- 18 నుండి 28 వరకు వైద్య పరీక్షలు
- - నల్గొండ జిల్లాలో మొత్తం 995 మంది అభ్యర్థులు
నల్గొండ : జిల్లాలో ఎంపికైన కానిస్టేబుల్ అభ్యర్థులకు ఈ నెల 18వ తేదీ నుండి 28వ తేదీ వరకు వైద్య పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని జిల్లా ఎస్పీ ఏ.వి.రంగనాధ్ తెలిపారు.
ఎంపికైన కానిస్టేబుల్ అభ్యర్థులకు ఇప్పటికే ధ్రువపత్రాల పరిశీలన, అటేస్టేషన్ చేసే ప్రక్రియలను పూర్తి చేశామని, 18 నుండి నిర్వహించనున్న వైద్య పరీక్షల కోసం అన్ని చర్యలు తీసుకున్నామని ఆయన చెప్పారు. నల్గొండ జిల్లా అభ్యర్థులకు జిల్లా కేంద్రమైన నల్గొండలో, సూర్యాపేట జిల్లా అభ్యర్థులకు సూర్యాపేట పట్టణంలో వైద్య పరీక్షలు నిర్వహించే విధంగా ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందన్నారు. నల్గొండ జిల్లాలో అటేస్టేషన్ చేసి సమర్పించిన అభ్యర్థులు వైద్య పరీక్షలకు హాజరు కావాలని సూచించారు. అభ్యర్థులకు జిల్లా పోలీసు శాఖ ద్వారా మెసేజ్ లను సైతం పంపించడం జరుగుతుందని ఆయన సూచించారు.
18వ తేదీన రిజిస్ట్రేషన్ నెంబర్ 1001978 నుండి రిజిస్ట్రేషన్ నెంబర్ 1066838 వరకు 118 మంది అభ్యర్థులకు, 19వ తేదీన 1066897 నుండి 1097536 వరకు 119 మంది అభ్యర్థులకు, 21వ తేదీన 1097559 నుండి 1136077 వరకు 120 మంది అభ్యర్థులకు, 22వ తేదీన 1136285 నుండి 1160249 వరకు 111 మంది అభ్యర్థులకు, 23వ తేదీన 1161025 నుండి 1193473 వరకు 110 మంది అభ్యర్థులకు, 24వ తేదీన 1193533 నుండి 1232357 వరకు 116 మంది అభ్యర్థులకు, 25వ తేదీన 1232360 నుండి 1279685 వరకు 116 మంది అభ్యర్థులకు, 26వ తేదీన 1279795 నుండి 1358825 వరకు 112 మంది అభ్యర్థులకు, చివరి రోజైన 28వ తేదీన రిజిస్ట్రేషన్ నెంబర్ 1361568 నుండి రిజిస్ట్రేషన్ నెంబర్ 1531451 వరకు 73 మంది అభ్యర్థులకు వైద్య పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని ఎస్పీ రంగనాధ్ వివరించారు. మొత్తం 995 మంది అభ్యర్థులకు జిల్లా పోలీసు శాఖ నుండి సంబంధిత తేదీల ప్రకారం మెసేజ్ లను పంపించడం జరుగుతుందని అందుకు అనుగుణంగా అభ్యర్థులంతా హాజరు కావాలని ఎస్పీ సూచించారు. నల్గొండ జిల్లా, సూర్యాపేట జిల్లాలకు చెందిన అభ్యర్థులంతా అయోమయానికి గురి కాకుండా సూర్యాపేట జిల్లా అభ్యర్థులు సూర్యాపేటలో, నల్గొండ జిల్లా అభ్యర్థులు నల్గొండ జిల్లా కేంద్రాలలో వైద్యపరీక్షలకు హాజరు కావాలని ఎస్పీ రంగనాధ్ తెలిపారు.