జిల్లా లో 6 లక్షల మెట్రిక్ టన్నుల లక్ష్యం దాటిన ధాన్యం కొనుగోళ్లు::*అదనపు కలెక్టర్ భాస్కర్ రావు*

 *జిల్లా లో 6 లక్షల మెట్రిక్ టన్నుల లక్ష్యం దాటిన ధాన్యం కొనుగోళ్లు*


     :*అదనపు కలెక్టర్ భాస్కర్ రావు*


*రైస్ మిల్లర్లు,అధికారులతో కొనుగోళ్ల పై సమీక్ష*

నల్గొండ,మే 25. యాసంగి సీజన్ లో జిల్లా ఆరు లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసి లక్ష్యం దాటి రాష్ట్రం లో ముందజ లో ఉందని అదనపు కలెక్టర్ భాస్కర్ రావు తెలిపారు.

ధాన్యం కొనుగోళ్లు తుది దశకు చేరుకున్నట్లు,రైతులకు ఇబ్బంది లేకుండా

రైస్ మిల్లర్లు మిగిలిన ధాన్యం దించు కునేందుకు సహకరించాలని అదనపు కలెక్టర్  కోరారు.గురువారం జిల్లా కలెక్టర్ కార్యాలయం లోని అదనపు కలెక్టర్ ఛాంబర్ లో పౌర సరఫరాల శాఖ అధికారులు,డి.అర్.డి. ఓ,సహకార శాఖ అధికారులు,లారీ ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్లు,

రైస్ మిల్లర్లు తో  సమావేశం నిర్వహించారు.అదనపు కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటికే 79వేల మంది రైతుల నుండి ఆరు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోళ్లు చేసి నట్లు వెల్లడించారు.జిల్లాలో సుమారు గా ఇంకా 50 వేల నుండి 60 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఉందని,ప్రతి మిల్లర్ కొనుగోలు కేంద్రం నుండి వచ్చిన ధాన్యం లారీ ల నుండి దిగుమతి చేసుకోవాలని ఆయన సూచించారు.వాతావరణ పరిస్థితుల్లో మార్పులు సంభవించే అవకాశం వున్నట్లు,మిల్లర్ లు ధాన్యం అన్ లోడ్ చేసుకుంటే వారం రోజుల్లో కొను గోలు కేంద్రాలు మూత పడతాయని అన్నారు.కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు,వ్యవసాయ శాఖ తాలు,రాళ్ళు లేకుండా శుభ్ర పరచిన ధాన్యం  ను కొనుగోలు చేసి మిల్లు లకు పంపించాలని ఆయన కోరారు. ఈ సమావేశం లో జిల్లా పౌర సరఫరాల అధికారి వెంకటేశ్వర్లు,జిల్లా పౌర సరఫరాల డి.యం.నాగేశ్వర రావు, డి.అర్.డి.ఓ కాళిందిని ,జిల్లా సహకార అధికారి శ్రీనివాస్,రైస్ మిల్లర్ అసోసియేషన్ నల్గొండ యాధ గిరి,మిర్యాలగూడ నుండి శ్రీనివాస్,రమేష్ తదితరులు పాల్గొన్నారు

Featured Post

ఉన్నత విద్యామండలి రెగ్యులర్‌ ఛైర్మన్‌గా లింబాద్రి*

  * 🔊ఉన్నత విద్యామండలి రెగ్యులర్‌ ఛైర్మన్‌గా లింబాద్రి * * 🔶ఉపాధ్యక్షుడిగా షేక్‌ మహమూద్‌ * * 🍥ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్ర ఉన్నత విద్యామం...