కరోనా దెబ్బకు ఆసుపత్రులు వెల..వెల...!
-----------------------------------
దేశంలో ,రాష్ట్రంలో కరోనా విలయ తాండవానికి రోజువారి జబ్బులన్ని ఏమైనవి?అనేది అంతు చిక్కని ప్రశ్న ?
ఆసుపత్రుల వద్దా బారులు తీరే రోగులు ఏమయ్యారు ?ఎక్కడున్నారు ..!
ఆసుపత్రులు, రక్త పరిక్ష కేంద్రాలకు ఇన్ని రోజులనుండి అనవసరంగా, అనుమానంతో రోగులు డబ్బులు ఖర్చు చేసారా...?
షుగర్,బిపి ,కిడ్నీ ,హార్ట్ ,నరాల ,నడుము నొప్పుల ,కన్ను ,పన్ను ,జవ్వరం ,ఎయిడ్స్ తదితర జబ్బు పీడితులు ఎక్కడా ?
అన్న ప్రశ్న మనకు తలెత్తినది .
ప్రత్యేక ఆసుపత్రులు నిర్మానుష్యంగా మారాయి .
అనేక ఆసుపత్రులలో ఓ పి మూసివేయబడింది;
అత్యవసర పరిస్థితుల్లో ఉన్నప్పటి రోగుల రద్దీ లేదు?కాబట్టి వ్యాధులు అంతగా ఎలా తగ్గాయిఅనేది మనకు మనమే ప్రశ్నించుకుంటే ?అర్థం అవుతుంది .
వీధుల్లో వాహనాలు లేవు; కాబట్టి రోడ్డు ప్రమాదాలులేవు ,కలుషిత వాతావరణంలేదు !మనం వెనుకటి ఆచారాలు ,సంప్రదాయాలను పాటించడమే ?రోగాలు తట్టబుట్ట సర్దుకున్నాయి .
గుండెపోటు,మెదడు రక్తస్రావం లేదా !రక్తపోటు వంటి సమస్యలు కూడా లేవు!
ఎవరి నుండి పెద్దగా ఫిర్యాదులు లేవు, ఇది ఎలా జరిగింది? ఈ ప్రశ్నకు జావాబు మనదగ్గరే ఉంది .ఎలాఅంటే ?స్వీయ నియంత్రణ ,బతకాలి అనే దృడ సంకల్పం .అన్ని రకాల వ్యాధుల నుంచి మనలని దూరం చేసిందని చెప్పవచ్చు .
దేశం మొత్తం మీద స్మశాన ఘాట్ కు రోజూ వచ్చే మృతదేహాల సంఖ్య 25-30 శాతం తగ్గిందట!
ఢిల్లీలోని హరిశ్చంద్ర ఘాట్కు ప్రతి రోజూ సగటున 80 నుండి 100 మృతదేహాలు వచ్చేవట,
కరోనా వాతావరణంలో 20 లేదా 25 మృతదేహాలురావడం .అంతేకాక ఇది వేసవి కాలం ఈ సమయంలో ప్రతి సంవత్సరం మృతుల సంఖ్యలో పెరుగుదల ఉండేదట కానీ ప్రస్తుత కరోనా పరిస్థితి లో మృతుల సంఖ్య భారీగా తగ్గిందట.
కొత్త రోగుల సంఖ్య పెరగలేదు, కొత్తగా ఎవరికీ పెద్దగా ఎటువంటి రోగాలు రాలేదట, ఒకవేళ చిన్నా, చితకా వచ్చినా అవి మామూలుగానే తగ్గిపోతున్నాయని ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు . ఇపుడు మనకు అర్థం కాని సమస్య ఏమిటంటే కరోనా వైరస్ మిగిలిన అన్ని వ్యాధులను ప్రభావితం చేసిందా!
లేదా !ఆ వ్యాధులన్నీ కరోనా వైరస్ ధాటికి పరారై పోయాయా?లేకపోతే ఇన్ని వ్యాధులు కనిపించకపోవడం నిజంగా ఆశ్చర్యమే...?ఇది వైద్య వృత్తి యొక్క వాణిజ్యీకరణ ప్రశ్నను లేవనెత్తుతుంది. వ్యాధి లేని చోటవైద్యులు దాన్ని బ్రహ్మాండంగా చికిత్స చేసినట్టు డబ్బు లాగినట్టేగా ! దీనికి కరోనా తేర దించిందినీ చెప్పాల్సిందేగా !
కార్పొరేట్ ఆసుపత్రుల ఆవిర్భావం తరువాత, స్వల్పంగా జలుబు ,దగ్గు చేసినా వేలు, లక్షల బిల్లులు,ప్రజల జేబులకు చిల్లులు ,చింతలు తప్పని ఆశ్చర్యకర పరిస్థితి .
చాలా ఆసుపత్రులలో పడకలు ఖాళీగా ఉన్నాయి.
వైద్యుల యొక్క సేవను, ప్రాముఖ్యతను తగ్గించడానికి నేను ప్రయత్నించడం లేదు. వైద్యులు అన్యదా భావించవద్దు .
కానీ కోవిడ్19కి వైద్యులు ,సిబ్బంది చేస్తున్న సేవలకు వారికి నేను నా శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను.గతంలో రోగాల బారిన పడ్డ ప్రజానీకాన్ని భయబ్రాంతులకు గురిచేసి ఆయా రోగనిర్దా పరీక్షల పేరుతో దోచుకున్న కార్పొరేట్ ఆసుపత్రుల నిర్వాహకులది అని నేటి కరోనా !సీజన్లో అనుమానాలు రేకెత్తుతున్నాయి .
కాని ప్రజల్లో భయం చాలా పెద్దరోగం, చాలా సమస్యలు దాని వల్లె వస్తాయి.
ఇది కాకుండా, ఫాస్ట్ ఫుడ్ ,బేకరీ లు ,రెస్టారెంట్లు లాక్ డౌన్ కావడంతో కూడా ఈ తేడాకు దోహదం కావచ్చు .
వ్యవస్థ తన పనిని సరిగ్గా చేస్తే !ప్రజలకురోజువారీ శారీరక శ్రమ , స్వచ్ఛమైన నీరు ,స్వచ్ఛమైన ఆహారం లభిస్తే, సగం వ్యాధులు ఇలా తొలగిపోతాయని ఈ కరోనా రుజువు చేసింది .
చాలాకాలం క్రిందట ఒక దేశంలో వైద్యుల సమ్మె జరిగిందట, ఈ కాలంలో మరణాల రేటు తగ్గినట్లు సర్వేలో తేలింది. ఆరోగ్యం మన జీవనశైలిలో ఒక భాగం, ఇది వైద్యులపై మాత్రమే ఆధారపడి ఉండదు.
ప్రజలు ఆరోగ్యంగా ఉండాలని వైద్యులు ఎప్పటికీ కోరుకోరని మహాత్మా గాంధీ హింద్ స్వరాజ్ లో రాశారు; పరస్పర విబేధాలు ముగియాలని న్యాయవాది ఎప్పటికీ కోరుకోడు.
అయినప్పటికీ, లాక్‌డౌన్‌తో సమస్యలు తప్పవు, అయితే ఇది కొన్ని ఆసక్తికరమైన అనుభవాలను కూడా ఇచ్చింది.దేశమంతట వైదులు ,సిబ్బంది ,పోలీసులు ,పారిశుద్దసిబ్బంది,సేవలతోపాటు మనకు కనిపించే నాలుగు సింహాల గురించే తెలుసు.
ఆ కనిపించని ఐదవ సింహమే !ఇంటి ఇల్లాలు .కరోనా రక్కసి పంజా విసురుతున్న ఈ తరుణంలో తరుణిలా పాత్ర అమోగం అనిచెప్పాలి .
వారిలో భూమాత కున్న సహనానికి ,ఓపికకు చేతులేత్తి మొక్కాలి !
ఇంట్లో శుచి శుభ్రత పాటించడం ,కూరగాయలను ,పండ్లు ఇంటికి తేగానే వాటిని నీటితో శుభ్రం చేయడం ,ఇల్లంతా డెటాల్ రసాయనం తో తూచడం ,టాయిలెట్స్ రోజు శుభ్రపర్చడం ,భక్తి తో పాటు ,ధ్యానం ,ఆసనాలు ,ఆరోగ్య చిట్కాలు (బామ్మ ,తాతల వైద్యం )నీటిని కాచి మిర్యాల పొడితో ,టీ లో అల్లం ,ఇలాచీ తో కుటుంబ సభ్యులకు అందించడం ఇల్లాలకు దినచర్య అయ్యింది .
ఇంట్లో కూడా సోషల్ డిస్టెన్స్ ,మూస్కులధరించి నిబంధనలు పాటింప చేయడం ,ఎప్పటి కప్పుడు రోగ నిరోధ శక్తి నీ ఇచ్చేఆహారాన్ని కుటుంబ సభ్యులకు ఓపికతో అందించడం ఈ ఐదవ సింహం పనిగా పెట్టుకుంది .కరొన అంతు చిక్కని వ్యాధి అనే భయం ఓ పక్క ఉన్న కానీ భారత సంస్కృతి సంప్రదాయాలను నెమరు వేయించి "పాముకు తెల్లుశ్రీ "మందు అన్నట్టు కరోనా విజృంభణకు అడ్డు వేసుకుంది .
లాక్ డౌన్ తరువాత ప్రపంచంలో అన్ని దేశాలు భారతదేశం వైపు చూస్తున్నాయి .ఇకముందు కరోనా తో జరగబోయే వింతలను, మార్పులను చూడాలనుకుంటే, సామాజిక దూరాన్ని పాటించండి, ఇంట్లోనే ఉండండి.
అగ్నీ పునీత సీతమ్మ పుట్టిన గడ్డ మన భారత దేశం ఈ కరోనా మన సంస్కృతి సంప్రదాయాల మధ్య ఆహుతై పోవడం తథ్యం .ప్రకృతి సంపదలో ఎన్నో అఔషద మొక్కలు ఉన్న భారతావని రోగ రహిత దేశంగా ప్రపంచ దేశాలు మన అఔషదాల ,సంస్కృతి సంప్రదాయాల పట్ల పాటించేందుకు ఆసక్తిగాచూస్తున్నారు .
కరోనా మనకు నేర్పిన గుణపాఠాలతో దేశ వ్యాప్తంగా ప్రతి ఏటా మే మాసంలో దేశ వ్యాపత్త లాక్ డౌన్ అమలుచేస్తే పర్యావరణం కాపాడుకోవడం తో పాటు ఆర్థిక బారాలు తగ్గే అవకాశాలు ఉన్నాయని ఆర్థిక విశ్లేషకులు ,ప్రజలు అభిప్రాయపడుతున్నారు .
సకినాల సుధాకర్
సీనియర్ జర్నలిస్టు