*సమాజ సేవలో వాసవీ క్లబ్స్ ముందంజ : చంద్రశేఖర్ రెడ్డి*
- - వాసవీ క్లబ్స్ అద్భర్యంలో 18వ రోజూ పోలీస్ సిబ్బందికి భోజన వితరణ
- - సమజాభ్యున్నతికి వాసవీ క్లబ్స్ చేస్తున్న కృషి అభినందనీయం
నల్లగొండ : సమజాహిత సేవా కార్యక్రమాల నిర్వహణలో వాసవీ క్లబ్స్ ఎల్లప్పుడూ అగ్రభాగంలో ఉంటుందని నల్లగొండ టూ టౌన్ సిఐ చంద్రశేఖర్ రెడ్డి అన్నారు.
వాసవీ క్లబ్ డైమండ్ కపుల్స్ సభ్యుడు బండారు రాంబాబు - లీలావతి 17వ వివాహ వార్షికోత్సవ సందర్భంగా ఆదివారం లాక్ డౌన్ విధులు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బందికి సిఐ చేతుల మీదుగా భోజనాలు వితరణ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాసవీ క్లబ్స్ నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాల ద్వారా లాక్ డౌన్ విధులు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బందితో పాటు కోవిడ్ సోకిన వారికి, ఆసుపత్రులలో చికిత్స పొందుతున్న వారికి సైతం భోజనాలు అందించడం అభినందనీయమని అన్నారు. సమాజంలో పేదలు, ఆపదలో ఉన్న వారు, సాయం కోసం ఎదురుచూసే వారికి వాసవీ క్లబ్స్ అద్భర్యంలో ఆపన్నహస్తం అందిస్తూ వారికి బాసటగా నిలుస్తున్నారన్నారు. సాటి మనిషి ఆపదలో ఉంటే వారికి తమవంతు సహాయం అందిస్తూ మానవసేవ చేయడమే మాధవ సేవగా పనిచేయడం గర్వకారణంగా ఉన్నదన్నారు. లాక్ డౌన్ ప్రారంభం నుండి క్రమం తప్పకుండా విధి నిర్వహణ చేస్తున్న పోలీసులకు భోజనం అందిస్తూ స్ఫూర్తిగా నిలుస్తున్నారని చంద్రశేఖర్ రెడ్డి అన్నారు.
కార్యక్రమంలో బండారు రాంబాబు, వాసవీ క్లబ్స్ ఇంటర్నేషనల్ ప్రోగ్రాం కో ఆర్డినేటర్స్ ఓరుగంటి పరమేష్, తాళ్లపల్లి రాము, లకుమారపు శ్రీనివాస్, అసిస్టెంట్ గవర్నర్ కోటగిరి రామకృష్ణ, సభ్యులు పారేపల్లి శ్రీనివాస్, కాసం శేఖర్, మిర్యాల మహేష్, తేలుకుంట్ల శ్రీనివాస్, బాశెట్టి అశోక్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.