కరోన కట్టడి కోసం ప్రభుత్వ ఆదేశాల మేరకు లాక్డౌన్ పటిష్ట అమలుకు ప్రజలంతా సహకరించాలని వెస్ట్ జోన్ ఐజీ స్టీఫెన్ రవీంద్ర


 లాక్ డౌన్ పటిష్ట అమలుకు ప్రజలంతా సహకరించాలి

- వెస్ట్ జోన్ ఐజీ స్టీఫెన్ రవీంద్ర  

- నల్లగొండ పట్టణంలో లాక్ డౌన్ ను పరిశీలించిన ఐజీ  

నల్లగొండ మే  25 : కరోన కట్టడి కోసం ప్రభుత్వ ఆదేశాల మేరకు లాక్డౌన్ పటిష్ట అమలుకు ప్రజలంతా సహకరించాలని వెస్ట్ జోన్ ఐజీ స్టీఫెన్ రవీంద్ర సూచించారు. మంగళవారం నల్లగొండ పట్టణంలో అమలవుతున్న లాక్ డౌన్ ను ఆయన ఎస్పీ ఏవీ రంగనాథ్ తో కలిసి పర్యవేక్షించారు. ఈ సందర్బంగా ఆయన గడియారం సెంటర్ ప్రకాశంబజార్ డీఈవో కార్యాలయం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పలు ప్రాంతాలను పర్యవేక్షించిన అనంతరం జిల్లా ఎస్పీ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఐజీ స్టీఫెన్ రవీంద్ర మాట్లాడుతూ ప్రజలు లాక్ డౌన్ పాటిస్తూ జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పోలీసులకు సహకరించి కరోన కట్టడిలో భాగస్వామ్యం కావాలని ఇంటి వద్దే ఉంటూ అత్యవసరం అయితే తప్ప బయటకు రావొద్దని అన్నారు. పోలీసులు రోడ్లపై ఉండి విధులు నిర్వహించేది ప్రజల ఆరోగ్యం సంక్షేమం కోసమేనని గుర్తుంచుకోవాలన్నారు. ఎంతోమంది కరోన బారిన పడి మృతిచెందడంతో పాటు ఆర్థికంగా తీవ్రంగా నష్టపోతున్నారని గుర్తుచేశారు. ప్రజల భాగస్వామ్యంతో కరోనాను నిర్మూలించేందుకు కృషి చేయాలని సూచించారు. లాక్ డౌన్ మినహాయింపు సమయంలో కూడా గుంపులుగా గుమికూడకుండా భౌతిక దూరం పాటించాలని అన్నారు. కరోన కట్టడి కోసం తీసుకుంటున్న చర్యలపై ఎస్పీ ఏవీ రంగనాథ్ ను అడిగి తెలుసుకున్నారు.   ఆయన వెంట నల్లగొండ డీఎస్పీ వెంకటేశ్వర్రెడ్డి సీఐలు  సురేష్ కుమార్ చంద్రశేఖర్రెడ్డి దుబ్బ అనిల్ పసుపులేటి నాగ దుర్గాప్రసాద్ నల్లగొండ టూటౌన్ ఎస్సై దోరెపల్లి నరసింహులు రూరల్ ఎస్సై ఏమిరెడ్డి రాజశేఖర్ రెడ్డి తదితరులు ఉన్నారు

Featured Post

ఉన్నత విద్యామండలి రెగ్యులర్‌ ఛైర్మన్‌గా లింబాద్రి*

  * 🔊ఉన్నత విద్యామండలి రెగ్యులర్‌ ఛైర్మన్‌గా లింబాద్రి * * 🔶ఉపాధ్యక్షుడిగా షేక్‌ మహమూద్‌ * * 🍥ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్ర ఉన్నత విద్యామం...