క్రికెట్ బెట్టింగ్ లకు పాల్పడుతున్న తొమ్మిది మంది నిందితులను అరెస్టు చేసిన నల్లగొం -జిల్లా యస్.పి కె.అపూర్వ రావు


 *క్రికెట్ బెట్టింగ్ లకు పాల్పడుతున్న తొమ్మిది మంది నిందితులను అరెస్టు చేసిన నల్లగొం



డ జిల్లా పోలీసు* .. 

-జిల్లా యస్.పి కె.అపూర్వ రావు IPS

*వీరి వద్ద నుండి 1 కోటి 12 లక్షల రూపాయల నగదు, రెండు కార్లు (30 లక్షల విలువ ) ,14 సెల్ ఫోన్స్ (3 లక్షలు విలువ), మొత్తం1 కోటి 45 లక్షల రూపాయల విలువ స్వాదీనం* . 

*చట్టవ్యేతిరేకమైన  కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు* 

           తేదీ 25.04.2023 న సుమారు 20:30 గంటల సమయంలో, మిర్యాలగూడ 1 టౌన్‌ పరిదిలో మయూరినగర్ హౌసింగ్ బోర్డులోని ఫ్లాట్ నెం.303 సాయిదత్త అపార్ట్‌మెంట్‌లో చట్టవిరుద్ధమైన  కార్యకలాపాలు అయిన క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నారు అనే  విశ్వసనీయ సమాచారం ప్రకారం మిర్యాలగూడ I టౌన్ సి.ఐ రాఘవేందర్ SI శివ తేజ్, టాస్క్ ఫోర్స్ సిబ్బంది మరియు  స్పెషల్ టీమ్  యస్.ఐ కట్టంగూర్ విజయ్ కుమార్, మిర్యాలగూడ 2 టౌన్ యస్.ఐ వెంకటేశ్వర్లు, హాలియా పి.యస్ కానిస్టేబుల్  కొమ్ము రవి, రహిమాన్ సంయుక్తంగా అపార్ట్మెంట్లోకి ప్రవేశించి ఆన్‌లైన్ IPL బెట్టింగ్ నిర్వహిస్తున్న మొత్తం 9 మంది వ్యక్తులను పట్టుకుని వారిని విచారించగా...

నిందితుల వివరాలు..

1) బంటు రాజేష్ S/O రాములు, వయస్సు: 29 సంవత్సరాలు, Occ: క్రికెట్ బెట్టింగ్, R/O ఫ్లోట్ నెం.303 సాయిదత్తా  అపార్ట్‌మెంట్, మయూరి నగర్ హౌసింగ్ బోర్డ్,  మిర్యాలగూడ టౌన్ ఈదుల్‌గూడ.

2) కోల సాయి కుమార్ S/O వెంకటేశ్వర్లు, వయస్సు: 23 సంవత్సరాలు, Occ: మెడికల్ రెప్., R/O H నం. 11-45, బోనకల్, రైల్వే స్టేషన్ సమీపంలో, బోనకల్ మండలం, ఖమ్మం జిల్లా,

 3) రాచబంతి జీవన్ కుయిమార్ S/O వెంకటేశ్వర్ రావు, వయస్సు: 30 సంవత్సరాలు,  Occ: NSE వ్యాపారి, R/O H నం. 11-50, రైల్వే స్టేషన్ సమీపంలో బోనకల్, ఖమ్మం జిల్లా.

 4) నోట్ల సత్యనారాయణ S/O నూకరాజు, వయస్సు: 52 సంవత్సరాలు, Occ: మార్బుల్ వర్కర్, R/O H-No.  2-6, B బ్లాక్, నామవరం, రాజమహేంద్రవరం, తూర్పు గోదావరి జిల్లా,

 5) శాకమూరి ఉదయ్ కుమార్ S/O శివ నాగేశ్వర్ రావు, వయస్సు: 34 సంవత్సరాలు, Occ: టిఫిన్ సెంటర్ వ్యాపారం, R/O H నెం. 2-5-110, వాండర్ కిడ్స్ స్కూల్ సమీపంలోని భక్తపోతన వీధి, ఖమ్మం జిల్లా

 6) బంటు సంతోష్ S/O వెంకటేశ్వర్లు, వయస్సు: 29 సంవత్సరాలు, Occ: రైస్ మిల్లు గుమస్తా, R/o H.No.  3-114, గాంధీ నగర్,  మిర్యాలగూడ, నల్గొండ జిల్లా,

 7) గంధం నవీన్ కుమార్ S/O వెంకట నర్సయ్య, వయస్సు: 29 సంవత్సరాలు,  Occ: నిరుద్యోగి, R/O H. నెం. 5-233, షాబునగర్, మిర్యాలగూడ, నల్గొండ జిల్లా,

 8) బంటు వంశీ కృష్ణ S/O లక్ష్మీనారాయణ, వయస్సు: 30 సంవత్సరాలు, Occ: టెంట్ హౌస్ వ్యాపారం, R/O H నెం. 5-250, షాబునగర్, మిర్యాలగూడ, నల్గొండ జిల్లా,

 9) కొండవేటి రాజేష్ S/O రత్నారావు, వయస్సు: 35 సంవత్సరాలు,  Occ: యశోద హాస్పిటల్ మలక్‌పేటలో PRO, R/O H నెం. 4-7-125, ప్రకాష్‌నగర్, ఖమ్మం II టౌన్, ఖమ్మం జిల్లా.

        ఈ ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్‌లో కీలక వ్యక్తి ఏ 1 అయిన బంటు రాజేష్‌ కుమార్  గత మూడు సంవత్సరాలుగా  ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్‌ను నిర్వహిస్తాడు. ఇతను టెలిగ్రామ్ యాప్‌ ద్వారా  హార్దిక్ బుక్కీ ప్యానల్ (https://dubaiexch24.com) నుండి మెయిన్ లైన్ యాక్సెస్‌ని తీసుకున్నాడు, ఈ లింకును తన బామ్మర్ది అయిన కోలా సాయికుమార్ ఫార్వర్డ్ చేసి ఇట్టి యాప్ ద్వారా మొబైల్ ఫోన్స్ కు  కనెక్ట్ చేసి ఆన్  లైన్ లో  చాలామందికి ఆన్లైన్ కమిషన్ ద్వారా పైన తెల్పిన వ్యక్తుల సహాయముతో ఈ నెట్వర్క్ లో జాయిన్ చేసుకొని, ఆన్ లైన్ మరియు ఆఫ్ లైన్ లో ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ పెడుతూ  సులువుగా  డబ్బు సంపాదిస్తారు. అదే విదముగా ఈ రోజు రాజేశ్ ఇంట్లో,కోలా సాయికుమార్, రాచకొండ జీవన్ కుమార్,నోట్ల సత్యనారాయణ, శాకమూరి  ఉదయ్ కుమార్, బంటు సంతోష్, గందం నవీన్ కుమార్, బంటు వంశీకృష్ణ మరియు కొండవీటి రాజేష్ లు  సాయి దత్త అపార్ట్మెంట్, మయూరి నగర్, హౌసింగ్ బోర్డ్ నందు  ఆన్ లైన్ ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ ఆడుచుండగా,  పట్టుబడిచేసి Cr.No. 106/2023 U/s 3& 4 TS Gaming Act క్రింద కేసు నమోదు రిమాండ్ కి పంపనైనది. గతంలో ఏ1 రాజేష్ కుమార్ పైన క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తుండగా  హైద్రాబాద్ లోని సరూర్ నగర్ పోలీసు స్టేషన్ లో Cr.No. 215/2021 U/s 3& 4 TS Gaming Act క్రింద కేసు నమోదు చేయబడింది. 

ఈ కేసును చాకచక్యంగా డియస్పీ వెంకటగిరి గారి పర్యవేక్షనలో మిర్యాలగూడ 1 టౌన్ సి.ఐ రాఘవేందర్,యస్.ఐ శివ తేజ, యస్.ఐ కట్టంగూర్ విజయ్ కుమార్, మిర్యాలగూడ 2 టౌన్ యస్.ఐ వెంకటేశ్వర్లు, హెడ్ కానిస్టేబుల్ గఫార్, కానిస్టేబుల్స్ కొమ్ము రవి హాలియా పి.యస్ , రహిమాన్, జి. హుస్సేన్, బి. వీరబాబు, ఎస్. వెంకటేశ్వర్లు, ఎం. సైదులు గార్లను జిల్లా యస్.పి గారు అబినందించినారు.

Featured Post

ఉన్నత విద్యామండలి రెగ్యులర్‌ ఛైర్మన్‌గా లింబాద్రి*

  * 🔊ఉన్నత విద్యామండలి రెగ్యులర్‌ ఛైర్మన్‌గా లింబాద్రి * * 🔶ఉపాధ్యక్షుడిగా షేక్‌ మహమూద్‌ * * 🍥ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్ర ఉన్నత విద్యామం...