ట్ర రహదారిని విస్తరించి జాతీయ రహదారి పరిధిలోకి తేవాలని కేంద్ర రవాణా శాఖ మంత్రి గడ్కరీ ని కలిసి కోరగా సూచనప్రాయంగా అంగీకరించారు కోమటి రెడ్డి తెలిపారు అదేవిధంగా కొండమల్లేపల్లి నల్గొండ రహదారి కూడా రాష్ట్ర రహదారి గా గుర్తించాలనే విజ్ఞాపనను తీసుకువచ్చినట్లు తెలిపారు నకిరేకల్ మునుగోడు నియోజకవర్గల్లో పిఎంజిఎస్ వై కింద చేపట్టి ఇ అసంపూర్తిగా మిగిలిన రోడ్లు భవనాల నిర్మాణం ప్రగతినీ ప్రకృతి వైపరీత్యాల తో ధ్వంసమైన రోడ్ల వివరాలను తెలుసుకుని వాటి మరమ్మతులకు రూపాయలు 40 కోట్ల మేర అంచనాలు తయారు చేయవలసిందిగా ఆయన పిఆర్ అధికారులను ఆదేశించారు కట్టంగూరు బి వెల్లంల జడ్.పి.హెచ్.ఎస్ లలో 2 తరగతి గదులు చొప్పున అమ్మనబోలు లో సిసి రోడ్ ఆసఫ్ నహార్ కాల్వకు బతుకమ్మ మెట్లు నిర్మాణానికి డీఎం ఎఫ్ కింద అ ప్రతిపాదనలు తయారు చేయవలసిందిగా సూచించారు కాగా వచ్చే రెండేళ్ళలో నియోజకవర్గంలోని ప్రతి రోడ్డును పిఎంజిఎస్ వై నిధులతో బిటిగా మార్చేందుకు కృషి చేస్తానన్నారు ఇకపై తాను రాజకీయాలపై వీలైనంత తక్కువగా మాట్లాడతానని గతంలో చేసిన ప్రకటనకు కట్టుబడి ఉన్నానన్నారు రాజకీయాల కన్నా తనకు నియోజకవర్గ అభివృద్ధి ముఖ్యమని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి పునరుద్ఘాటించారు ఈ సమావేశంలో డిఈఈలు విష్ణువర్ధన్ రెడ్డి ఇ రఘుపతి పాల మోహన్ డిసిసి అధ్యక్షుడు శంకర్ నాయక్ గుమ్మడి మోహన్ రెడ్డి ఇ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బత్తుల ఊశయ్య గౌడ్ ఎంపీటీసీ కొంపల్లి సైదులు అయితరాజు యాదయ్య వడ్డే భూపాల్ రెడ్డి జెర్రిపోతుల భరత్ కిట్టు యానాల రాంరెడ్డి చిక్కుళ్ల శివ తదితరులు పాల్గొన్నారు...