తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం వేడుకల్లో పాల్గొన్న గౌ.ఎమ్మెల్యే శ్రీ గణేష్ బిగాల గారు...*








*తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం వేడుకల్లో పాల్గొన్న గౌ.ఎమ్మెల్యే శ్రీ గణేష్ బిగాల గారు...*



నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ బిగాల గారు తెలంగాణ రాష్ట్ర ఆవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణాలని అర్పించిన అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ ఆమర వీరుల స్థూపం వద్ద శ్రద్ధాంజలీ ఘటించారు.


నిజామాబాద్ నగర పాలక సంస్థ కార్యాలయం లో నగర మేయర్ శ్రీమతి దండు నీతూ కిరణ్ గారితో కలిసి  జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమం లో పాల్గొన్నారు.


BRS పార్టీ జిల్లా కార్యాలయంలో BRS పార్టీ జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్యే శ్రీ ఆశన్న గారి జీవన్ రెడ్డి గారితో కలిసి జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు.


సమీకృత కలెక్టర్ కార్యాలయం వద్ద గౌ.మంత్రి వర్యులు శ్రీ వేముల ప్రశాంత్ రెడ్డి గారు మరియు ఎమ్మెల్యే లు,శ్రీ బాజిరెడ్డి గోవర్ధన్ గారు,శ్రీ ఆశన్న గారి జీవన్ రెడ్డి గారు ఎమ్మెల్సీలు, ప్రజా ప్రతినిధులతో కలిసి తెలంగాణ రాష్ట్ర ఆవతరణ వేడుకల్లో పాల్గొన్నారు.


సమీకృత కలెక్టర్ కార్యాలయం లో TNGOs యూనియన్ వారు ఏర్పాటు చేసిన రక్త దాన శిబిరాన్ని ప్రారంభించారు.


*ఈ సందర్భంగా గౌ.ఎమ్మెల్యే శ్రీ గణేష్ బిగాల గారు మాట్లాడుతూ...*


 రాష్ట్ర ప్రజలందరికీ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం శుభాకాంక్షలు.


తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆమరులైన ఆమరవీరులకు జోహార్లు.


గౌ.ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారి ఆదేశానుసారం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి.


 జూన్ 2వ తేది నుండి జూన్ 22వ తేది వరకు 21 రోజులు పాటు 9 ఏండ్ల ప్రగతిని తెలంగాణ రాష్ట్ర ప్రజలకు వివరించి,  తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి-సంక్షేమం సాధించిన పురోగతి దేశం లో చర్చ జరిగే విధంగా తెలంగాణ రాష్ట్ర దశాబ్ది వేడుకలు నిర్వహిస్తున్నాము.


పోరాటాలు,ఆమరవీరుల త్యాగలతో ప్రజా స్వామ్య బద్దంగా సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం గౌ.ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారి పాలన లో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి-సంక్షేమం లో దేశంలో మొదటి స్థానం లో ఉంది.


ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నీళ్ల కోసం నిధుల కోసం పోరాడిన తెలంగాణ రైతాంగం నేడు స్వరాష్ట్రం లో కాళేశ్వరం ప్రాజెక్టు, నీటి ప్రాజెక్టులు మరియు రైతు బంధు,రైతు భీమా,ఉచిత కరెంట్ ఇతర రైతు సంక్షేమ పథకాల ద్వారా తెలంగాణ పచ్చని పంట పొలాలతో దేశానికి అన్నం పెట్టే స్థాయికి ఎదిగింది.


ఆమరవీరుల త్యాగాలు స్మరిస్తూ, తెలంగాణ ప్రజల స్వప్నాన్ని సాకారం చేస్తూ గౌ.ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు.


75 సంవత్సరాల లో జరగని అభివృద్ధి ని 9 ఏండ్ల కాలం లో అభివృద్ధి - సంక్షేమంలో  తెలంగాణ రాష్ట్రం దేశానికీ మోడల్ గా నిలిచింది.


తెలంగాణ సంస్కృతి,సంప్రదాయాలు,పండుగలు మరియు కళలను గుర్తించిన గౌ.ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారు తెలంగాణ విశిష్టత ను ప్రాముఖ్యత ను ప్రపంచానికి చాటి చెప్పారు.


తెలంగాణ రాష్ట్ర ఆవతరణ దశాబ్ది ఉత్సవాల్లో ప్రజాప్రతినిధులు అధికారులు సమన్వయం తో పనిచేసి వేడుకలను విజయవంతం చేయాలని కోరుతున్నాను.


ఈ కార్యక్రమంలో BRS కార్పొరేటర్ లు,నాయకులు పాల్గొన్నారు.

Featured Post

ఉన్నత విద్యామండలి రెగ్యులర్‌ ఛైర్మన్‌గా లింబాద్రి*

  * 🔊ఉన్నత విద్యామండలి రెగ్యులర్‌ ఛైర్మన్‌గా లింబాద్రి * * 🔶ఉపాధ్యక్షుడిగా షేక్‌ మహమూద్‌ * * 🍥ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్ర ఉన్నత విద్యామం...