*పరిపాలన సౌలభ్యం కోసమే వార్డు కార్యాలయాలు*
*హైటెక్స్ లో వార్డ్ లెవెల్ అధికారులతో ముఖాముఖి అవగాహన కార్యక్రమం లో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్*.
పరిపాలన సౌలభ్యం కోసం నగరంలో పెరుగుతున్న ప్రజల అవసరాలు కనుగుణంగా సమస్యల సత్వర పరిష్కారానికి హైదరాబాద్ మహానగర పాలక సంస్థ వార్డు కార్యాలయాలు ప్రారంభించ నున్నట్లు పురపాలక పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ అన్నారు.
తెలంగాణ అవతరణ దినోత్సవ దశాబ్ది ఉత్సవాల ను పురస్కరించుకొని సుపరిపాలన వేడుకల సందర్భంగా మాధరం లో గల హైటెక్ లో జి హెచ్ ఎం సి పరిధిలో గల మేయర్ మంత్రులు శాసన మండలి శాసన సభ సభ్యులు వార్డు అధికారుల సిబ్బంది తో విద్యుత్ జల మండలి జి హెచ్ ఎం సి అధికారులతో ఏర్పాటు చేసిన ఓరియంటేషన్ కార్యక్రమం లో రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి ఐటి పరి శ్రమల శాఖ మంత్రి కే టి రామారావు ప్రారంభించారు.అంతకంటే ముందు ప్రత్యేక ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ కార్యాలయం , జోనల్ కార్యాలయాలు డిప్యూటీ కమిషనర్ల కార్యాలయాలతో పాటు వార్డు కార్యాలయాలను జూన్ 16 నుండి 150 వార్డు కార్యాలయాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలులోకి తెస్తుందని స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్ సూచించారు.
వార్డు అధికారులు సోషల్ మీడియా అయినా ట్విట్టర్ ఇంస్టాగ్రామ్, కంట్రోల్ రూమ్ ,డయల్ హండ్రెడ్ ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియాలో వచ్చిన ప్రజా ఫిర్యాదులను నిర్నీత గడువులోగా పరిష్కరించి సంబంధిత ఫిర్యాదుదారులకు వాటి పరిష్కార వివరాలను తెలియజేయాలి అన్నారు. గార్బేజ్, స్ట్రీట్ లైట్ వాటర్ లీకేజీ పరిష్కరించాలన్నారు. క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలను పరిశీలించి సమస్యలను 48 గంటల్లోపు పరిష్కరించాలన్నారు. అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్ అధికారి వార్డ్ ఆఫీసర్ గా వ్యవహరిస్తారని
ఈ అధికారి పర్యవేక్షణలో పారిశుద్ధ్యం, రోడ్ మెయింటెనెన్స్, ఇంజనీరింగ్ ,టౌన్ ప్లానింగ్ ఎంటమాలజీ ,యూబిడి, యు సి డి, జలమండలి ట్రాన్స్కో సమిష్టిగా పని చేసి సమన్వయంతో ప్రజా సమస్యలను పరిష్కరించలని అన్నారు.
జిహెచ్ఎంసి కమిషనర్ లోకేష్ కుమార్ మాట్లాడుతూ
మూడెంచల వ్యవస్థ ఉందని ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు వార్డు కార్యాలయాలు ఏర్పాటు చేసినట్లు ప్రభుత్వం సూచించిన విధంగా 1000 చదరపు అడుగులున్న భ వనలను గుర్తించి సిద్దం చేసినట్లు వార్డు కార్యాలయం లో అసిస్టెంట్ మునిసిపల్ కమిషనర్ వార్డు పరిపాలన అధికారిగా వార్డు లో నియమించిన వివిధ విభాగాల సిబ్బందికి అస్కి ద్వారా శిక్షణ కల్పించినట్లు, అదే విధంగా డిపార్టుమెంటు అధికారుల తో పాటు డిప్యూటీ కమిషనర్ స్థాయిలో శిక్షణ కల్పించినట్లు కమిషనర్ అన్నారు. ఇప్పుడు70000 జనాభా కు అనుగుణంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నాలుగు అంచెల వార్డు వ్యవస్థను ప్రారంభిస్తుందని అన్నారు. వార్డు వ్యవస్థ దేశంలో ఎక్కడ కూడా లేదన్నారు. పరిపాలనవికేంద్రీకరణలో భాగంగా 150 వార్డు కార్యాలయాలకు 1000 చదరపు గజాలలో ఓకే విధమైన రూల్స్ తో వార్డు వ్యవస్థను నెల కల్పమన్నారు. వార్డు కార్యాలయాలలో మౌలిక సదుపాయాలు, మాన్ పవర్ ,వారికి కావాల్సిన శిక్షణను ఆస్కీ ద్వారా అందించమన్నారు. ఇటీవల జోనల్ కమిషనర్లు వివిధ రాష్ట్రాల్లో పర్యటించి అక్కడ మున్సిపల్ వ్యవస్థను అధ్యయనం చేశారు అన్నారు. కార్పొరేటర్లకు అవగాహన కల్పించేందుకు జోనల్ కమిషనర్లు ద్వారా నిర్వహించ నున్నారు
సి డి ఎం ఏ డైరెక్టర్ సత్యనారాయణ మాట్లాడుతూ
సుపరిపాలన దినోత్సవం లో భాగంగా తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్ర ముఖ్య మంత్రి ప్రజలను పరిపాలన చేరువ కావడానికి జిల్లా లు మండలాలు, ఆర్డీవో కార్యాలయం లను ఏర్పాటు చేయడం జరిగిందని మంచి ఫలితాలు వచ్చాయని అదే విధంగా ముఖ్యంగా జి హెచ్ ఎం సి పాలన వ్యవస్థను వికేంద్రీకరణ లో బాగంగా ప్రజల సమస్యల పరిష్కారం నకు వార్డు వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. రాష్ట్రం లో వికేంద్రీకరణ పరిపాలన వలన స్వచ్ఛ సర్వేక్షన్ 2022 సంవత్సరానికి 142మునిసిపాలిటీలకు 26 అవార్డులు వచ్చాయన్నారు.
వార్డ్ అధికారులు ప్రభుత్వానికి కళ్ళు,చెవులు వంటి వారు అన్నారు.
జల మండలి ఏమ్ డి దాన కిషోర్ విద్యుత్ శాఖ పై టి యస్ యస్ పీ డి సి ఎల్ సి ఏమ్ డి రఘుమ రెడ్డి,
ఇంజనీరింగ్ చీఫ్ చీఫ్ జియావుద్దీన్ మాట్లాడుతూ
ఇంజనీరింగ్ విభాగం ద్వారా అడ్వాన్స్ ప్లానింగ్ ద్వారా మైనర్ వర్క్స్,ప్యాచ్ వర్క్స్, క్యాచ్ పిట్ వర్క్స్ 24గంటలు లోపు పరిష్కరించేందుకు E E,Dy EE,SE చర్యలుతీసుకోవాలి అన్నారు. ఇన్స్టంట్ రెస్పాన్స్ టీం మాన్సూన్ రెస్క్యూటీ మ్ వేగవంతంగ పనిచేయాలని తెలిపారు.
చీఫ్ సిటీ ప్లానర్ దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ టౌన్ ప్లానింగ్ కి సంబంధించి అక్రమ కట్టడాలు , ఫూత్పట్ కబ్జాలపై షోకాసు ,స్పీకింగ్ ఆర్డర్స్ ద్వారా చర్యలు తీసుకోవాలి అన్నారు.
ఈవీడీఎం డైరెక్టర్ ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ చెట్ల కొమ్మలు విరిగిపోయిన వాటర్ నిల్వ ఉన్న ప్రాంతాలు ఫైర్ యాక్సిడెంట్స్ బిల్డింగ్ కొలాప్స్ వరదలు విపత్తుల సమయంలో ప్రతి సర్కిల్ కు వెహికల్స్ ని ఏర్పాటు చేశామన్నారు. వార్డ్ సిబ్బంది డిఆర్ఎఫ్ టీం తో కోఆర్డినేట్ చేసుకోవాలి అన్నారు .
సమావేశంలో అడిషనల్ కమిషనర్ ప్రియాంక ఆల జోనల్ కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లు పాల్గొన్నారు