నీటి ఎద్దడి రాకుండా చర్యలు తీసుకోవాలి: మున్సిపల్ కమిషనర్ రమణాచారి

 నీటి ఎద్దడి  రాకుండా చర్యలు తీసుకోవాలి

 




పట్టణంలో ఎక్కడ కూడా నీటి ఎద్దడి రాకుండా తగు ముందస్తు చర్యలు చేపట్టాలని మున్సిపల్ కమిషనర్ డాక్టర్ కేవీ రమణాచారి సంబంధిత మున్సిపల్ అధికారులకు సూచించారు. మంగళవారం మున్సిపల్ ఇంజనీర్లతో కలిసి  పట్టణంలోని వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ ను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నీటి సరఫరాకు సంబంధించి విధిగా రికార్డులలో నమోదు చేయాలని సూచించారు. ట్యాంకులను, పైపులను ఎప్పటికప్పుడు శుభ్రపరుస్తూ ఉండాలని సూచించారు. అనంతరం ఎనిమల్ బర్త్ సెంటర్ ను తనిఖీ చేసి అక్కడ సిబ్బందితో మాట్లాడారు. పట్టణంలోని వివిధ వార్డులలో ఉన్న  శునకాలను  పట్టుకొని ఆపరేషన్ చేసి విడిచి పెట్టాలని ఆదేశించారు. ఎనిమల్ బర్త్ సెంటర్ ను  శుభ్రంగా ఉంచుకోవాలని సిబ్బందికి సూచించారు. అనంతరం డిఆర్సి సెంటర్, వర్మి కంపోస్ట్ సెంటర్ ను కూడా తనిఖీ చేశారు. తడి, పొడి చెత్తతో తయారుచేసిన స్వచ్ఛమైన ఎరువు ను   నల్లగొండ మున్సిపాలిటీలో కిలో 10 రూపాయలకు విక్రయిస్తున్నట్లు  తెలిపారు. ప్రజలు తమ పరిధిలోని పెరట్లు, తోటలు, ఆగ్రో ఫామ్ లలో స్వచ్ఛమైన సేంద్రియ ఎరువును వినియోగించుకోవాలని కోరారు. ఆసక్తి గలవారు 7013957178 సంప్రదించాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వెంట ఈఈ రాములు, డిఈ వెంకన్న, ఏసీపీ నాగిరెడ్డి, ఏఈ దిలీప్, సానిటరీ ఇన్స్పెక్టర్ మూర్తిజ, హరితహారం, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Featured Post

ఉన్నత విద్యామండలి రెగ్యులర్‌ ఛైర్మన్‌గా లింబాద్రి*

  * 🔊ఉన్నత విద్యామండలి రెగ్యులర్‌ ఛైర్మన్‌గా లింబాద్రి * * 🔶ఉపాధ్యక్షుడిగా షేక్‌ మహమూద్‌ * * 🍥ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్ర ఉన్నత విద్యామం...