నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ బిగాల గారు తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా అర్సపల్లి లో ఊరూరా చెరువుల పండుగ కార్యక్రమం

పండుగల తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు...


ఘనంగా ఊరూరా చెరువుల పండుగ...


బతుకమ్మ ఆడి బోనమెత్తిన మహిళలు...


డప్పులు,బోనాలు,బతుకమ్మ లతో కోలాహలంగా చెరువు గట్టు...


కట్ట మైసమ్మ తల్లి బోనం సమర్పించి చెరువు నీటికి  పూజ...


ఊరూరా చెరువుల పండుగ లో పాల్గొన్న గౌ.ఎమ్మెల్యే శ్రీ గణేష్ బిగాల గారు...


జూన్-08-2023,

నిజామాబాద్ అర్బన్











నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ బిగాల గారు తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా అర్సపల్లి లో ఊరూరా చెరువుల పండుగ కార్యక్రమంలో పాల్గొన్నారు.


ఈ కార్యక్రమంలో గౌ.ఎమ్మెల్యే శ్రీ గణేష్ బిగాల గారు మాట్లాడుతూ...


 గౌ.ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారి సారథ్యం లో తెలంగాణ రాష్ట్రం సస్యశ్యామలం గా మారింది.


నాడు సమైక్య పాలనలో చెరువులు విధ్వంసాలకు గురయ్యాయి.


చెరువు లో నీరు ఉంటేనే ఊరు పచ్చగా ఉంటుంది.


గౌ.ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారు మిషన్ కాకతీయ ద్వారా రాష్ట్రం లో 47000 చెరువుల్లో పూడిక తీసి పునరుద్ధరణ చేశారు.


నీరు వృధా కాకుండా గొలుసుకట్టు విధానం తో చెరువుల్లో నీటిని నింపారు.


కాళేశ్వరం,ఇతర బహుళార్థక సాగు నీటి ప్రాజెక్టులు నిర్మించి తెలంగాణ రైతాంగానికి వెన్నెముకగా నిలిచారు.


సమైక్య పాలనలో చుక్క నీరు లేక వేల వేల పోతే నేడు స్వరాష్ట్రం లో మండే వేసవి లో జల సవ్వడులు వినిపిస్తున్నాయి.


భూగర్భ జలాలు పెరిగాయి పల్లెలు పట్టణాల్లో ప్రతి ఇంటికి మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి మంచి నీరు అందిస్తున్నాము.


స్వరాష్ట్రం లు ఇప్పుడు ఎక్కడ చూసినా పచ్చని పాడి పంటల తో వర్ధిల్లుతుంది.


రైతు సంక్షేమ కార్యక్రమాల ద్వారాతెలంగాణ రాష్ట్రం దేశానికి అన్నం పెట్టే అన్నపూర్ణగా మారింది.


ప్రభుత్వం 100 % సబ్బిడి తో చేప పిల్లలను అందిస్తుంది.తద్వారా మత్స సంపద గణనీయంగా పెరిగి 4 లక్షల మంది మత్స్యకారులకు ఉపాధి లభిస్తుంది.


తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా ఉద్యమం చేసి సాధించుకున్నామో అదే ఉద్యమ తరహాలో  ఈ 9 ఏండ్ల కాలం లో తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకున్నాము.


తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకొని 10 సంవత్సరం లోకి అడుగు పెడుతున్న సందర్భంగా 21 రోజులు ఘనంగా వేడుకలు జరుపుకుంటున్నాము.


మీ అందరికి తెలంగాణ రాష్ట్ర ఆవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను.


ఈ కార్యక్రమంలో నగర మేయర్ శ్రీమతి దండు నీతూ కిరణ్ గారు,నుడ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి గారు, స్థానిక కార్పొరేటర్ ముచుకుర్ లావణ్య సీనియర్ నాయకులు  నవీన్,రైతు విభాగం అధ్యక్షుడు చెగంటి గంగాధర్ ,సిర్ప రాజు కులచారి సంతోష్ BRS నాయకులు,కార్పొరేటర్ లు,తదితరులు పాల్గొన్నారు.

Featured Post

ఉన్నత విద్యామండలి రెగ్యులర్‌ ఛైర్మన్‌గా లింబాద్రి*

  * 🔊ఉన్నత విద్యామండలి రెగ్యులర్‌ ఛైర్మన్‌గా లింబాద్రి * * 🔶ఉపాధ్యక్షుడిగా షేక్‌ మహమూద్‌ * * 🍥ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్ర ఉన్నత విద్యామం...