*ప్రజా భద్రతే పోలీస్ లక్ష్యం : ఆదనపు ఎస్పీ నర్మద*
నల్గొండ : ప్రజా భద్రతే ప్రధాన లక్ష్యంగా పోలీస్ శాఖ పని చేస్తుందని, అందులో భాగంగానే గ్రీవెన్స్ డేలో వచ్చే ప్రతి అర్జీపై ప్రత్యేక దృష్టి సారించి వాటిని పరిష్కరిస్తూ ప్రజలకు సమర్ధవంతంగా సేవలందిస్తున్నామని జిల్లా అదనపు ఎస్పీ శ్రీమతి సి. నర్మద చెప్పారు.
సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుండి ఆమె అర్జీలు స్వీకరించారు. ఆర్జీదారుల సమస్యలు, బాధలు తెలుసుకొని వాటి పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకోవాలని సంబంధిత పోలీస్ అధికారులను ఆదేశించారు. గ్రీవెన్స్ డే పిర్యాదులన్నింటిని ఇప్పటికే కంప్యూటర్లో పొందు పరుస్తున్నామని అయితే పోలీస్ స్టేషన్ల వారీగా పరిష్కారం అయిన ఆర్జీల వివరాలు ఎప్పటికప్పుడు వారికి మెసేజ్ ల రూపంలో సమాచారం ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. అదే విధంగా పెండింగ్ లో ఆర్జీల విషయంలో ప్రత్యేక శ్రద్ద వహించి ఎందుకు పెండింగ్ లో ఉన్నాయి, వాటి పరిష్కారానికి సంబంధిత పోలీస్ అధికారులు ఏ రకమైన చర్యలు తీసుకున్నారు అనే విషయాలను సమీక్షించి వాటి పురోగతిని ఆర్జీదారులకు తెలియపరుస్తామని చెప్పారు. గ్రీవెన్స్ డే కు అత్యధిక ప్రాధాన్యం ఇస్తూ ఎక్కువగా వస్తున్న భూ సమస్యలను రెవెన్యూ, పంచాయితీ అధికారులను సమన్వయం చేసుకుంటూ పరిష్కరిస్తున్నామని ఆమె వివరించారు.