DRDO Apprentice Recruitment: డిగ్రీ, డిప్లోమా, ఐటీఐ విద్యార్థులకు సువర్ణావకాశాన్ని డీఆర్డీఓ కల్పిస్తోంది. డీఆర్డీఓ లో సంవత్సరం పాటు అప్రెంటిస్ షిప్ చేయడానికి అవకాశం కల్పిస్తోంది. ఆసక్తి ఉన్న విద్యార్థులు ఆన్ లైన్ లో drdo.gov.in. వెబ్ సైట్ ద్వారా అప్లై చేసుకోవాలి.
డిగ్రీ, డిప్లోమా, ఐటీఐ విద్యార్థులకు సువర్ణావకాశాన్ని డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) కల్పిస్తోంది. డీఆర్డీఓ లో సంవత్సరం పాటు అప్రెంటిస్ షిప్ చేయడానికి అవకాశం కల్పిస్తోంది. ఆసక్తి ఉన్న విద్యార్థులు ఆన్ లైన్ లో drdo.gov.in. వెబ్ సైట్ ద్వారా అప్లై చేసుకోవాలి.
DRDO: అప్రెంటిస్ షిప్
ప్రతిష్టాత్మక డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం మిస్సైల్ కాంప్లెక్స్, డీఆర్డీఓ లోని ప్రీమియర్ లాబొరేటరీ రీసెర్చ్ సెంటర్ ఇమారత్ (RCI) లో అప్రెంటిస్ షిప్ చేయాలన్న ఆసక్తి ఉన్నవారి నుంచి అప్లికేషన్లను స్వీకరిస్తున్నారు. ఈ అప్రెంటిస్ షిప్ ఒక సంవత్సరం పాటు ఉంటుంది. డిగ్రీ, డిప్లొమా, ఐటీఐ్ పూర్తి చేసిన విద్యార్థులు ఈ అప్రెంటిస్ షిప్ కు అప్లై చేసుకోవడానికి అర్హులు. అది కూడా వారు 2020, 2021, 2022 విద్యా సంవత్సరాలలోనే ఆ కోర్సులు పూర్తి చేసి ఉండాలి. మొత్తం 150 మంది విద్యార్థులను మాత్రమే ఈ అప్రెంటిస్ షిప్ కు ఎంపిక చేస్తారు. ఈ అప్రెంటిస్ షిప్ కు సంబంధించిన నోటిఫికేషన్ జూన్ 10 వ తేదీన ఎంప్లాయిమెంట్ న్యూస్ పత్రికలో ప్రచురితమైంది. ఈ అప్రెంటిస్ షిప్ కు అప్లై చేసుకోవడానికి ఆఖరు తేదీ జూన్ 30.
how to apply: ఆన్ లైన్ అప్లికేషన్
ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు జూన్ 30 లోగా drdo.gov.in. వెబ్ సైట్ ద్వారా ఈ అప్రెంటిస్ షిప్ కు అప్లై చేసుకోవచ్చు. ఆన్ లైన్ లో అప్రెంటిస్ షిప్ కు అప్లై చేసుకోవాలనుకునే వారు
- ముందుగా drdo.gov.in వెబ్ సైట్ ను ఓపెన్ చేయాలి.
- హోం పేజీపై కనిపిస్తున్న What's New లింక్ పై క్లిక్ చేయాలి.
- స్క్రీన్ పై కొత్త పేజీ కనిపిస్తుంది.
- Advertisement for Engagement of Graduate, Technician and ITI Trade Apprentices in RCI, DRDO, Hyderabad అనే లింక్ పై క్లిక్ చేయాలి.
- రిజిస్టర్ చేసుకుని, అప్లికేషన్ ఫామ్ ను ఫిలప్ చేయాలి.
- అప్లికేషన్ ఫీజు చెల్లించి, ఫామ్ ను సబ్మిట్ చేయాలి.
- భవిష్యత్ అవసరాల కోసం అప్లికేషన్ ఫామ్ ను డౌన్ లోడ్ చేసి, సేవ్ చేసుకోవాలి. ఒక కాపీని ప్రింట్ తీసి పెట్టుకోవాలి.