20 తర్వాత తెరిచే వి.....నిషేధం కొనసాగేవి ఇవే...


20 తర్వాత తెరిచేవి..నిషేధం కొనసాగేవి ఇవే..కరోనా వ్యాప్తి నియంత్రణ, లాక్ డౌన్ తో ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టు కుని కేంద్ర ప్రభుత్వం కొత్త గైడ్ లైన్స్​ విడుదల చేసింది. ఈ నెల 20వ తేదీ నుంచి వ్యవసాయం, ఐటీ, ఈ–కామర్స్, ఇంటర్ స్టేట్ ట్రాన్స్​పోర్ట్​కు అనుమతి ఇవ్వా లని నిర్ణయించింది. కరోనాఎఫెక్ట్​ లేని ప్రాంతాల్లో వ్యవసాయ కార్యకలాపాలు,గుర్తించి న మార్కెట్ల ద్వా రా వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకం చేసేందుకు పర్మిషన్ ఇచ్చింది. ఏప్రిల్ 20 తర్వాత వేటికి పర్మిషన్ ఇచ్చారు.. వేటిపై నిషేదం ఉంటుందనేది ఒకసారి చూద్దాం.




లాక్​డౌన్​ నుంచి పూర్తిగా మినహాయింపు ఉన్నవి


హాస్పిటల్స్, నర్సింగ్​హోమ్స్, క్లినిక్స్, టెలి మెడిసిన్స్, ఫార్మసీలు, ల్యాబ్​లు, టెస్టింగ్​ సెంటర్లు​ యధావిధిగా కొనసాగుతాయి. కరోనాపై రీసెర్చ్ చేస్తున్న ఫార్మాస్యుటికల్స్, మెడికల్​ రీసెర్చ్​ ల్యాబ్స్​కు అనుమతి. డ్రగ్స్, ఫార్మాసుటికల్స్, మెడికల్​ డివైజెస్, మెడికల్ ఆక్సిజన్, ప్యాకేజింగ్ మెటీరియల్, రా మెటీరియల్​ తయారీ యూనిట్లకు ఓకే.



  • కోల్డ్​ స్టోరేజీలు, వేర్​ హౌస్​ సర్వీసులు, గ్రామీణ ఉపాధి హామీ పనుల కొనసాగింపు.

  • బ్యాంకుల కార్యకలాపాలు యధావిధిగా కొనసాగుతాయి. స్టాక్​మార్కెట్లకు లాక్ డౌన్​ వర్తించదు.

  • అనాథ శరణాలయాలు, వృద్ధాశ్రమాల నిర్వహణకు అనుమతి.

  • ప్రింట్, ఎలక్ట్రానిక్​ మీడియా, డీటీహెచ్, కేబుల్​ సర్వీసులు యథాతథం.

  • డెయిరీలు, మిల్క్​ ప్రొడక్ట్స్, పౌల్ట్రీ ఇండస్ట్రీ, టీ, కాఫీ, రబ్బర్ సాగు కొనసాగించవచ్చు.


మే 3 వరకు నిషేధం కొనసాగేవి



  •    సినిమా థియేటర్లు, షాపింగ్ మాల్స్, జిమ్​లు, స్పోర్ట్స్ కాంప్లెక్స్​లు, బార్లు

  •    స్కూళ్లు, కాలేజీలు, ట్రైనింగ్​ సెంటర్లు కూడా క్లోజ్. షెడ్యూల్​ ప్రకారం సిలబస్​ను పూర్తి చేసేందుకు ఆన్​లైన్​ క్లాసులకు అనుమతి.

  •    ఆలయాలు, చర్చిలు, మసీదులు, గురుద్వారాలు, జైన్​ మందిరాలు​ మూసే ఉంటాయి. మత ప్రార్థనలు, దైవ కార్యక్రమాలకు అనుమతి లేదు.

  •    ఇతర ప్రాంతాల నుంచి వలస కూలీల తరలింపుపై నిషేధం.

  •    లిక్కర్, గుట్కా, టొబాకో అమ్మకాలపై బ్యాన్​ కఠినంగా అమలు.

  •    ఇంటర్నేషనల్, డొమెస్టిక్ ఎయిర్​ ట్రావెల్, అన్ని ప్యాసింజర్​ ట్రైన్లు, పబ్లిక్​ ట్రాన్స్​పోర్ట్, బస్సులు, మెట్రో సర్వీసులు, ట్యాక్సీలపై నిషేధం కొనసాగింపు.
    మెడికల్​ రీజన్స్​ ఉన్న వారికి మాత్రమే రాష్ట్ర సరిహద్దులు దాటే అవకాశం.

  •    ఐటీ సంస్థలు, ఐటీ సేవలకు 50 శాతం స్టాఫ్ తో మాత్రమే పని చేసేందుకు అనుమతి..


20వ తేదీ తర్వాత తెరిచేవి



  •     హైవేలపై దాబాలు, మెకానిక్​ షెడ్లు ఓపెన్​ చేస్తారు.

  •     ఈ–కామర్స్  సంస్థల కార్యకలాపాలు, వాటి వాహనాలకు నిబంధనలకు లోబడి అనుమతి.

  •     ఎలక్ట్రీషియన్లు, ఐటీ రిపేర్లు, ప్లంబర్లు, కార్పెంటర్లకు అనుమతి.

  •     గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు, సాగునీటి, పారిశ్రామిక ప్రాజెక్టులు.

  •     భవన నిర్మాణ రంగానికి షరతులతో కూడిన అనుమతులు.

  •     పెండ్లిళ్లు, ఇతర శుభకార్యాలకు కలెక్టర్ అనుమతి తప్పనిసరి.

  •     కొరియర్​ సర్వీసులకు ఓకే.

  •     లాక్​ డౌన్​ కారణంగా నిలిచిపోయిన వారి కోసం హోటల్స్, లాడ్జీలు, మోటల్స్, హోం స్టేకు అనుమతి.

  •     గ్రామీణ ప్రాంతాలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల శివార్లలో ఉండే పరిశ్రమలకు అనుమతి.

  •     వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకం కోసం మార్కెట్లకు అనుమతి. రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో నడిచే వ్యవసాయ మార్కెట్లకు మినహాయింపు.

  •     వ్యవసాయ పరికరాలు, విడిభాగాల షాపులు తెరిచేందుకు, వ్యవసాయ పరికరాలు అద్దెకు ఇచ్చే సంస్థలకు ఓకే.

  •     విత్తనాల తయారీ, ఎరువులు, ఫెర్టిలైజర్​ షాపులకు అనుమతి.

  •     ఆక్వా ప్రొడక్ట్స్ అమ్మకాలు, కొనుగోలుకు అనుమతి.

  •     సెజ్​లు, ఎక్స్​పోర్ట్​కు సంబంధించిన యూనిట్లు, ఇండస్ట్రియల్​ ఎస్టేట్స్, ఇండస్ట్రియల్​ టౌన్​షిప్స్ లో పరిశ్రమలు తెరవొచ్చు.


రూల్స్​ పాటించకుంటే మినహాయింపులు కట్


‘‘లాక్​డౌన్​ మినహాయింపునకు సంబంధించిన కొత్త గైడ్​ లైన్స్​ను స్ట్రిక్ట్​గా అమలుచేయాలి. ఈ మేరకు అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు చర్యలు చేపట్టాలి. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు, ప్రజలు గైడ్​ లైన్స్ ను అనుసరించాలి. ఒకవేళ వీటిని ఉల్లంఘించినట్టు తేలితే లాక్​ డౌన్​ మినహాయింపులను వెంటనే రద్దు చేస్తాం..’’


– కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్​ భల్లా



Featured Post

ఉన్నత విద్యామండలి రెగ్యులర్‌ ఛైర్మన్‌గా లింబాద్రి*

  * 🔊ఉన్నత విద్యామండలి రెగ్యులర్‌ ఛైర్మన్‌గా లింబాద్రి * * 🔶ఉపాధ్యక్షుడిగా షేక్‌ మహమూద్‌ * * 🍥ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్ర ఉన్నత విద్యామం...