పెండింగ్ కేసులను సత్వరం పరిష్కరించాలని ఆదేశం* *జిల్లా యస్.పి కె అపూర్వ రావు

*నేర సమీక్షా సమావేశం* 

.. *పెండింగ్ కేసులను సత్వరం పరిష్కరించాలని ఆదేశం* 

 *జిల్లా యస్.పి కె అపూర్వ రావు



IPS* 

 *...కోర్టు తీర్పులలో శిక్షల శాతం పెరిగేలా కృషి చేయాలి** 

 *...*పోలీస్ శాఖ అమలు చేస్తున్న పంక్షనల్ వర్టీకల్స్ సమర్థవంతంగా అమలయ్యేలా చూడాలని ఆదేశం* 

 *---విది నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన అధికారులకు సిబ్బందికి ప్రశంసా పత్రాలు** .

 

తెలంగాణ రాష్ట పోలీసు శాఖ చేపట్టిన ఫంక్షనల్ వర్టికల్స్ పటిష్ట అమలు అయ్యేలా చూడాలని మరియు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటూ నేర విచారణలో క్వాలిటీ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ద్వారా కన్విక్షన్ రేటుని పెంచాలని, జిల్లాలోని ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో పెండింగ్ కేసులు లేకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని  పోలీస్ అధికారులను  జిల్లా ఎస్పీ గారు ఆదేశించారు.

        

      జిల్లా పోలీస్  కార్యాలయంలో పోలీస్ అధికారులతో నిర్వహించిన నేర సమీక్షా సమావేశంలో గత నెలలో జరిగిన నేరాలపై చర్చించి పెండింగ్ కేసులను త్వరితంగా పరిష్కరిస్తూ పెండింగ్ కేసుల సంఖ్య తగ్గించడానికి చర్యలు తీసుకోవాలని, దీర్ఘకాలంగా పెండింగులో ఉన్న కేసులపై ప్రత్యేక దృష్టి సారించి వెంటనే వాటిని పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలన్నారు. పెండింగ్ కేసుల విషయంలో నిరంతర పర్యవేక్షణ ఉంటుందని, కొత్త కేసులతో పాటు చాలా కాలంగా పెండింగ్ కేసులను ఎప్పటికప్పుడు సమీక్షించడం ద్వారా కేసుల సంఖ్య తగ్గించే దిశగా అన్ని స్థాయిల అధికారులు  పని చేయాలన్నారు. పెండింగ్ కేసుల పరిష్కారానికి చొరవ చూపించి వాటి సంఖ్యను తగించేలా కృషి చేయాలని అన్నారు .ఇందుకోసం కోర్టులలో న్యాయమూర్తులతో చర్చించి కేసుల పురోగతి, విచారణ  విషయాలలో అధికారులంతా చురుకుగా పని చేయాలని సూచించారు. ఇదే సమయంలో కోర్టు కేసులలో శిక్షల శాతం మరింత పెరిగే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. తెలంగాణ రాష్ట పోలీసు శాఖ చేపట్టిన ఫంక్షనల్ వర్టికల్స్ పటిష్ట అమలు పరుస్తూ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటూ ప్రజలకు   మెరుగైన సేవలు అందించాలని అన్నారు. నేర నియంత్రణలో బాగంగా సొసైటీ పర్ పబ్లిక్ సేఫ్టీ లో  బాగంగా  ప్రతి పట్టణంలోని కాలనీల్లో,గ్రామాలలో, సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకునేల ప్రజలకు, వ్యాపారులకు అవగాహన కల్పించాలన్నారు.  ఇసుక అక్రమ రవాణాను అరికట్టాలని, ప్రమాదాల నివారణ కొరకు రోడ్డు భద్రతపై అవగాహన సమావేశాలు నిర్వహించాలని, పీడీఎస్ బియ్యం అక్రమ నిల్వలను అరికట్టాలని, అక్రమ గంజా రవాణా, పేకాట, మట్కాలను అరికట్టాలన్నారు. దొంగతనాలు జరగకుండా  రాత్రి పూట గస్తి  బీట్‌లు, పెట్రోలింగ్‌ నిర్వహించాలని 100 కాల్ కి వెంటనే స్పందించి ఆపదలో ఉన్న వారికి తక్షణ సహాయం అందజేయలాని అన్నారు.

      

   విధినిర్వహణలో ప్రతిభ కనబరిచిన పోలీస్ అధికారులను సిబ్బందిని అభినందించారు. మరియు ప్రతిభ కనబరిచే సిబ్బందిని అధికారులను గుర్తించి ప్రతి నెల  అధికారులను సిబ్బందిని ప్రోత్సహించే విధంగా రివార్డులు, అవార్డులు, ఇవ్వడం జరుగుతుందన్నారు. ప్రతి ఒక్కరూ ప్రజల కోసం అంకితభావంతో విధులు నిర్వహించి ప్రజలకు ఎల్లవేళలా సేవలు  అందించడానికి అందుబాటులో ఉండాలని సూచించారు, మరియు ప్రతి ఒక్కరూ ఫంక్షనల్ వర్టికల్ వారిగా . కష్టపడి అంకితభావంతో విధులు నిర్వహించాలని అన్నారు. జిల్లాలో పలు విభాగాలలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 25 మంది సిబ్బందికి ప్రశంసా పత్రాలు అందజేశారు.

      ఈ కార్యక్రమంలో ప్రొబేషనరీ ఐపీఎస్ శేషాద్రిని రెడ్డి,అడిషనల్ ఎస్పీ కె.ఆర్.కె రావు,డిఎస్పీ లు  నరసింహ రెడ్డి, వెంకటగిరి, నాగేశ్వర రావు,రమేష్,సిఐ లు మరియు యస్.ఐలు పాల్గొన్నారు.

Featured Post

ఉన్నత విద్యామండలి రెగ్యులర్‌ ఛైర్మన్‌గా లింబాద్రి*

  * 🔊ఉన్నత విద్యామండలి రెగ్యులర్‌ ఛైర్మన్‌గా లింబాద్రి * * 🔶ఉపాధ్యక్షుడిగా షేక్‌ మహమూద్‌ * * 🍥ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్ర ఉన్నత విద్యామం...