🟣 *ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ*🟣
🌷 *తెలంగాణ రాష్ట్ర విభాగము* 🌷
⛺ *బీదలకు బ్లాంకెట్ ల పంపిణీ*⛺
*ప్రపంచ ఆర్య వైశ్య మహాసభ అధ్యక్షులు శ్రీ టంగుటూరి రామకృష్ణ గారి పిలుపు మేరకు ప్రపంచ ఆర్య వైశ్య మహాసభ తెలంగాణ రాష్ట్ర విభాగము ఆధ్వర్యములో నిన్న రాత్రి చలి తో బాధ పడుతున్న 360 మంది బీదలకు బ్లాంకెట్ల పంపిణి కాయక్రమము ఎంతో విజయవంతముగా జరిగినది.*
👌👌👌👌👌👌
*స్థానిక లక్డికాపూల్ రెడ్ హిల్స్ రోడ్ లో గల ప్రభుత్వ ఎన్ ఎన్ జె క్యాన్సర్ ఆసుపత్రి యందలి పేషేంట్స్ మరియు వారి అటెండెంట్ లకు ఉచితముగా బ్లాంకెట్ల పంపిణి చేయడము జరిగినది. ఈ కార్యక్రమమునకు ముఖ్య అతిథి గ విచ్చేసిన నిలోఫర్ కేఫ్ యజమాని శ్రీ బాబు రావు గారు మాట్లాడుతూ ప్రపంచ ఆర్య వైశ్య మహసభ చేపట్టిన ఈ కార్యక్రమము ఎంతో పవిత్రమైనదని, ఎంతో సేవ భావముతో కూడినదని, మానవ సేవ ఏ మాధవ సేవ అని కొనియాడారు*
*అధ్యక్షులు శ్రీ చకిలం రమణయ్య గారు మాట్లాడుతూ ప్రపంచ ఆర్య వైశ్య మహాసభ తెలంగాణ రాష్ట్ర ఆధ్వర్యములో సేవ కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నామని ఈ కార్యక్రమము ప్రతిరోజు రాత్రి ఉండగలదని అన్నారు.*
*ప్రధాన కార్యదర్శి శ్రీ కౌటికే విఠల్ గారు మాట్లాడుతూ సేవ కార్యక్రమము ప్రకటించగానే ధాతలు ముందుకు వచ్చి 1000 బ్లాంకెట్లు ప్రకటించారని వారికీ పేరు పేరున ధన్యవాదములు అని తెలుపుతూ అలాగే ఈనాటి కార్యక్రమము విజయవంతము కావడానికి ఎంతో సహకరించిన శ్రీ బాబు రావు గారికి, రాత్రి వేళా విచ్చేసిన సభ్యులందరికి హృదయ పూర్వక ధన్యవాదములు తెలిపారు.*
*ఈ కార్యక్రమములో ముఖ్య అతిథి గ శ్రీ బాబు రావు గారు విచ్చేయగా గ్లోబల్ ట్రెజరర్ ఎల్ వి కుమార్ గారు, రాష్ట్ర నాయకులూ శ్రీ చకిలం రమణయ్య గారు, అడ్డా శ్రీనివాస్ గారు, కౌటికే విఠల్ గారు, మొర్రంశెట్టి శ్రీనివాస్ గారు, బాదాం కృష్ణ రావు గారు, వూర నరసింహ గారు, పెద్ది శ్రీనివాస్ గారు, శీల కాశీనాథమ్ గారు, చింతల బాలరాజ్ గారు, శేఖర్ గారు, మురళి గారు, కిషన్ గారు, ఆనంద్ గారు, డాక్టర్ శ్రీకాంత్ గారు మరియు ఇతర గౌరవ సభ్యులు పాల్గొన్నారు. వారందరికి పేరు పేరున ధన్యవాదములు.*
*భవదీయ*
*చకిలం రమణయ్య, అధ్యక్షులు*
*అడ్డా శ్రీనివాస్ వర్కింగ్ ప్రెసిడెంట్*
*కౌటికె విఠల్, ప్రధాన కార్యదర్శి*
*మొరంశెట్టి శ్రీనివాస్, కోశాధికారి*
*ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ,*
*(World Arya Vysya Mahasabha WAM)*
*తెలంగాణ రాష్ట్ర విభాగము*