*తెలంగాణ జర్నలిస్టులకు తెలంగాణ మీడియా అకాడమీ ఆధ్వర్యంలో ఆపన్న హస్తం.*
జర్నలిస్టుల సంక్షేమ నిధి నుంచి ఇచ్చే ఆర్థిక సహాయానికి ఎంపికైన నల్లగొండ జిల్లా కేంద్రం కుచెందిన సీనియర్ వీడియో జర్నలిస్ట్ మాండ్ర యాదగిరి యాదవ్ కు జర్నలిస్టుల సంక్షేమ నిధి నుండి రూ.50 వేల చెక్కును ప్రెస్ అకాడమీ చెర్మెన్ అల్లం నారాయణ సార్ అందజేశారు. శుక్రవారం హైదరాబాద్ లోని మీడియా అకాడమీ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమానికి TEMJU రాష్ట్ర అధ్యక్షులు ఇస్మాయిల్, నల్లగొండ జిల్లా TUWJ ప్రధాన కార్యదర్శి గుండగోని జయశంకర్ గౌడ్, టీయూడబ్ల్యూజే రాష్ట్ర నాయకులు రియాజుద్దీన్, నాయకులు కుసుమ రవికుమార్ రెడ్డి, యాదగిరి కూతురు హర్షిణి తదితరులు పాల్గొన్నారు...