*సరిహద్దు చెక్ పోస్టుల వద్ద సౌకర్యాలు పరిశీలించిన అదనపు ఎస్పీ నర్మద*

*సరిహద్దు చెక్ పోస్టుల వద్ద సౌకర్యాలు పరిశీలించిన అదనపు ఎస్పీ నర్మద*
- - విధి నిర్వహణలో ఉన్న సిబ్బందికి ఇబ్బందులు లేకుండా చర్యలు
- - కరోనా వైరస్ వ్యాప్తి అరికట్టడంలో పోలీసుల పాత్ర కీలకం
- - అన్ని రకాల జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచన


నల్లగొండ : కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేయడానికి పోలీస్ శాఖ కీలకంగా పని చేస్తున్నదని, ఈ క్రమంలో విధి నిర్వహణలో ఉన్న సిబ్బందికి అన్ని రకాల సౌకర్యాలు కల్పించేలా చర్యలు తీసుకుంటున్నామని జిల్లా అదనపు ఎస్పీ శ్రీమతి సి.నర్మద అన్నారు.


బుధవారం అంతరాష్ట్ర సరిహద్దులైన వాడపల్లి, నాగార్జున సాగర్, తదితర ప్రాంతాల్లో విధి నిర్వహణ చేస్తున్న సిబ్బందికి సౌకర్యాలను ఆమె పరిశీలించారు. కరోనా వైరస్ నేపథ్యంలో ప్రతి ఒక్క పోలీస్ అధికారికి మాస్కులు, సానిటైజర్లు అందచేశామని చెప్పారు. సరిహద్దు చెక్ పోస్టుల వద్ద సిబ్బందికి మంచినీటి సౌకర్యం, టెంట్లు, భోజన వసతి తదితర సౌకర్యాలు కల్పిస్తున్న స్థానిక పోలీస్ అధికారులతో ఆమె సమీక్షించారు. సిబ్బంది మొత్తం సామాజిక దూరం పాటించాలని, అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఎండ తీవ్రత పెరిగినందున రెండు, మూడు రోజులలో చెక్ పోస్టుల వద్ద కులర్స్ ఏర్పాటు చేయించడంతో పాటు కార్పెట్లు, మరి కొన్ని టెంట్లు ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకుంటామని వివరించారు. జిల్లా ఎస్పీ ఏ.వి.రంగనాధ్ నేతృత్వంలో జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్లకు హాండ్ వాషులు, సానిటైజర్లు, మాస్కులు అందించడంతో పాటు శాంతి భద్రతల పరిరక్షణ, ప్రజల ప్రాణాల రక్షణ కోసం పని చేసే క్రమంలో కరోనా వైరస్, దాని వ్యాప్తిపై అవగాహన కల్పించడం జరిగిందని తెలిపారు.


ఆమె వెంట నాగార్జున సాగర్ సిఐ గౌరునాయుడు, మిర్యాలగూడ రూరల్ సిఐ రమేష్ బాబు, నాగార్జున సాగర్ ఎస్.ఐ. శ్రీనయ్య, వాడపల్లి ఎస్.ఐ. నర్సింహా రావు, అడవి దేవులపల్లి ఎస్.ఐ. నాగుల్ మీరా, ఏ.ఎస్.ఐ. దశరధ తదితరులు ఉన్నారు.


Featured Post

ఉన్నత విద్యామండలి రెగ్యులర్‌ ఛైర్మన్‌గా లింబాద్రి*

  * 🔊ఉన్నత విద్యామండలి రెగ్యులర్‌ ఛైర్మన్‌గా లింబాద్రి * * 🔶ఉపాధ్యక్షుడిగా షేక్‌ మహమూద్‌ * * 🍥ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్ర ఉన్నత విద్యామం...