ఎమ్మెల్యే గణేష్ గుప్తా పుట్టినరోజు ఈ సందర్భంగా ఐవిఎఫ్ సికింద్రాబాద్ ప్రత్యేకంగా గా ఫుడ్ ప్యాకెట్స్ పంపిణీ

ఎమ్మెల్యే గణేష్ పుట్టిన రోజు సదర్భంగా IVF సికింద్రాబాద్ ప్రత్యేకంగా ఫుడ్ పంపిణీ 

 


" alt="" aria-hidden="true" />


ఎమ్మెల్యే గణేష్ పుట్టిన రోజు సదర్భంగా IVF సికింద్రాబాద్ ప్రత్యేకంగా ఫుడ్ పంపిణీ 


నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్త  గారి పుట్టిన రోజును  పురస్కరించుకొని ఐవీఫ్ సికింద్రాబాద్ డివిజన్ ఆద్వర్యంలో ఉప్పల ఫౌండేషన్ సౌజన్యంతో  మెట్టుగూడ బస్తీలో జరిగిన బిర్యాని  ఫుడ్ పాకెట్స్ పంపిణీ కార్యక్రమానికి    ఐవీఫ్ రాష్ట్ర అధ్యక్షుడు తెరాస రాష్ట్ర నాయకులు ఉప్పల శ్రీనివాస్ గుప్త ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
బస్తీలో 500 మంది బస్తీ వాసులకు ఫుడ్ పాకెట్స్ పంపిణీ చేశారు.కార్యక్రమం అనంతరం ఉప్పల మీడీయా తో మాట్లాడుతూ మొదట బిగాల గణేష్ గుప్తాకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. లాక్ డౌన్ నేపధ్యంలో  ఉప్పల ఫౌండేషన్ సౌజన్యంతో   ప్రతి రోజూ జిహెచ్ఎంసి పరిధిలో సుమారు 2000 మంది అన్నార్థుల ఆకలి తీర్చుతున్నామన్నారు.ఈ రోజు ఎమ్మెల్యే గణేష్ పుట్టిన రోజు సదర్భంగా ప్రత్యేకంగా ఫుడ్ పంపిణీ చేపట్టామన్నారు.కరోనా ప్రబలుతున్న నేపథ్యంలో అందరు జాగ్రత్త గా ఉండాలన్నారు.ప్రతి ఒక్కరూ ఇంటికే పరిమితం కావాలన్నారు. తప్పనిసరి బయటకు రావల్సివస్తే  సోషల్ డిస్టెన్స్ పాటించాలని,మాస్క్ ధరించాలి అన్నారు.సానిటైజర్ తో చేతులు శుభ్రపరుచుకోవాలన్నారు.శానిటైజర్ అందుబాటులో లేని పక్షంలో సబ్బుతో చేతులు శుభ్రం చేసుకోవాలన్నారు. ఇంట్లో  ఉండండి కరోనా ను తరిమేయండి అని పిలుపునిచ్చారు. కరోనా నేపధ్యంలో జిహెచ్ఎంసి పరిధిలో  ఉప్పల ఫౌండేషన్ ద్వారా అన్నదానం,ఫుడ్ పంపిణీ, నిత్యావసర సరుకుల పంపిణీ  కార్యక్రమాలు ప్రతి రోజూ  చేపట్టడం జరుగుతుందని తెలిపారు.  ఉప్పలతో పాటు ఈ కార్యక్రమంలో ఐవీఫ్ ప్రధాన కార్యదర్శి పబ్బా చంద్రశేఖర్ ,రాష్ట్ర మీడీయా కమిటీ చైర్మన్ రఘు గంగిశెట్టి, సికింద్రాబాదు డివిజన్  అధ్యక్షుడు ఐవీఫ్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కటకం శ్రీనివాస్,భువనగిరి శ్రీనివాస్, ఉప్పల వెంకట లక్ష్మీ నర్సయ్య , శాంబు పాండు, వెంకట హరి, ఐవీఫ్ సికింద్రాబాదు డివిజన్ సభ్యులు  తదితరులు పాల్గొన్నారు.


 



Featured Post

ఉన్నత విద్యామండలి రెగ్యులర్‌ ఛైర్మన్‌గా లింబాద్రి*

  * 🔊ఉన్నత విద్యామండలి రెగ్యులర్‌ ఛైర్మన్‌గా లింబాద్రి * * 🔶ఉపాధ్యక్షుడిగా షేక్‌ మహమూద్‌ * * 🍥ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్ర ఉన్నత విద్యామం...