మద్యం సేవించి వాహనాలు నడిపితే జరిమాన, జైలు తప్పదు*ట్రాఫిక్ సిఐ శ్రీను* ,


*మద్యం సేవించి వాహనాలు నడిపితే జరిమాన, జైలు తప్పదు* ,

*మూడోసారి దొరికిన వ్యక్తికి 30 రోజుల జైలు: ట్రాఫిక్ సిఐ శ్రీను* 



- - ప్రమాదాల నివారణ లక్ష్యంగా డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు


నల్లగొండ : మద్యం సేవించి వాహనాలు నడిపితే జరిమానాలతో పాటు జైలు శిక్ష తప్పదని ట్రాఫిక్ సిఐ చీర్ల శ్రీను హెచ్చరించారు.


గురువారం  నాడు మద్యం సేవించి వాహనాలు  నడుపుతూ పట్టుబడిన 15 మందిలో

ఒకరు మూడోసారి దొరికినందున అతనికి 3000 రూపాయల ఫైన్ మరియు 30 రోజుల  జైలు శిక్ష  మరియు మిగిలిన 14 మంది వ్యక్తులకు జరిమానా విధించారని వివరించారు. మొత్తం 15 మందికి గాను 25,500/- రూపాయల జరిమాన విధించారని ఆయన తెలిపారు. రోడ్డు ప్రమాదాల నివారణ లక్ష్యంగా క్రమం తప్పకుండా డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలను నిర్వహించడంతో పాటు రోడ్డు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. 

ఈ కార్యక్రమంలో సీఐతో పాటు, ట్రాఫిక్ సిబ్బంది ఏఎస్ఐ సత్యనారాయణ  పిసీలు అహ్మద్ ఇక్బాల్ మరియు లింగయ్య ఉన్నారు.

Featured Post

ఉన్నత విద్యామండలి రెగ్యులర్‌ ఛైర్మన్‌గా లింబాద్రి*

  * 🔊ఉన్నత విద్యామండలి రెగ్యులర్‌ ఛైర్మన్‌గా లింబాద్రి * * 🔶ఉపాధ్యక్షుడిగా షేక్‌ మహమూద్‌ * * 🍥ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్ర ఉన్నత విద్యామం...