డిండి పోలీస్ స్టేషన్ ను సందర్శించిన జిల్లా యస్.పి శ్రీమతి కె.అపూర్వ రావు

*డిండి పోలీస్ స్టేషన్ ను సందర్శించిన జిల్లా యస్.పి శ్రీమతి కె.అపూర్వ రావు



ఐ పి యస్* 


 *ప్రజలు ఎల్లవేళలా అందుబాటులో ఉండాలి* 


 *ప్రజా సమస్యలను ఓపికతో విని బాధితులకు న్యాయం జరిగే విధంగా చేయాలి* .

 


           ఈ రోజు జిల్లా ఎస్.పి కె అపూర్వ రావు ఐ.పి.యస్  గారు డిండి  పోలీస్ స్టేషన్ ను సందర్శించి పోలీస్ స్టేషన్ పరిసరాలను పరిశీలించారు. పోలీస్ సిబ్బంది నిర్వహిస్తున్న విధుల పని తీరు గురించి యస్. ఐ గారు ఎస్పీ గారికి వివరించారు. అనంతరం జిల్లా ఎస్పీ గారూ మాట్లాడుతూ  అక్కడి సిబ్బందికి పలు సూచనలు చేస్తూ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ,  పోలీస్ స్టేషన్ కు వచ్చే ఫిర్యాదిదారులతో మర్యాదపుర్యకంగా వుంటూ వారి యొక్క సమస్యలను ఓపికతో విని వాటిని పరిష్కరించాలని, ప్రజలకు మంచి సేవలు అందించేందుకు కృషి చేయాలని  సూచించారు. జిల్లా పోలీసులు ప్రజలకు జవాబుదారీగా పని చేస్తూ ప్రజా ఫిర్యాదులలో ఎటువంటి జాప్యం చేయకుండా తక్షణమే స్పందించాలని సూచించారు. బ్లూ కోట్స్, పెట్రో కార్స్ నిరంతరం పెట్రోలింగ్ నిర్వహించాలని మరియు డయల్100 కాల్స్ వచ్చిన వెంటనే తక్షణమే స్పందించి సంఘటన స్థలానికి చేరుకొని బాధితులకు న్యాయం చేయాలని సూచించారు. 

 ఈ కార్యక్రమంలో దేవరకొండ డిఎస్పీ నాగేశ్వర రావు, సిఐ పరశరాం యస్. ఐ గారు,మరియు సిబ్బంది పాల్గొన్నారు.

Featured Post

ఉన్నత విద్యామండలి రెగ్యులర్‌ ఛైర్మన్‌గా లింబాద్రి*

  * 🔊ఉన్నత విద్యామండలి రెగ్యులర్‌ ఛైర్మన్‌గా లింబాద్రి * * 🔶ఉపాధ్యక్షుడిగా షేక్‌ మహమూద్‌ * * 🍥ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్ర ఉన్నత విద్యామం...