====
=====
ఆనాటి జ్ఞాపకాలు ఎప్పటికీి మధురస్మృతులే నని నాటి విద్యార్థులు ఈ నాటి పలువురు ప్రముఖులు పేర్కొన్నారు. నాగార్జున సాగర్ లోని రెసిడెన్సీయల్ జూనియర్ కళాశాల పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం హైదరాబాద్ నగర శివారులో నిర్వహించారు. ఇదే కళాశాలలో విద్యనభ్యసించి దేశ విదేశాలలోను, ప్రభుత్వ, ప్రయివేట్ రంగంలో స్థిరపడిన పూర్వ విద్యార్థులు అంతా వారి వారి కుటుంబ సభ్యులతో ఒకే చోట కలుసుకుని, పాత జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. ఆనాటి మరపురాని మధురమైన సంఘటనలు, చిలిపి చేష్టలను గుర్తుకు తెచ్చుకుని ఆద్యంతం ఉల్లాసంగా, సంతోషంగా గడిపారు. ఒకరినొకరు అలింగనం చేసుకున్నారు.. కళాశాల లో చదువులమ్మ ఒడిలో నేర్చుకున్న విద్యా బుద్ధులు, సంస్కారం నేడు గుర్తుకొస్తున్నాయి.. అంటూ ఆనంద భాష్పాలతో వారి గత అనుభవాలను నెమరు వేసుకున్నారు. క్లాస్ మేట్స్, బెంచ్‌మేట్స్‌హొ ఆత్మీయ ఆలింగనంతో ఒకింత ఉద్వేగానికి లోనయ్యారు. ఆనాటి అధ్యాపకులు తమ పట్ల చూపిన అభిమానాన్ని పూర్వ విద్యార్థులు గుర్తు చేయనుకున్నారు. ఈ సందర్బంగా వివిధ హోదాల్లో విధులు నిర్వహించి రిటైర్ అయినా వారితో పాటు పలు రంగాల్లో ఉన్నత స్థాయికి చేరుకున్న వారిని నమస్కార వదనంతో సంస్కారం మేళవించి ఘనంగా సత్కరించి గౌరవించారు. ఆనాటి విద్యార్థులకు చదువు చెప్పిన అప్పటి గురువులు బోధించిన తిరును అంతా పలు మార్లు పదే పదే మననం చేసుకున్నారు.
పూర్వ విద్యార్థులు మాట్లాడుతూ చదువు చెప్పిన గురువులను మరచిపోకుండా వారిని గౌరవించడం మన బాధ్యతగా భావిస్తూ 13 సంవత్సరాలుగా క్రమం తప్ప కుండా పూర్వ విద్యార్షుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించు కుంటున్నామని చెప్పారు.
మిగిలిన స్నేహితులుతో ప్రతి ఒక్కరూ కలిసి ఎవరైనా ఆర్థిక ఇబ్బందులతో ఉన్న వారికీ తమ వంతు ఆర్దిక సహాయం అందిస్తున్నట్లు తెలియజేశారు. ఇదే కళాశాల లో చదువుకున్న పూర్వ విద్యార్థి ఒకరు రోడ్డు ప్రమాదంలో రెండు కాళ్లు కోల్పోయాడు. అతనికి తమ వంతు సహాయం అంద చేశారు.అనంతరం పూర్వ విద్యార్థులు ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకొని సరదాగా గడిపారు. వివిధ రంగాలలో తమ స్నేహితులు మంచి హోదాలో ఉండడం కొందరు స్వయం ఉపాధిలో మరికొందరు ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాల్లో ఉండడం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందన్నారు. ఈ సందర్బంగా కళా శాల అధ్యాపక బృందన్ని సన్మానించారు.అందరూ కలిసి సహపంక్తి భోజనాలు ఆరగించారు. గ్రూప్ ఫొటోలు దిగి కొంగొత్త జ్ఞాపకాలు పథిలం చేసుకున్నారు. ఈ ఆత్మీయ సమ్మేళనంలో మాజీ డీజిపి మహేందర్ రెడ్డి, రిటైర్డ్ ఐఆర్ఎస్ అధికారి లక్ష్మి నారాయణ, ఐ ఎఫ్ ఎస్ అధికారి సిహేచ్ రాజశేఖర్, మధు సుధన్.డాక్టర్ సుబ్రహ్మణ్యశ్వర్ రావు. ఎంఎం. రావు వీరనంది నాగా చారి. సైదారెడ్డి.
డాక్టర్ రాజేశ్వర్ రావు, కళా శాల ప్రిన్సిపాల్ రంగచార్యులు సహా దాదాపు ఐదు వందల మంది పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.