న్యాయమూర్తులకు శాశ్వత నివాస గృహాలు *మంత్రి జగదీష్ రెడ్డి*




కేసుల స్టడీలో సాంకేతికతో పోటీ పడాలి


రోడ్డు ప్రమాదాలలో కారణాలు గుర్తించాలి


ప్రమాదాలకు తరచు కారణమౌతున్న సంస్థలను గుర్తించాలి


న్యాయమూర్తులకు శాశ్వత నివాస గృహాలు


*మంత్రి జగదీష్ రెడ్డి*


కేసుల స్టడీలో మారుతున్న సాంకేతికతకు అనుగుణంగా న్యాయవాదులు స్టడీ చెయ్యాలని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం సాయంత్రం నల్లగొండ జిల్లా కోర్టులో జరిగిన న్యాయవాదుల వార్షికోత్సవానికి ఆయన ముఖ్య అతిధిగా హాజరయ్యారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి లక్ష్మణ్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి నాగరాజు లు పాల్గొన్న ఈ కార్యక్రమానికి బార్ కౌన్సిల్ అధ్యక్షుడు నేతి రఘుపతి అధ్యక్షత వహించారు.ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అంది పుచ్చుకుని కేసుల సత్వర పరిష్కారానికి కృషి చెయ్యాలన్నారు.అదే విదంగా రోడ్డు ప్రమాదాలపై ప్రత్యేక దృష్టి సారించాపన్నారు.తరచుగా ప్రమాదాలకు కారణమౌతున్న సంస్థలను గుర్తించి వారిలో అవగాహన కలిగించాలన్నారు.అందుకు న్యాయమూర్తులు న్యాయవాదులకు ప్రోత్సాహం కల్పించాలని ఆయన కోరారు.నల్లగొండ జిల్లా కేంద్రంలోనీ కోర్టు ప్రాంగణంలో న్యాయమూర్తులకు శాశ్వతంగా నివాస భవనాలు నిర్మించే విషయాన్ని పరిశీలనలోకి తీసుకుంటామన్నారు.


*-సీనియర్ న్యాయ వాదులకు సన్మానం*


అనంతరం న్యాయవాద వృత్తిలో 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సీనియర్ న్యాయ వాదులు కోలనుపాక మురళీధర్ రావు,బి.రామిరెడ్డి లను మంత్రి జగదీష్ రెడ్డి,హైకోర్టు న్యాయమూర్తి లక్ష్మణ్,జిల్లా న్యాయమూర్తి నాగరాజు ల చేతుల మీదుగా ఘనంగా సత్కరించారు.

Featured Post

ఉన్నత విద్యామండలి రెగ్యులర్‌ ఛైర్మన్‌గా లింబాద్రి*

  * 🔊ఉన్నత విద్యామండలి రెగ్యులర్‌ ఛైర్మన్‌గా లింబాద్రి * * 🔶ఉపాధ్యక్షుడిగా షేక్‌ మహమూద్‌ * * 🍥ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్ర ఉన్నత విద్యామం...