కేసీఆర్ సంతలో పశువుల్లా ఎమ్మెల్యేలను కొంటుంటే.. నాలుగేళ్లుగా ఉన్న కొద్దిమంది ఎమ్మెల్యేలతో పోరాటం చేస్తున్నారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క

 నల్గొండ: సీఎల్పీ నేత భట్టి విక్రమార్క గారి పాదయాత్ర వెయ్యి కిలోమీటర్లు పూర్తయిన సందర్భంగా దేవరకొండ నియోజకవర్గంలోని గుమ్మడవెల్లిలో పైలాన్ ఆవిష్కరణ.. హాజరైన భువనగిరి పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గారు.... 


- సీఎల్పీ నేత భట్టి విక్రమార్క గారు చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర వెయ్యి కిలోమీటర్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా దేవరకొండ నియోజకవర్గం గుమ్మడవెల్లిలో పైలాన్ ఆవిష్కరణ జరిగింది. భువనగిరి పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గారి పిలుపు మేరకు కాంగ్రెస్ శ్రేణులు భారీగా తరలివచ్చారు. 


కోమటిరెడ్డి కామెంట్స్... 


- కేసీఆర్ సంతలో పశువుల్లా ఎమ్మెల్యేలను కొంటుంటే.. నాలుగేళ్లుగా ఉన్న కొద్దిమంది ఎమ్మెల్యేలతో పోరాటం చేస్తున్నారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క






గారు 

- కేసీఆర్ ను ప్రతీ విషయంలో ప్రశ్నిస్తున్నారు 

- మండుటెండను సైతం లెక్క చేయకుండా వెయ్యి కిలోమీటర్ల పాదయాత్ర పూర్తి చేశారు విక్రమార్క గారు 

- మనకోసం పోరాటం చేస్తున్న భట్టి గారికి ఉమ్మడి నల్గొండ ప్రజల తరఫున స్వాగతం 

- పీపుల్స్ మార్చ్ యాత్ర మామూలు యాత్ర కాదు.. ఇది 4 కోట్ల ప్రజల కోసం చేస్తున్నారు. అవినీతి ప్రభుత్వాన్ని కూల్చడం కోసం చేపట్టారు. 

- నల్గొండ జిల్లాకు చెందిన దౌర్భాగ్య మంత్రి ఒకడున్నారు. భట్టి గారి పాదయాత్ర గురించి ఏదిపడితే అది మాట్లాడుతున్నారు. దమ్ముంటే జగదీష్ రెడ్డి మండుటెండలో పది రోజులు పాదయాత్ర చేస్తే పాలాభిషేకం చేస్తాం. 

- దళిత మహిళ మరియమ్మ చనిపోతే సీఎంను ప్రశ్నించారు. దళితులకే కాదు అన్ని వర్గాల ప్రజల కోసం భట్టి పోరాడుతున్నారు 

- నల్గొండలో ప్రియాంక గాంధీ గారితో సభ పెట్టాలనుకుంటున్నాం.. 

- ఎస్ఎల్బీసీ సొరంగం కోసం ఆనాడు రాజశేఖర్ రెడ్డితో కొట్లాడి.. 2005లో అనుమతి తీసుకుని పనులు మొదులపెడితే.. 60-70 శాతం పనులు చేశాం.. 

- కేసీఆర్ అధికారంలోకి వచ్చాక కుర్చీ వేసుకుని కుర్చుంటా అని చెప్పి ఏం చేశారు. సొరంగం పనులు అంతే ఉంచారు. కమీషన్ల కాళేశ్వరం కోసం అన్యాయం చేశారు. 

- కాంగ్రెస్ పార్టీ గురించి జగదీష్ రెడ్డి నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు. నీ చరిత్ర గురించి అందరికీ తెలుసు. మర్డర్ కేసుల్లో నీ పేరు లేదా? 

- నాగార్జున సాగర్, శ్రీశైలం డ్యామ్ కట్టింది కాంగ్రెస్ కాదా? ఎన్నో కాలనీలు కట్టించాం.. ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చాం.. ప్రజల కోసం ఎన్నో చేశాం 

- 4 కోట్ల ప్రజల కోసం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి 

- మాది జగదీష్ రెడ్డిలా దోచుకునే గుణం కాదు.. ఇన్నేళ్లైనా అద్దె ఇళ్లలో ఉంటున్నాం.. కానీ, ఆయన ఐదెకరాల్లో ఇల్లు కట్టుకున్నారు. 

- జగదీష్ రెడ్డికి ఒకటే చెబుతున్నా.. ప్రజల కష్టాలను తెలుసుకుంటూ భట్టి ముందుకు సాగుతుంటే నిందిస్తారా? మీ చరిత్ర ఎవరికి తెలియదు. 

- నల్గొండ జిల్లాలో 12 సీట్లు కాంగ్రెస్ గెలుస్తుంది.. 

- నల్గొండ జిల్లా కాంగ్రెస్ కంచుకోట

Featured Post

ఉన్నత విద్యామండలి రెగ్యులర్‌ ఛైర్మన్‌గా లింబాద్రి*

  * 🔊ఉన్నత విద్యామండలి రెగ్యులర్‌ ఛైర్మన్‌గా లింబాద్రి * * 🔶ఉపాధ్యక్షుడిగా షేక్‌ మహమూద్‌ * * 🍥ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్ర ఉన్నత విద్యామం...