అంతరాష్ట్ర సరిహద్దుల వద్ద లాక్ డౌన్ మినహాయింపు సమయంలోనూ ఈ పాస్ ఉంటేనే అనుమతిస్తామని డిఐజి రంగనాధ్ స్పష్టం చేశారు.


 *ఈ పాస్ ఉంటేనే అనుమతిస్తాం : డిఐజి రంగనాధ్*

- - అంబులెన్స్ లకు ఆంక్షలు లేవు

- - ప్రైవేట్ వాహనాలలో వచ్చే రోగులకు సరైన ఆధారాలు చూపాలి

- - ఈ పాస్ లేకుండా వచ్చి ప్రయాణికులు ఇబ్బందులు పడవద్దని సూచన


నల్లగొండ : అంతరాష్ట్ర సరిహద్దుల వద్ద లాక్ డౌన్ మినహాయింపు సమయంలోనూ ఈ పాస్ ఉంటేనే అనుమతిస్తామని డిఐజి రంగనాధ్ స్పష్టం చేశారు.



తెలంగాణ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఎపీ, తెలంగాణ పోలీసులు జారీ చేసిన పాస్ ఉంటేనే అనుమతిస్తామని ఆయన స్పష్టం చేశారు. అంబులెన్సులకు ఎలాంటి ఆంక్షలు లేవని, ప్రైవేట్ వాహనాలలో ఆంధ్రా నుంచి తెలంగాణకు వచ్చే కోవిడ్, ఇతర రోగులు ఆసుపత్రుల నుంచి జారీ చేసిన లెటర్స్ కానీ అందుకు సబందించిన ఆధారాలు ఉంటేనే అనుమతిస్తామన్నారు. అదే విధంగా లాక్ డౌన్ మినహాయింపు సమయంలోనూ ఉదయం 6-00 నుంచి 10-00 గంటల వరకు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వాహనాలు విధిగా ఈ-పాస్ కలిగి ఉంటేనే అనుమతిస్తామని డీఐజీ తెలిపారు. ఆంధ్రా నుంచి తెలంగాణలోకి వచ్చే వారు పోలీసుల సూచనలు పాటించాలని,  సరిహద్దుల వద్ద ఈ పాస్ లేకుండా వచ్చి ఇబ్బందులు పడొద్దని ఆయన సూచించారు.


సరిహద్దుల వద్ద ఈ పాస్, ఎలాంటి అనుమతి లేకుండా వస్తున్న వాహనాలతో వాహనాల రద్దీ పెరిగిపోతున్నదని అందువల్ల ప్రయాణికులు సహకరించి పాస్ లేకుండా సరిహద్దుల వద్దకు రావద్దని కోరారు. అత్యవసర పరిస్థితుల్లో ఈ పాస్ పొందలేని వారు సరైన ఆధారాలు చూపించి అత్యవసర వైద్యం కోసం వచ్చినట్లయితే విచారించి అలాంటి వాహనాలను మానవతా దృక్పథంతో అనుమతిస్తామని డిఐజి రంగనాధ్ స్పష్టం చేశారు.భ

Featured Post

ఉన్నత విద్యామండలి రెగ్యులర్‌ ఛైర్మన్‌గా లింబాద్రి*

  * 🔊ఉన్నత విద్యామండలి రెగ్యులర్‌ ఛైర్మన్‌గా లింబాద్రి * * 🔶ఉపాధ్యక్షుడిగా షేక్‌ మహమూద్‌ * * 🍥ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్ర ఉన్నత విద్యామం...