*కరోనా సోకిందని తప్పుడు వార్తలు ప్రచారం చేసిన వ్యక్తి పై కేసు నమోదు : వన్ టౌన్ సిఐ నిగిడాల సురేష్*
- - సామాజిక మధ్యమాలలో అసత్య వార్తలు పోస్టులు చేస్తే తీవ్ర చర్యలు
- - తప్పుడు ప్రచారాలు, వార్తలు నమ్మవద్దని ప్రజలకు విజ్ఞప్తి
- - ప్రజలంతా సంయమనం పాటిస్తూ పోలీసులకు సహకరించాలి
నల్లగొండ : వాన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక వ్యక్తికి కరోనా సోకిందంటూ తప్పుడు ప్రచారం చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వ్యక్తిని అరెస్ట్ చేసి కేసు నమోదు చేసినట్లు నల్లగొండ వన్ టౌన్ సిఐ నిగిడాల సురేష్ తెలిపారు.
పట్టణంలోని బొట్టుగూడ ప్రాంతానికి చెందిన
షేక్ పహాద్ అనే వ్యక్తి దేవరకొండ రోడ్డులో గల హరిత హోటల్ లో వర్కర్ గా పని చేసే ఎం.డి. అసద్ ఖాన్ కు కరోనా పాజిటివ్ వచ్చిందని, నల్లగొండలో తొలి కేసు నమోదయ్యిందని తప్పుడు ప్రచారం చేయడమే కాక అతని ఫోటోతో సహా సామజిక మాధ్యమాల ద్వారా పోస్టులు పెట్టారని వివరించారు. అసద్ ఖాన్ పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకోవడంతో పాటు ఆయనను మెడికల్ టెస్ట్ చేపించామని కరోనా లక్షణాలు లేవని నిర్ధారణ చేసుకున్న తర్వాత షేక్ పహాద్ పై కేసు నమోదు చేసుకొని విపత్తుల నిర్వహణ ఛట్ఠం, ఏపీడమిక్ యాక్ట్ కింద కేసు రిజిస్టర్ చేసి అదుపులోకి తీసుకున్నట్లు సిఐ సురేష్ తెలిపారు.
ప్రజలు ఇలాంటి తప్పుడు వార్తలు నమ్మి భయబ్రాంతులకు గురి కావొద్దని, ప్రభుత్వ యంత్రాంగం, పోలీసులు నిరంతరం ప్రజల కోసం పని చేస్తూ కరోనా వ్యాప్తి నియంత్రణకు కృషి చేస్తున్నదని తెలిపారు. ఇలాంటి తప్పుడు వార్తల పట్ల అప్రమత్తంగా ఉండాలని, అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రజలంతా స్వీయ నియంత్రణ పాటిస్తూ పోలీసుల సూచనలకు అనుగుణంగా ఇండ్లలో నుండి బయటకు రాకుండా ఉండాలని కోరారు.