*మంత్రాలు, చేతబడుల పేరుతో హత్యాయత్నాలకు, మోసాలకు పాల్పడుతున్న ముఠా అరెస్ట్*

 *మంత్రాలు, చేతబడుల పేరుతో హత్యాయత్నాలకు, మోసాలకు పాల్పడుతున్న ముఠా అరెస్ట్*


- - నలుగురు సభ్యుల ముఠాను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించిన వన్ టౌన్ పోలీసులు

- - గతంలోనూ నేర చరిత్ర కలిగిన నిందితులు

- - చేతబడులు, బాణామతులు నమ్మవద్దని ప్రజలకు పోలీస్ శాఖ సూచన


నల్లగొండ : చేతబడులు, మంత్రాలు, బాణమతి వంటి మూఢ నమ్మకాలను బలంగా ప్రచారం చేస్తూ వాటి ద్వారానే పలువురిని హత్యలు చేయాలని భావించిన నలుగురు సభ్యుల ముఠాను నల్లగొండ వన్ టౌన్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.


నల్లగొండ వన్ టౌన్ సిఐ నిగిడాల సురేష్ తెలిపిన వివరాల ప్రకారం కతాల్ గూడ అర్బన్ కాలనీ

దాసరి బాలయ్య మంత్రాలు చేస్తాడని అతని కుమారుడు నవీన్ ను గత సంవత్సరం ఫిబ్రవరి నెలలో దాసరి నర్సింహా, మరికొంత మంది కలిసి హత్య చేశారు. హత్య కేసులో జైలుకు వెళ్లి తిరిగి వచ్చిన తర్వాత దాసరి నర్సింహాను గ్రామంలో ఉండనివ్వడం లేదని మనసులో పెట్టుకొని దాసరి నర్సింహా, దాసరి అశోక్, దాసరి పరమేష్ ముగ్గురు కలిసి కతాల్ గూడ కు చెందిన మంత్రగాడు ఉబ్బని ఆనంద్ ను సంప్రదించి దాసరి బాలయ్య కుటుంబాన్ని చేతబడి చేసి చంపాలని 5,000 రూపాయల నగదు ఇచ్చినట్లు చెప్పారు. తనను సంప్రదించిన వారికి ఆనంద్ మంత్రించిన నిమ్మకాయలు, పసుపు, కుంకుమ తో పాటు భేతాళ మంత్రం కలిగిన ఒక పేపర్ ఇచ్చి వాటన్నింటిని వారు ఎవరినైతే చంపాలని అనుకుంటున్నారో వారి పొలంలో వేయమని ఆనంద్ చెప్పాడని, తర్వాత ఆనంద్ స్వయంగా దాసరి బాలయ్య ఇంటికి వెళ్లి మంత్రించిన పసుపు, కుంకుమ పేపర్ వేశారని తెలిపారు. అయితే ఆనంద్ మంత్రాల వల్ల ఎలాంటి ప్రయోజనం కలగకపోవడంతో దాసరి పరమేష్, దాసరి అశోక్ ఇద్దరు కలిసి బాలయ్య కుటుంబ సభ్యులను హత్య చేద్దామని నల్లగొండ పట్టణం నుండి కతాల్ గూడ అర్బన్ కాలనీ కి వెళ్తుండగా మార్గమధ్యలో జె.ఎం. గౌడ్ కాంప్లెక్స్ వద్ద రౌడీ సీటర్ అయిన దాసరి పరమేష్ పోలీసులకు కంటపడగా అనుమానంతో వారిని అదుపులోకి  తీసుకొని విచారించగా నేరం అంగీకరించ్చినట్లు సురేష్ వివరించారు. ఈ కేసులో నిందితుడైన దాసరి పరమేష్ మీద నల్లగొండ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో రౌడీ షీట్ సైతం ఉన్నట్లు తెలిపారు.


కతాల్ గూడకు చెందిన 

ఆనంద్ మంత్రాలు చేస్తానని ఇప్పటికే పలువురిని మోసం చేశాడని, గతంలోనూ నకిరేకల్ కు చెందిన శ్రీనివాస్ వద్ద 15,000, దాసరి పరమేష్ మొదటి భార్యను సైతం చంపడానికి 6,000 రూపాయలు తీసుకున్నట్లుగా విచారణలో అంగీకరించ్చినట్లు నిగిడాల సురేష్ వివరించారు.


*మంత్రాలు, చేతబడులు నమ్మకండి*

మంత్రాలు, చేతబడుల లాంటి మూఢ నమ్మకాలను ప్రజలు ఎవ్వరూ నమ్మవద్దని పోలీసులు సూచించారు. ఆధునిక కాలంలో మంత్రాలు, చేతబడులు చేస్తామని ఎవరైనా చెబితే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. ప్రజలు చైతన్యవంతులు కావాలని, ఇలాంటి వాటిని నమ్మి డబ్బులు పోగొట్టుకోవద్దని, ఇలాంటి వ్యక్తుల సమాచారం ఇవ్వాలని సూచించారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో ఇలాంటి వ్యక్తులు అధికంగా ప్రజలను మంత్రాల పేరుతో మోసం చేస్తుంటారని, జాగ్రత్తగా ఉండాలన్నారు. ఇలాంటి సంఘటనలు ఎక్కడైనా జరిగితే సంబంధిత పోలీస్ అధికారులకు, డయల్ 100 ద్వారా సమాచారం ఇవ్వాలని కోరారు.


నల్లగొండ డిఎస్పీ వెంకటేశ్వర్ రెడ్డి నేతృతంలో జరిగిన ఈ కేసు విచారణలో సమర్ధవంతంగా పనిచేసిన టాస్క్ ఫోర్స్ సిఐ బాలగోపాల్, బాషా, వన్ టౌన్ సిఐ నిగిడాల సురేష్, ఎస్.ఐ. నరేష్, ఏ.ఎస్.ఐ. వెంకట్ నారాయణ, రైటర్ శ్రీనివాస్, సిబ్బంది వి. రామకృష్జ, షకీల్, సి.హెచ్. రామకృష్ణ, కోర్టు కానిస్టేబుల్ మల్లిఖార్జున్ లను డిఐజి ఏ.వి. రంగనాధ్ అభినందించారు.

Featured Post

ఉన్నత విద్యామండలి రెగ్యులర్‌ ఛైర్మన్‌గా లింబాద్రి*

  * 🔊ఉన్నత విద్యామండలి రెగ్యులర్‌ ఛైర్మన్‌గా లింబాద్రి * * 🔶ఉపాధ్యక్షుడిగా షేక్‌ మహమూద్‌ * * 🍥ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్ర ఉన్నత విద్యామం...