*WAM తెలంగాణ రాష్ట్ర విభాగం ద్వారా ఆహార పొట్లాల పంపిణి*
*ప్రపంచాన్ని గడ గడ లాడిస్తున్న కరోనా మహమ్మారి పట్ల ప్రభుత్వ నిబంధనలను పాటిస్తూ భోజనాల కొరకు ఇబ్బంది బడుతున్న తోటి మానవ మూర్తులకు ప్రపంచ ఆర్య వైశ్య మహాసభ తెలంగాణ రాష్ట్ర విభాగం ఆధ్వర్యములో ప్రతి రోజు భోజన సదుపాయము కల్పిస్తున్నది.*
*తెలంగాణ రాష్ట్ర అడిషనల్ డి. ఐ. జి శ్రీమతి సుమతి మరియు అడిషనల్ డి. సి. పి. క్రైమ్స్ శ్రీ శ్రీనివాస్ గార్ల సూచనల మేరకు, ప్రపంచ ఆర్య వైశ్య మహాసభ తెలంగాణ రాష్ట్ర విభాగం ఇంఛార్జ్ అధ్యక్షులు శ్రీ బాదం కృష్ణ రావు గారి నాయకత్వములో 05-04-2020 రోజు పగలు కవాడిగూడ, కోదండరెడ్డి నగర్, ఉన్నికోట, తాళ్ల బస్తి, బాపుజి నగర్, చిక్కడపల్లి, బాగ్ లింగం పల్లి ప్రాంతాలలో 1000 భోజన ప్యాకెట్లు పంపిణి చేయడము జరిగినది.*
*చకిలం రమణయ్య* అధ్యక్షులు
*బాదం కృష్ణ రావు* ఇంఛార్జ్ ప్రెసిడెంట్
*అడ్డా శ్రీనివాస్* వర్కింగ్ ప్రెసిడెంట్
*కౌటికె విఠల్* ప్రధాన కార్యదర్శి
*మురం శెట్టి శ్రీనివాస్* ట్రెజరర్