భూమి పాస్‌బుక్ ఇవ్వలేదని ఎమ్మార్వోను సజీవ దహనం చేశాడు సురేష్ అనే వ్యక్తి. అబ్దుల్లాపూర్‌మెట్ మండలం తుర్కయంజాల్ గ్రామంలో ఉన్న ఓ భూమికి సంబంధించిన పాస్‌బుక్‌ను ఇవ్వాలని చాలా రోజులగా ఎమ్మార్వో కార్యాలయం చుట్టూ తిరుగుతున్న ఎమ్మార్వో స్పందించటం లేదని అందుకే పెట్రోల్ పోసి మంటలు అంటించినట్లు తెలుస్తోంది. కొద్దిసేపు ఎమ్మార్వోతో వాగ్వాదం జరిగిన తర్వాత అప్పటికే తనతో తీసుకెళ్లిన పెట్రోల్‌ను ఎమ్మార్వో విజయారెడ్డిపై పోసి నిప్పంటించినట్లు తెలుస్తోంది. ఆ మంటలు సురేష్‌కు కూడా అంటుకున్నా… ప్రాణాలతో భయటపడ్డారు.
ఎమ్మార్వో విజయారెడ్డి పూర్తిగా కాలిపోయి… తన కార్యాలయంలోనే మరణించింది. విజయారెడ్డి ఎల్.బి నగర్‌లో నివాసం ఉంటుందని తెలుస్తోంది. పట్టపగలే పాశవికంగా దాడి చేసి హత్య చేయడాన్ని తోటి ఉద్యోగులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఎమ్మార్వో డ్రైవర్ గుర్నాథం కాపాడే ప్రయత్నం చేసినా… ఫలితం లేకుండా పోయింది. దీనిపై ఎమ్మార్వోల సంఘం తీవ్రంగా స్పందించగా… తన పాస్ బుక్‌లు ఇవ్వకపోవటంతోనే తాను ఇంతటి దురాఘతానికి పాల్పడ్డట్లు స్థానికులు అంచనా వేస్తున్నారు.