ప్రజా సంక్షేమం లో పోలీసుల పాత్ర కీలకమైనది

*భారత రాజ్యాంగంలో పోలీసుశాఖ వారి ప్రధాన విధులు*


*ప్రజా సంక్షేమంలో పోలీసుల పాత్ర కీలకమైనది*


పోలీసు చట్టం-1861లోని నిబంధన 23 ప్రకారం చట్టపరమైన విధులు-బాధ్యతలు నిర్వహించడం,న్యాయస్థానాలచే జారీ కాబడిన ఆదేశాలను తు.చ తప్పకుండా అమలు జరపడం, నేరాలను నిరోధించడం, శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా నేరాలను ముందుగానే కనిపెట్టడం, అందుకు నేర సమాచారాన్ని వేగుల ద్వారా రహస్యంగా సేకరించడం, నేరాలు చేసే నిందితులను ముందే పసిగట్టి వారు చేయబోయే నేరాన్ని నిలువరించడం కోసం తగిన చట్టాల పరంగా చర్యలు తీసుకోవడం అలాంటి నేర నిందితులకు శిక్ష పడేటట్లు చేయడం. స్వంతదారుడు ఎవరనేది తెలియని వస్తువులను స్వాధీనం చేసుకుని న్యాయస్థానంలోని ప్రధమశ్రేణి న్యాయమూర్తికి తెలియపరచడం, వారి ఉత్తర్వుల మేరకు స్వంతదారుడిని కనుగొని వారికి ఆ ఆస్తిని అప్పగించడం... వంటి ముఖ్య విధులు పోలీసుశాఖ వారివి.


పోలీసుశాఖ వారు పై వాటితో పాటు తమ శాఖకు చెందిన విధులను అందులోని పేదల పట్ల, అనాధల శవాల పట్ల, తప్పిపోయిన మహిళలు, చిన్నారుల పట్ల దయార్ధ్ర హృదయులై సమాజంలోని సేవాపరమైన విధులు కూడా నిర్వహిస్తూ ప్రజల మన్ననలు పొందే ప్రయత్నం కొందరు పోలీసులు చేస్తున్నారు. తమ శరీరాలకు విశ్రాంతిని ఇవలేక వారి ఆరోగ్యాలను దెబ్బతీసుకునే పోలీసులు మరికొందరు ఉన్నారు.


*నిర్లక్ష్యవైఖరి*


ఇదిలా ఉండగా అందులో కొందరు సబ్ ఇన్స్పెక్టర్లు, కొందరు ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీసులు తమకు కెటాయించిన పోలీసు స్టేషన్ లను తమ అడ్డా/అడ్డాలుగా, తమ సామ్రాజ్యంగా/సంస్థానంగా నిర్మించుకొని, భావించుకుని... చట్ట/చట్టాలను తమ చేతులలోనికి తీసుకొని చట్ట విరుద్ధంగా చేసే పనులకు పోలీసు స్టేషన్ లనే కేంద్రాలుగా చేసుకుని చట్ట విరుద్ధంగా పనులు చేస్తూ ఉన్నారు/నిర్వహిస్తున్నారు..
~~~~~~~~~ ~~~~~~~~~~~~~~~~~
*భారత దేశంలోని పోలీసుల ప్రవర్తనా నియమావళి*...


1.భారత రాజ్యాంగానికి పోలీసులు విధేయులై ఉండాలి.పౌరులకి రాజ్యాంగం అభయమిచ్చిన హక్కులని సమర్ధించి నిలబెట్టే ప్రయత్నం చేయాలి.వాటిని గౌరవించాలి.
2.చట్టబద్దంగా తయారయిన శాసనాల ఆవశ్యకతను దాని సహేతుకను ఔచిత్యాన్ని ఎట్టిపరిస్థితులలోను ప్రశ్నించకూడదు.శాసనాలని నిష్పక్షపాతంగా.. దృఢంగా పట్టుదలతో అమలు చేయాలి. అలా అమలు చేసే క్రమంలో ఎలాంటి భయం పక్షపాతం దురుద్ధేశ్యం కక్షసాధింపులు ఉండకూడదు.
3.తమ అధికారాల, విధుల పరిమితులని పోలీసులు తప్పక గుర్తించాలి.న్యాయవ్యవస్థ విధులని పోలీసులు అక్రమంగా స్వీకరించి(స్వీకరించినట్లు కూడా కన్పించకూడదు)తీర్పులని చెప్పడం తప్పు చేసిన వారిని శిక్షించకూడదు.
4.శాంతి భద్రతలకి భంగం కలిగించే వ్యక్తులతో సాధ్యమైనంత వరకు సామరస్యంగా మాటలాడి, సలహా ఇచ్చి, వార్నింగ్ ఇచ్చి శాంతిభధ్రతలని కాపాడాలి. బలప్రయోగం తప్పనిసరి అయినపుడు పరిస్థితులను బట్టి సాధ్యమైనంత తక్కువ బలాన్ని ఉపయోగించాలి.
5.నేరాలు జరగకుండా నిరోధించడం,శాంతి భద్రతల క్రమంలో వుంచడం అనేది పోలీసుల ప్రాథమిక విధి.వీటిని విధిగా నిర్వర్తించడమే పోలీసుల సామర్థ్యానికి నిదర్శనం.అంతేకాని వాటిని పరిష్కరించడం వారి సాక్ష్యానికి సాక్ష్యం కాదు.
6.ప్రజల్లో తాము ఒకరమని పోలీసులు గుర్తించాలి.ప్రజలకి పోలీసులకి వున్న బేధం ఒక్కటే.ప్రతి పౌరునిపై వుండే విధులని పూర్తి స్థాయిలో నిర్వర్తించడానికి సమాజ హితానికి సమాజం తరపున నియమించబడిన ఉద్యోగులన్న విషయాన్ని పోలీసులు గుర్తించాలి.
7.ప్రజల సహకారం ఉన్నప్పుడే పోలీసులు తమ విధులను సమర్థవంతంగా నిర్వర్తించగలమని,వారిపైన తమ సామర్థ్యం ఆధారపడి వుందని పోలీసులు గ్రహించాలి.
8.ప్రజల సంక్షేమాన్ని పోలీసులు ఎప్పుడూ దృష్టిలో వుంచుకొని వారిపట్ల సానుభూతితో పరిశీలనగా వుండాలి.ప్రజల స్థితిగతులతో,సమాజంలోని వాళ్ళ స్థానాన్నిబట్టి కాకుండా అందరికీ అవసరమైన సేవని,స్నేహితాన్ని అవసరమైన సహాయాన్ని అందించాలి.
9.తమకన్నా పోలీసు విధికే ఎక్కువ ప్రాముఖ్యతనివ్వాలి.అపాయకరమైన పరిస్థితుల్లో అవహేళనకి,ఎగతాళికి గురవుతున్న దశలో కూడా ప్రశాంతంగా ఇతరుల ప్రాణాలని కాపాడడానికి తమ ప్రాణాన్ని ఇచ్చేవిధంగా వుండాలి.
10.పోలీసులు ఎప్పుడూ మర్యాదతో మంచితనంతో వుండాలి.తమని నమ్మేవిధంగా నిష్పక్షపాతంగా పోలీసులు వుండాలి.పోలీసులు గౌరవంగా వుండాలి,ధైర్యంగా వుండాలి.ప్రజల నమ్మకాన్ని పొందేవిధంగా పోలీసులు తమ నడవడికను రూపొందించుకోవాలి.
11.న్యాయప్రవర్తన అనేది పోలీసుల గౌరవానికి అత్యంత అవసరమైన ప్రాథమికమైన ఆధారం.దీన్ని గుర్తించి పోలీసులు తమ వ్యక్తిగత జీవితాన్ని దోషరహితంగా నమ్మకంగా వుంచుకోవాలి.అది నడవడికలో వుండాలి.ఆలోచనలో వుండాలి.ఈ ప్రవర్తన అధికార జీవితంలోనూ వుండాలి.వ్యక్తిగత జీవితంలోనూ వుండాలి.అప్పుడే ప్రజలు పోలీసులని అత్యున్నత వ్యక్తులుగా గౌరవిస్తారు.
12.తమ సేవలు పూర్తిగా రాజ్యానికి ఉపయోగపడాలంటే పోలీసులు అత్యున్నత స్థాయిలో క్రమశిక్షణని, శాసనం చెప్పిన పద్ధతుల్లో తమ విధులని నిర్వర్తించాలి. పై అధికారుల న్యాయబద్దమైన ఆదేశాలని గౌరవించాలి.ఎప్పుడూ అప్రమత్తంగా వుండాలి.
13.లౌకిక ప్రజాస్వామ్య రాజ్యంలోని సభ్యులుగా,పోలీసులు తమ దురభిప్రాయాలని పక్కన పెట్టి భారత ప్రజల మధ్య సామరస్యం సోదరభావం పెరిగే విధంగా సమాజంలోని భిన్నత్వానికి,మత,భాషపరమైన విషయాలకి అతీతంగా పోలీసులు నిరంతరం కృషి చేయాలి.


*అన్ని రాష్ట్రాల, కేంద్ర పాలిత ప్రాంతంల ప్రధాన కార్యదర్శులకి,పోలీసు ఉన్నతాధికారులకి, కేంద్ర బలగాలకి జూలై.04. 1985 రోజున భారత హోం శాఖ జారీ చేసిన ప్రవర్తనా నియమావళి*


*భారతీయ పోలీసు వ్యవస్థ - బాధ్యతలు*


పోలీస్ వ్యవస్థ వ్యక్తిగత స్వేచ్ఛా భద్రతలను కాపాడుటయేకాక సంఘ వ్యతిరేక శక్తులపై తగు చర్య తీసుకొని, సాంఘిక భద్రత కాపాడుతుంది.


పారితోషికము, ప్రశంస లేక ప్రత్యేకమైన గుర్తింపు, దర్యాప్తు అధికారితో గల స్నేహ బంధము, తోటి నేరస్తుని పశ్చాత్తాపము గుర్తించి పౌరుడుగా నేర సేకరణలోసహాయపడ వ్యక్తులతో మెలగవలిసిన పద్ధతులు కేసును గురించిన అన్ని వివరాలు అతనికి చెప్పకుండా అట్టి వారితో ఓర్పుగా మెలుగుతూ వారి వివరములు బహిర్గతము కాకుండా జాగ్రత్త తీసుకోవాలి.


నేర నిరూపణకు సాక్ష్యము రెండు రకములు.


1. ప్రత్యక్ష సాక్ష్యము నేరము జరిగినపుడు అందులో పాల్గొనిగాని లేక చూచిగాని నేరము గురించి చెప్పువారిని ప్రత్యక్ష సాక్షులని అంటారు.


2. పరోక్ష సాక్ష్యము. ఇది రెండు రకములు.


1. నేరము చేయుటకు ఉపయోగించిన పరికరములను సేకరించుట.


2. ప్రయోగశాలలో అట్టి పరికరములను వస్తు ఆధారములను పరీక్షించి ఇచ్చు రిపోర్టు


ప్రేలుడు సంభవించినపుడు, ప్రేలుడు వస్తువుల నుండి వేరుపడిన వాటికి పసుపు రంగు కలిసి ఉంటుంది.


*రిగర్ మార్టిస్:* శవ శరీరము బిగుసుకొనిపోయి గట్టిపడును. దీనినే రిగర్ మార్టిస్ అంటారు.


*రోడ్డు ప్రమాదము జరిగినపుడు:-* డ్యూటిలో ఉన్న ఆఫీసర్ / పోలీస్ / ముందుగా ప్రమాదం ఏ విధముగా జరిగినదో తెలుసుకొనవలెను. గాయపడిన వారికి తగు సహాయము చేయవలెను. సంబంధించిన వాహనముల నెంబర్లు, నేర కారణముల వివరములు వ్రాసుకొనవలెను.


*Dossier Criminal* నేరస్తుడు తన నేర ప్రవృత్తిని ఒక సర్కిల్ ఏరియా నుండి ఇతర ఏరియాకు విస్తరింపచేసినపుడు అట్టి నేరస్థులను డోసియర్ క్రిమినల్ గా పరిగణించి *D.C. Sheet* తెరుస్తారు.


*K.D.* (కె.డి.) *(Known Depredator): APPM Order 73* లో కనబరిచిన నేరము క్రింద శిక్షింపబడిన వారు.


*General Dairy:* ప్రతి పోలీసు స్టేషన్ లోను మరియు Out postలలో 24;గంటల పనికాలము సక్రమముగా వ్రాసే డైరీ.


*F.I.R.:* (ప్రథమ సమాచార రిపోర్టు) *Cognizable Offence* రిపోర్టు అయినప్పటికీ, దాని వివరములను, ఫిర్యాదుదారు ఇచ్చే స్టేట్మెంట్ నమోదు చేయబడే రిపోర్టును *F.I.R.* అంటారు.


*Case Dairy:* ప్రతి పోలీసు అధికారి *Cr Pc 12* ప్రకారము ఒక కేసు దర్యాప్తు చేయునప్పండు అట్టి దర్యాప్తుఫలితాలు ఏ రోజుకారోజు డైరీలో నమోదు చేయవలెను. ఈ డైరీనే *Case Dairy* అంటారు.


*Charge Sheet:* కేసు దర్యాప్తు ముగిసిన తరువాత ముద్దాయిలపైన అట్టి కేసు నిరూపించుటకు సంతృప్తికరమైన సాక్ష్యము ఉన్నదని తలిచినప్పుడు ఆ కేసు విచారణ జరుపుటకు అధికారముగల మెజిస్ట్రేటుకు *Firm 74* నమోదుపరచి పంపబడు షీటు.


*Point Book":* ఈ Book గ్రామములోని *Village Officers* వద్ద ఉంచాలి. పోలీసు కానిస్టేబుల్ కాని, అధికారిగాని ఆ గ్రామమునకు డ్యూటీపై వెళ్ళినప్పుడు, గ్రామమునకు డ్యూటీపై వెళ్ళినప్పుడు, గ్రామము సందర్శించిన తేదీ, సమయం వేసి సంతకము పెట్టుచుండవలెను.


*పోలీసు అధికారి విధులు:* 


చట్టంలో పేర్కొన్న విధంగా ప్రతి పోలీసు అధికారినీ ఎప్పుడూ విధి నిర్వహణలో ఉన్నట్లుగానే పరిగణించడం జరుగుతుంది. పోలీసు జిల్లాలోని అన్ని ప్రాంతాల్లోనూ అతనికి అధికారాలుంటాయి. అన్ని రకాల నేరాలనూ, అపరాధాలనూ, ప్రజాపీడలనూ నివారించడం, శాంతిని పరిరక్షించడం, నేరస్థులను కనిపెట్టి న్యాయస్థానం ముందుకు తీసుకురావడం, శాంతికి భంగం కలిగించే రహస్య సమాచారాన్ని సేకరించడం, అందించడంతోపాటు ఎప్పటికప్పుడు తనకు జారీ చేసే చట్టబద్ధమైన ఆదేశాలను వారంట్లనూ సరైన రీతిలో అమలు చేయడం అనేవి పోలీసు అధికారి విధులు.


*సమావేశాన్ని లేదా ఊరేగింపును నిషేధించే అధికారాలు:* ప్రజలు శాంతి భద్రతల పరిరక్షణకు అవసరమని భావించిన సందర్భంలో నగర పోలీసు కమీషనర్ ఎలాంటి సమావేశాలయినా, ఊరేగింపులయినా, నిషేంధించవచ్చు. అయితే ప్రభుత్వానుమతి లేకపోయినట్లయితే అట్లాంటి నిషేధపుటుత్తరవు వారం రోజులు మాత్రమే అమల్లో ఉంటుంది.


*బహిరంగ స్థలాన్ని రిజర్వ్ చేసే అధికారం:*


హైదరాబాద్,ఢిల్లీ,ముంబాయి వంటి నగర పోలీసు కమీషనర్ ఒక బహిరంగ ప్రకటన చేయడం ద్వారా ఏదైనా ప్రజా ఉపయోగం కోసం ఒక బహిరంగ స్థలాన్ని తాత్కాలికంగా రిజర్వ్ చేయవచ్చు. అంతే కాకుండా నగర పోలీసు కమీషనర్ నిర్ణయించిన షరతులను పాటించని వ్యక్తికి అట్లాంటి నిషిద్ద ప్రాంతంలోకి ప్రవేశించకుండా నిషేదించవచ్చు.


*సరియైన/పారదర్శకమైన దర్యాప్తును కోరే హక్కు పౌరునికి ఉంటుందా?*


భారతీయ పౌరులు అయితే మీ ప్రాంత పోలీసుల నుండి కానీ, నేరం జరిగిన ప్రాంతంలోని పోలీసుల నుండి గాని మీరు ఇచ్చిన ఫిర్యాదుపై నిష్పక్షపాత నిజాయితీ లేదా పారదర్శక దర్యాప్తును కోరే ప్రాధమిక హక్కుతో కూడిన అధికరణ 14,21 ల ప్రకారం కలిగి ఉన్నారని సుప్రీం కోర్టు పలు తీర్పులలో స్పష్టం చేసింది.


దర్యాప్తులో రెండు విధానాలు ఉన్నాయి.
1)నాణ్యమైన లేదా వాస్తవ అంశాలతో కూడిన దర్యాప్తు.
2)సక్రమమైన దర్యాప్తు చేపట్టడం.
ఈ అధికారం మన భారతీయ న్యాయవ్యవస్థకు మొదట దాఖలు పరచకపోయినప్పటికీ దర్యాప్తు చేసే అధికారులకు దాఖలు పరచారు.దర్యాప్తు అధికారుల నిర్లక్ష్యం వల్ల ఇంకా బాధితులకు అన్యాయం జరగడం లేదా జరిగినట్లయితే దర్యాప్తు అధికారి చేసే దర్యాప్తు నిందితులపై సక్రమంగా చేయకుండా కేసును మూసివేస్తూ, న్యాయస్థానంలో ఫైనల్ రిపోర్టు దాఖలు చేస్తే ఆ సంధర్భంలో కోర్టు పోలీసులకు మరియు ఫిర్యాధారుడికి నోటీసులు జారీ చేస్తుంది.అలా నోటీసులు జారీ చేసినప్పుడు ఫిర్యాదుదారుడు తన వద్ద ఉన్న సాక్ష్యాధారాల సమాచారంతో పోలీసులు తమ దర్యాప్తును తప్పుదారి పట్టించారని గాని,నిందితులను దర్యాప్తు అధికారి రక్షించే ప్రయత్నం చేశారని దానికి ఆధారాలు, అందుకు సాక్ష్యాదారాలుంటే బాధితులు దిగువ కోర్టులలోనయితే నేరప్రక్రియాస్మృతి-1973లోని నిబంధన190(1)(ఎ)ప్రకారం ప్రొటెస్ట్ పిటీషన్ దాఖలు చేయడం ద్వారాన్యాయస్థానం వారే దర్యాప్తును పర్యవేక్షిస్తూ, దర్యాప్తు కొనసాగించమని దరఖాస్తు ద్వారా కోర్టు వారిని కోరవచ్చును.అప్పుడు న్యాయస్థానం వారు న్యాయబద్దమైన మరియు సక్రమమైన దర్యాప్తు పోలీసులచే గానీ, ప్రత్యేకంగా కమీషనర్ (సీనియర్ న్యాయవాది)ని నియమించి తప్పకుండా దర్యాప్తు చేయిస్తుంది.ప్రొటెక్టు పిటీషన్ ని సంబంధిత న్యాయస్థానంలోనే దాఖలు చేయాల్సి ఉంటుంది. మన దేశ రాజ్యాంగం ప్రకారం న్యాయపాలనకు దర్యాప్థు, అందులోని ప్రతి అంశం కీలకమైన వెన్నుముక వంటిది.అందువలననే న్యాయవ్యవస్థ ఫిర్యాదులోని ప్రతి విషయాన్ని లేదా అంశాన్ని విచారణ జరిపే సందర్భంగా తరచి-తరచి చూసిన అనంతరం నిందితునిపై క్షుణ్ణంగా విచారణ చేస్తుంది.


*పోలీసుల విధి నిర్వహణలో నిర్లక్ష్యానికి శిక్ష :


విధుల నిర్వహణలో నిర్లక్ష్యంగా ఉండే పోలీసు అధికారులు తీరు వలన ఈ క్రింద పేర్కొన్న విధంగా శిక్ష ఉంటుంది.


1. విధి నిర్వహణను ఉల్లంగించడం, 
2. చట్టబద్ధమైన ఆదేశాన్ని బుద్ధిపూర్వకంగా భగ్నం చేయడం, 3. అనుమతి లేకుండా రెండు నెలల నోటీసు ఇవ్వకుండా తన విధుల నుంచి విరమించుకోవడం, 4. సెలవులో ఉండి సెలవు ముగిసిన తదుపరి సరైన కారణం లేకుండా విధికి హాజరు కాక పోవడం, 5. తన అధికార విధులకు అదనంగా ఏదైనా మరో పని చేయడం, 6. పిరికితనానికి లోనవడం, 7. తన ఆధినంలో ఉన్న ఎవరైనా వ్యక్తిని శారిరకంగా గాయపరచడం వంటి నేరాలకు పాల్పడిన పోలీసు అధికారికి మూడు నెలలకు మించిన జైలు శిక్షగానీ,మూడు నెలలు జీతానికి మించిన జరిమానాగానీ లేదా రెండూగానీ శిక్షగా విధించవచ్చు. *తమ అధికారాలను ఉపయోగిస్తూ చట్టవిరుద్ద పనులను భారతశిక్షాస్మ్రతి - 1860లోని నిబంధనలకు వాస్తవాలకు విరుద్దంగా బాధితుడు ఇచ్చిన ఫిర్యాదులోని అంశాలను ప్రక్కనబెట్టి నిబంధన 33 ప్రకారం చట్టం (Act) అమలు చేయడంలో నిర్లక్ష్యం చేయడం, చట్టం యొక్క నిర్ధేశాలను (Omission) కార్య లోపముతో అందుబాటులో ఉన్న సాక్ష్యాలను ఏమార్చి నిందితులతో కుమ్మకై చట్ట ప్రకారం ఎటువంటి చర్యలు తీసుకోకుండా ప్రజాసేవకులైన వారు నేరాలు చేసే నిందితులకు తమకు చేతనైనంత సహాయం చేస్తూ నిబంధన 409 ప్రకారం తగిన చర్యలు తీసుకోకుండా ఉంటూ, నిందితులతో కలిసి నిందితులను, నిబంధనలకు విరుద్దంగా అక్రమాలను ప్రోత్సహించే అంశంలో Quasi - Judicial Enquiry సత్వర విచారణ చేయాలి. అలా చేయలేకపోతే పైనపేర్కోన్న అధికారులకు పూర్తిస్థాయిలో సహాకరిస్తున్న అధికారులపై పైన పేర్కోన్న తగిన చట్ట / చట్టాలప్రకారం గౌరవనీయ న్యాయస్థానలలో Judicial Enquiry ని చట్టపరమైన విచారణ నేరప్రక్రియాస్మ్రతి / క్రిమినల్ ప్రోసీజర్ కోడ్ - 1973 లోని నిబంధనలు 190 (1) (సి), ప్రకారం మరియు భారత శిక్షాస్మ్రతి - 1860లోని నిబంధనల* న్యాయవిరుద్దంగా న్యాయ విచారణ చేసి న్యాయార్ధికి అన్యాయం చేసిన / జరిగిన అలాంటి నిర్ణయాలు తీసుకోవడానికి కారకులైన పోలీసులు కూడా నిందితులై తప్పక న్యాయస్థాన విచారణకు హాజరు కావాల్సి ఉంటుంది.


ఒక పోలీసు అధికారిని పదవినుండి సస్పెండ్ చేసినప్పుడు అతని అధికారాలూ, విధులూ, ప్రత్యేక హక్కులూ కూడా తాత్కాలికంగా రద్దవుతాయి. అయితే అలాంటి అధికారిని 'పోలీసు అధికారి' అనే గుర్తింపు నుంచి మినహాయించిన అధికారిగా భావించడం జరగదు. అతను సస్పెండ్ కాకముందు ఉన్న తరహాలోనే బాధ్యతలకూ నిషేధాలకూ ఆదేశాల పాలనకూ అతను లోబడి వుంటాడు. అలాగే బాధితులు స్టేట్ ఆఫ్ గుజరాత్ వర్సెస్ కిషన్ భాయ్ మరియు ఇతరులు క్రిమినల్ అప్పిల్ నంబర్ 1485 ఆఫ్ 2008 సుప్రీంకోర్టు తీర్పు తేది: 07-01-2014 ప్రకారం తగిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయాలి. అప్పుడు ఉన్నతాధికారులు విచారణ చేసి విధి నిర్వహణను ఉల్లంగించడం, చట్టబద్ధమైన ఆదేశాన్ని బుద్ధిపూర్వకంగా భగ్నం చేయడం, తన ఆధినంలో ఉన్న ఎవరైనా వ్యక్తిని శారీరకంగా గాయపరచడం వంటి నేరాలకు పాల్పడినట్లు గుర్తిస్తే అప్పుడు విధుల నుండి తాత్కాలికంగాగాని, శాశ్వతంగాగాని తొలగించవచ్చు.


🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳


Featured Post

ఉన్నత విద్యామండలి రెగ్యులర్‌ ఛైర్మన్‌గా లింబాద్రి*

  * 🔊ఉన్నత విద్యామండలి రెగ్యులర్‌ ఛైర్మన్‌గా లింబాద్రి * * 🔶ఉపాధ్యక్షుడిగా షేక్‌ మహమూద్‌ * * 🍥ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్ర ఉన్నత విద్యామం...