పోస్టల్ డిపార్ట్మెంట్ లో 12 వేలకు పైగా పోస్ట్ లు; అప్లై చేసుకోవడానికి రేపే లాస్ట్ డేట్
భారతీయ తపాలా విభాగంలో 12828 జీడీఎస్ పోస్ట్ ల భర్తీ (India Post GDS Recruitment 2023) ప్రక్రియ కొనసాగుతోంది. ఆ పోస్ట్ లకు అప్లై చేసుకోవడానికి ఆఖరు తేదీ జూన్ 11. విద్యార్హత 10వ తరగతి మాత్రమే. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు వెంటనే indiapostgdsonline.gov.in. వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో అప్లై చేసుకోవాలి.
భారతీయ తపాలా విభాగంలో 12828 గ్రామీణ డాక్ సేవక్ (GDS) పోస్ట్ ల భర్తీ (India Post GDS Recruitment 2023) ప్రక్రియ కొనసాగుతోంది. ఆ పోస్ట్ లకు అప్లై చేసుకోవడానికి ఆఖరు తేదీ జూన్ 11. విద్యార్హత 10వ తరగతి మాత్రమే. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆలస్యం చేయకుండా, వెంటనే indiapostgdsonline.gov.in. వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో అప్లై చేసుకోవాలి.
ట్రెండింగ్ వార్తలు
జూన్ 11 లాస్ట్ డేట్
ఇండియా పోస్ట్ విభాగంలో 12828 గ్రామీణ డాక్ సేవక్ (GDS) పోస్ట్ లను భర్తీ చేయనున్నారు. అప్లికేషన్ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. అప్లై చేసుకోవడానికి ఆఖరు తేదీ జూన్ 11. గణితం, ఇంగ్లీష్ కంపల్సరీ సబ్జెక్టులుగా ఎస్సెస్సీ (SSC) పాస్ అయినవారు ఈ పోస్ట్ లకు అప్లై చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థుల వయస్సు 18 ఏళ్ల నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి.
అప్లై చేసుకునే విధానం..
ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు ఈ కింది స్టెప్స్ ఫాలో అవుతూ ఈ పోస్ట్ లకు అప్లై చేసుకోవచ్చు.
- ఇండియా పోస్ట్ అధికారిక వెబ్ సైట్ indiapostgdsonline.gov.in. ను ఓపెన్ చేయాలి.
- హోం పేజీపై కనిపించే రిజిస్ట్రేషన్ (registration) లింక్ పై క్లిక్ చేయాలి.
- అవసరమైన వివరాలు నమోదు చేసి రిజిస్టర్ చేసుకోవాలి. అనంతరం, ఆ వివరాలతో లాగిన్ కావాలి.
- స్క్రీన్ పై కనిపించే అప్లికేషన్ ఫామ్ లో వివరాలను నింపాలి.
- అప్లికేషన్ ఫీజును చెల్లించాలి.
- సబ్మిట్ బటన్ నొక్కాలి. దాంతో, మీ అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ అవుతుంది.
- భవిష్యత్ అవసరాల కోసం మీ అప్లికేషన్ ఫామ్ ను డౌన్ లోడ్ చేసుకుని సేవ్ చేసుకోవాలి. అలాగే, ఒక ప్రింట్ తీసుకుని భద్రపర్చుకోవాలి.
- అప్లికేషన్ ఫీజు రూ. 100. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ, ట్రాన్స్ విమన్ కేటగిరీలు అప్లికేషన్ ఫీజు చెల్లించనక్కర లేదు.