వాసవి సేవా కేంద్రం ఆధ్వర్యంలో ఫుడ్ ప్యాకెట్ల పంపిణీ


వాసవి సేవ కేంద్రం ఆధ్వర్యంలో ఫుడ్ ప్యాకెట్ల పంపిణీ




కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో వాసవి సేవా కేంద్రం మరియు సోదరా సంస్థల ఆధ్వర్యంలో ఎప్రిల్ 2 నుండి ప్రతి రోజు 3300 ఫుడ్ పాకెట్లు పేదలకు పంపిణీ చేస్తున్నారు. ఈ పంపిణీ లాక్ డౌన్ పూర్తి అయ్యేవరకు చేస్తామని నిర్వాహకులు తెలిపారు. ఈ పంపిణీ గ్రేటర్ హైద్రాబాద్ మునిసిపల్ కార్పొరేషన్, పోలీసులు, రెవిన్యూ సిబ్బంది ఆయా స్థానిక కార్పొరేటర్ల ద్వారా వలస కూలీలకు పేదలకు ఫుడ్ పాకెట్లు పంపిణీ చేస్తున్నారు. శాసన సభ్యులు బిగాల గణేష్ తన పుట్టిన రోజు సందర్బంగా ఈ కార్యక్రమానికి విచ్చేసి లక్షా పదహారు వేల రూపాయలు సహాయం అంద చేశారని నిర్వాహకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర బీజేపీ మాజీ అధ్యక్షుడు లక్ష్మణ్, తెలంగాణ పోలీస్ హోసింగ్ కార్పొరేషన్ ఛైర్మెన్ కోలేటి దామోదర్ తదిరులు విచ్చేసి ఆహారం పంపిణీ ప్రారంభించారని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో వాసవి సేవా కేంద్రం అధ్యక్షుడు కాసనగొట్టు రాజశేకేర్, ప్రధాన కార్యదర్శి ఆర్. వెంకటేశ్వర్లు, కోశాధికారి వెంకట గోపాల కృష్ణ, అశోక్ కుమార్, కె. మల్లికార్జున్, ఆగిర్ వెంకటేష్, దాయానంద్ తదితరులు పాల్గొంటున్నారు.



Featured Post

ఉన్నత విద్యామండలి రెగ్యులర్‌ ఛైర్మన్‌గా లింబాద్రి*

  * 🔊ఉన్నత విద్యామండలి రెగ్యులర్‌ ఛైర్మన్‌గా లింబాద్రి * * 🔶ఉపాధ్యక్షుడిగా షేక్‌ మహమూద్‌ * * 🍥ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్ర ఉన్నత విద్యామం...