వైద్యుల అనుమతి లేకుండా పెయిన్ కిల్లర్స్ విక్రయిస్తున్న వ్యక్తి అరెస్ట్ : డిఐజి రంగనాధ్*

 *వైద్యుల అనుమతి లేకుండా పెయిన్ కిల్లర్స్ విక్రయిస్తున్న వ్యక్తి అరెస్ట్ : డిఐజి రంగనాధ్*

- - మెడికల్ షాపు నిర్వాహకుడు, బానిసగా మారిన మరో వ్యక్తి అరెస్ట్

- - యువతను మత్తుతో బానిసలుగా మారుస్తున్న డేంజర్ టాబ్ లెట్స్

- - గంజాయి దొరకక హై డోస్ పెయిన్ కిల్లర్ *Spasmo - Proxyvon Plus* కు బానిసలుగా మారుతున్న యువత


నల్లగొండ : వైద్యుల ప్రెస్క్రిప్షన్ ద్వారా మాత్రమే విక్రయించాల్సిన హై డోస్ పెయిన్ కిల్లర్స్ విక్రయిస్తూ పలువురిని ఆ మందులకు బానిసలుగా చేస్తున్న మెడికల్ షాప్ నిర్వాహకుడు, మరో వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు డిఐజి రంగనాధ్ తెలిపారు.


నల్లగొండ పట్టణంలోని కాపురాల గుట్ట వద్ద కొంతమంది యువకులు గంజాయి సేవిస్తున్నారనే సమాచారం రావడంతో వన్ టౌన్ సిఐ బాలగోపాల్ అక్కడకు వెళ్లి తనిఖీ చేయగా ఎం.డి. గౌస్ మత్తుతో తూలుతూ కనిపించడంతో పాటు అక్కడ కొన్ని టాబ్ లెట్ల కవర్లు లభించడంతో వాటిని స్వాధీనం చేసుకొని అతడిని అదుపులోకి తీసుకొని విచారించగా తాను చాలా కాలంగా గంజాయి సేవిస్తున్నానని, ఇటీవల గంజాయి సరిగా దొరకక పోవడంతో ఈ హై డోస్ కలిగిన *Spasmo - Proxyvon Plus* టాబ్ లెట్లను తీసుకుంటున్నట్లు చెప్పడంతో విచారణ చేపట్టినట్లు తెలిపారు. ఈ క్రమంలోనే నల్లగొండ పట్టణం ప్రకాశం బజార్ లోని రాజా మెడికల్ హాల్ నిర్వాహపడు దుస్సా జనార్దన్ డాక్టర్ల అనుమతి, ప్రైస్క్రిప్షన్ ద్వారా విక్రయించాల్సిన *Spasmo - Proxyvon Plus* టాబ్లేట్లను ఎలాంటి ప్రైస్క్రిప్షన్ లేకుండా విక్రయిస్తున్నట్లు తెలిపారు. హై డోస్ కలిగిన ఈ పెయిన్ కిల్లర్స్ ను నల్లగొండ పట్టణంలోని శాంతినగర్ ప్రాంతానికి చెందిన ఎం.డి. గౌస్ తో పాటు మరి కొంత మందికి విక్రయించినట్లు విచారణలో వెల్లడైనట్లు చెప్పారు. ఎక్కడ ఈ టాబ్ లెట్లను కొనుగోలు చేస్తున్నారనే కోణంలో విచారించగా రాజా మెడికల్ హాల్ లో కొనుగోలు చేసాడని తెలిపారు. హై డోస్ కలిగిన పెయిన్ కిల్లర్స్ విక్రయించి వారిని ఆ టాబ్ లెట్లకు బానిసలుగా మార్చడమే కాక వారి భవిష్యత్తును నాశనం చేస్తున్నాడని ఆయన తెలిపారు. ఈ టాబ్ లెట్లకు బానిసగా మారి, టాబ్ లెట్లను మానివేయడం కారణంగా మరో యువకుడు ఇప్పటికే హైదరాబాద్ పిచ్చి ఆసుపత్రిలో మానసిక రోగిగా మారినట్లు ఆయన తెలిపారు. ప్రజారోగ్యంతో చెలగాటం ఆడుతూ వారి భవిష్యత్తును నాశనం చేస్తున్న ఇలాంటి వారిపై కఠినంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ టాబ్ లెట్లకు అలవాటు పడి బానిసగా మారిన అమీర్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడని డిఐజి వివరించారు. ఎం.డి. గౌస్ తో పాటు మెడికల్ షాప్ నిర్వాహకుడు జనార్దన్ ను నల్లగొండ వన్ టౌన్ పోలీసులు అరెస్ట్ చేసి అతని వద్ద నుండి భారీ డోస్ కలిగిన రెండు షీట్ల (16) *Spasmo - Proxyvon Plus* టాబ్ లెట్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.


ఈ కేసు పర్యవేక్షించిన డిటిసి ఎస్పీ సతీష్ చోడగిరి, సమర్ధవంతంగా పని చేసిన నల్లగొండ డిఎస్పీ వెంకటేశ్వర్ రెడ్డి, వన్ టౌన్ సిఐ బాలగోపాల్, టాస్క్ ఫోర్స్ సిఐ రౌతు గోపి, సిబ్బందిని ఆయన అభినందించారు.

Featured Post

ఉన్నత విద్యామండలి రెగ్యులర్‌ ఛైర్మన్‌గా లింబాద్రి*

  * 🔊ఉన్నత విద్యామండలి రెగ్యులర్‌ ఛైర్మన్‌గా లింబాద్రి * * 🔶ఉపాధ్యక్షుడిగా షేక్‌ మహమూద్‌ * * 🍥ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్ర ఉన్నత విద్యామం...