*రైతులను ఇబ్బందులకు గురి చేస్తే కఠిన చర్యలు : ఎస్పీ రంగనాధ్*
- - మిర్యాలగూడ, వేములపల్లిలలో రైస్ మిల్లులు, వాడపల్లి చెక్ పోస్ట్ తనిఖీ చేసిన ఎస్పీ
నల్గొండ : ప్రభుత్వం నిర్ణయించిన విధంగా రైతులకు కనీస మద్దతు కల్పించకుండా ఇబ్బందులకు గురి చేసినా, మోసం చేయడానికి ప్రయత్నించినా కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ ఏ.వి. రంగనాధ్ హెచ్చరించారు.
బుధవారం సాయంత్రం ఆయన మిర్యాలగూడలోని మహాతేజ, శివ రామకృష్ణ రైస్ మిల్లులు, వాడపల్లి వద్ద చెక్ పోస్టులను తనిఖీ చేశారు. రైస్ మిల్లులలో రైతులతో మాట్లాడి మద్దతు ధర విషయంలో ఇబ్బందులుంటే పిర్యాదు చేయాలని సూచించారు. ప్రభుత్వ యంత్రాంగం రైతాంగానికి న్యాయం చేసే విధంగా నిరంతరం పని చేస్తున్నదని చెప్పారు. మద్దతు ధర విషయంలో ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తూ పటిష్టమైన చర్యలు చేపడుతున్నామని రైతులకు తెలిపారు.