<no title>

అబ్దుల్లాపూర్‌మెట్‌: రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌లో దారుణం చోటుచేసుకుంది. అబ్దుల్లాపూర్‌మెట్‌ తహసీల్దార్‌ విజయారెడ్డిపై ఓ దుండగుడు పెట్రోల్‌ పోసి నిప్పటించాడు. ఈ ఘటనలో తహసీల్దార్‌ అక్కడికక్కడే తీవ్ర గాయాలతో మృతిచెందారు. మధ్యాహ్న భోజన విరామ సమయంలో దుండగుడు తహసీల్దార్‌ ఛాంబర్‌లోకి వెళ్లి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత ఆ దుండగుడు కూడా తనకు తాను నిప్పంటించుకున్నాడు. తహసీల్దార్‌ను కాపాడే యత్నంలో మరో ఇద్దరు సిబ్బందికి కూడా తీవ్ర గాయాలయ్యాయి. గాయాలపాలైన తహసీల్దార్‌ డ్రైవర్‌తో పాటు మరో వ్యక్తిని హయత్‌నగర్‌ ఆస్పత్రికి తరలించారు. ఘటన అనంతరం దుండగుడు కాలిన గాయాలతో బయటకు పరుగులు తీసినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఏం జరుగుతుందో తెలుసుకునేలోపే తహసీల్దార్‌ విజయారెడ్డి సజీవ దహనమయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకున్నారు. అబ్దుల్లాపూర్‌మెట్‌ మండలం ఏర్పడిన తర్వాత విజయారెడ్డి తొలి తహసీల్దార్‌గా నియమితులయ్యారు. *ఈ ఘటనకు భూవివాదమే కారణమై ఉంటుందని భావిస్తున్నారు.* నిందితుడు కాలిన గాయాలతో ఉండటంతో సమీపంలోని ఏదైనా ఆస్పత్రికి వెళ్లి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు.


*పాస్‌బుక్ ఇవ్వలేదని ఎమ్మార్వోను సజీవ దహనం*?!


 


అబ్దుల్లాపూర్‌మెట్ మండలం తుర్కయంజాల్‌ గ్రామంలో ఉన్న ఓ భూమికి సంబంధించిన పాస్‌బుక్‌ను ఇవ్వాలని చాలా రోజులగా ఎమ్మార్వో కార్యాలయం చుట్టూ తిరుగుతున్న ఎమ్మార్వో స్పందించటం లేదని అందుకే పెట్రోల్‌ పోసి మంటలు అంటించినట్లు తెలుస్తోంది. 


కొద్దిసేపు ఎమ్మార్వోతో వాగ్వాదం జరిగిన తర్వాత అప్పటికే తనతో తెచ్చుకున్న  పెట్రోల్‌ను ఎమ్మార్వో విజయారెడ్డిపై పోసి నిప్పంటించినట్లు తెలుస్తోంది.


 ఆ మంటలు సురేష్‌కు కూడా అంటుకున్నా… ప్రాణాలతో భయటపడ్డారు.


ఎమ్మార్వో విజయారెడ్డి పూర్తిగా కాలిపోయి… తన కార్యాలయంలోనే మరణించింది. 


విజయారెడ్డి ఎల్‌.బి నగర్‌లో నివాసం ఉంటోంది.


పట్టపగలే పాశవికంగా దాడి చేసి హత్య చేయడాన్ని తోటి ఉద్యోగులు జీర్ణించుకోలేకపోతున్నారు. 


ఎమ్మార్వో డ్రైవర్ గుర్నాథం కాపాడే ప్రయత్నం చేసినా… ఫలితం లేకుండా పోయింది. దీనిపై ఎమ్మార్వోల సంఘం తీవ్రంగా స్పందించగా… తన పాస్‌ బుక్‌లు ఇవ్వకపోవటంతోనే తాను ఇంతటి దురాఘతానికి పాల్పడ్డట్లు స్థానికులు అంచనా వేస్తున్నారు.


Featured Post

ఉన్నత విద్యామండలి రెగ్యులర్‌ ఛైర్మన్‌గా లింబాద్రి*

  * 🔊ఉన్నత విద్యామండలి రెగ్యులర్‌ ఛైర్మన్‌గా లింబాద్రి * * 🔶ఉపాధ్యక్షుడిగా షేక్‌ మహమూద్‌ * * 🍥ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్ర ఉన్నత విద్యామం...