*--- మహిళా పైన అసభ్యంగా ప్రవర్తించిన కేసులో నిందితునికి ఒక సంవత్సరం జైలు మరియు జరిమానా*
*---జిల్లా యస్.పి కె.అపూర్వ రావు
ఐ.పి.యస్*
మహిళా పైన అసభ్యంగా ప్రవర్తించిన కేసులో నిందితునికి నిడ్మనూర్ JFCM కోర్టు ఒక సంవత్సరం జైలు మరియు 1000 రూ" జరిమానా విధించినట్లు జిల్లా యస్.పి గారు తెలిపారు. వివరాలలోకి వెళితే.. తేదీ 12-03-2017 నాడు చలకుర్తి గ్రామానికి చెందిన ఒక మహిళా సాయంత్రం హాలియా నుండి చలకుర్తి వెళ్ళే క్రమంలో ఆటో డ్రైవర్ అయిన నిందితుడు మల్లేపల్లి నాగేంద్ర @ నాగరాజు s/o రాజయ్య R/o చలకుర్తి,పెద్దవూర మండలం మార్గ మధ్యలో మహిళా పైన అసభ్యంగా ప్రవర్తించాడని పెద్దవూర పోలీస్ స్టేషన్ లో తేది 15-03-2017 రోజున బాధిత మహిళా నిందితుడు నాగేంద్ర పైన ఇచ్చిన పిర్యాదు మేరకు పెద్దవూర పోలీస్ స్టేషన్ లో Cr. నం. 47/2017, CCNo. 897/2017 U/s 354 , 504, 506 R/w 34 IPC కింద కేసు నమోదు చేయగా పూర్తి స్థాయి విచారణ అనంతరం నేడు నిడ్మనూరు జెఎఫ్‌సిఎం కోర్టు,మేజిస్ట్రేట్ గౌరవనీయులు శ్రీమతి. స్వప్న గారు నిందితునికి ఒక సంవత్సరం జైలు శిక్ష &1000/-రూ జరిమానా తీర్పును విధించినట్లు జిల్లా యస్.పి గారు తెలిపారు.
ఈ సందర్భంగా సరిఅయిన ఆధారాలు సేకరించి కోర్టుకి అందజేసి నిందితుని శిక్ష పడే విధంగా చేసిన అప్పటి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కె.శ్రీనివాస్ ప్రస్తుత యస్.ఐ పి.పరమేష్,APP సాధన కోర్టు డ్యూటీ ఆఫీసర్ రవి కుమార్, లైజెనింగ్ ఆఫీసర్ SK. అలీ హమ్మద్ గారిని యస్.పి గారు అబినందిచారు